BigTV English

Dilruba Movie Review : ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ

Dilruba Movie Review : ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ

Dilruba Movie Review : ‘క’ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘దిల్ రూబా’ అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి దీంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ :
సిద్ధు అలియాస్ సిద్దార్థ్ రెడ్డిది(కిరణ్ అబ్బవరం) ఉడుకురక్తం.ఇతని దృష్టిలో సారీ, థాంక్స్ అనే పదాలకి చాలా విలువ ఉంది అని చెబుతుంటాడు. వాటిని వాడే సందర్భానికి కూడా గౌరవం ఉండాలనేది అతని తపన. వీటి వల్ల వచ్చే కాన్ఫ్లిక్ట్స్ లో భాగంగా అతని మాజీ ప్రేయసి మ్యాగీ (కథి దేవిసన్) ను దూరం చేసుకుంటాడు. తర్వాత ఇతని లైఫ్లోకి అంజలి (రుక్సర్ థిల్లాన్) అనే మరో అమ్మాయి వస్తుంది. ఈమెతో కూడా సిద్ధుకి చాలా వరకు అలాంటి సమస్యలే వచ్చి పడతాయి. దీంతో అతని మాజీ ప్రేయసి సాయం కోరతాడు. ఆమె ఇతని లవ్ లైఫ్ లో వచ్చిన సమస్యలు తీర్చుకోవడానికి ఎలా సాయపడింది. మరోపక్క విక్కీ అనే వ్యక్తి సిద్ధుని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉంటాడు? అలాగే జోకర్ (జాన్ విజయ్) పాత్ర ఏమిటి? అసలు మ్యాగీతో సిద్ధు ఎందుకు విడిపోయాడు? అలాగే అంజలి, సిద్ధు..ల ప్రేమ గెలిచిందా? లేదా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

విశ్లేషణ :
‘దిల్ రూబా’ లో పెద్దగా కథ ఏమీ ఉండదు అని ఈపాటికే అందరికీ ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. ఒక సాదా సీదా పాయింట్ ని 2 గంటల 32 నిమిషాలు చెప్పాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వ కరుణ్. ఈ క్రమంలో యూత్ కి నచ్చే కొన్ని డైలాగులు, రొమాంటిక్ సీన్స్ బాగానే డిజైన్ చేసుకున్నాడు. కానీ హీరో క్యారెక్టరైజేషన్ విషయంలో తేడా కొట్టేసింది. ఓ స్టార్ హీరోకి పెట్టినట్టు ఇష్టమొచ్చినట్టు ఫైట్లు వంటివి పెట్టేశాడు. అవి ఎలివేషన్స్ అని అనుకోమన్నట్టు ఉంటాయి. కానీ కథ ఏంటో సరిగ్గా ఓ ఐడియా రాకుండా ఇలాంటి పైపై మెరుపులతో ఆడియన్స్ ఎంతవరకు కనెక్ట్ అవ్వగలరు.. ఎంతవరకు టైం పాస్ అనుకోగలరు.


పూరీ జగన్నాథ్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకుల సినిమాలను దర్శకుడు వరుసపెట్టి చూసుకుని ‘దిల్ రూబా’ స్క్రిప్ట్ ని డిజైన్ చేసుకున్నట్టు ఉన్నాడు. ఎక్కడా కూడా అతని మార్క్ కనిపించదు. ఇందాక చెప్పుకున్నట్టు.. ఆ టాప్ దర్శకుల సినిమాల్లోని సీన్స్ ని అక్కడక్కడా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడా కూడా సినిమా వేగం పుంజుకోదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాతల్లో ఒకరైన రవి చెప్పినట్టు ఫైట్స్ విషయంలో బాగా శ్రద్ద పెట్టినట్టు ఉన్నారు. ఒకటి, రెండు ఫైట్లు బాగున్నాయి.

కానీ వాటికి కిరణ్ కటౌట్ ఎందుకో సరిపోలేదేమో అనిపిస్తుంది. సామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లర్ అండ్ యాక్షన్ సినిమాలకి మాత్రమే సెట్ అవుతుంది అని మరోమారు ప్రూవ్ చేసిన సినిమా దిల్ రూబా. విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. సినిమాకి పెట్టిన బడ్జెట్కి సినిమాటోగ్రాఫర్ పనితనం వల్ల న్యాయం జరిగింది అని చెప్పొచ్చు.

నటీనటుల విషయానికి వస్తే.. కిరణ్ అబ్బవరం గత సినిమాలతో పోలిస్తే హ్యాండ్సమ్ గా, ఎనర్జిటిక్ గా కనిపించాడు. కానీ డైలాగ్స్ వద్ద కిరణ్ దొరికిపోతూ ఉంటాడు. అతను లౌడ్ గా డైలాగ్స్ చెబుతున్న టైంలో ఎంత ఇబ్బంది పడతాడో అందరికీ క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది. దిల్ రూబా విషయంలో కూడా అదే జరిగింది.

అలాగే అతన్ని తమిళ స్టార్ హీరో విజయ్ ని చూపించినట్టు ఫైట్స్ లో స్లో మోషన్లో చూపించమని మేకర్స్ ని ఎక్కువగా డిమాండ్ చేస్తాడు అనుకుంట అలాంటి షాట్స్ కూడా ఇందులో ఎక్కువగా కనిపిస్తాయి. హీరోయిన్లు రుక్సర్ ఎప్పటిలానే గ్లామర్ గా కనిపించింది. మరో హీరోయిన్ కథి దేవిసన్ హీరో కిరణ్ కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలా కనిపించింది. ఆమె గ్లామర్ అంతగా ఆకట్టుకోదు. జాన్ విజయ్ బాగానే చేశాడు.

ప్లస్ పాయింట్స్ :

సినిమాటోగ్రఫీ
డైలాగ్స్
2 ఫైట్లు

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
సాగదీత

మొత్తంగా ఈ ‘దిల్ రూబా’ .. పై పై మెరుపులతో ప్యాక్ చేసిన కథ. ఓపిక ఉంటే తప్ప థియేటర్లో రెండున్నర గంటల పాటు కూర్చుని చూడటం కష్టం.

Dilruba Telugu Movie Rating : 2 / 5

Related News

Mayasabha Review : మయసభ రివ్యూ 

Sir Madam Review : ‘సర్ మేడమ్’ మూవీ రివ్యూ… విడాకుల దాకా వెళ్లిన వింత గొడవ

Kingdom Movie Review : కింగ్డమ్ మూవీ రివ్యూ : ప్రయోగం సక్సెసా ?

Kingdom Twitter Review : ‘కింగ్డమ్’ ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ హిట్ కొట్టినట్లేనా.. ?

Kingdom Review: కింగ్డమ్ ఫస్ట్ రివ్యూ.. ఆశ్చర్యపరుస్తున్న ఉమైర్ సంధు ట్వీట్!

Mandala Murders series review : ‘మండల మర్డర్స్’ సిరీస్ రివ్యూ… కన్ఫ్యూజింగ్ మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×