E-Paper
Advertisement

Insurance Scam: నకిలీ వాహన బీమా ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్..!

Insurance Scam: నకిలీ వాహన బీమా ముఠా గుట్టురట్టు.. 9 మంది అరెస్ట్..!
Advertisement

Insurance Scam: స్వేచ్ఛ బ్యూరో: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వాహన భీమా సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను SOT మేడ్చల్ బృందం బట్టబయలు చేసింది. ఎన్‌ఎల్‌బీ నగర్‌లో నిర్వహించిన దాడిలో మొత్తం 9 మందిని అరెస్టు చేసి 441 నకిలీ వాహన భీమా సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పాలసీలలో హెచ్డిఎఫ్సి – 56 రాయల్ సుందరం – 192, బజాజ్ అలియాంజ్ – 101, కోటక్ – 41,రిలయన్స్ – 51 ఉండగా, వీటి మొత్తం ప్రీమియం విలువ సుమారు రూ. 91,74,686గా పోలీసులు తెలిపారు.

ఆర్టీఏ ఏజెంట్ బాబురావు..

SOT సూచనల మేరకు టి. గిరిధర్ గౌడ్ అనే ఏజెంట్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, రాగుల రవి, శివకుమార్, మాణిక్యాలరావు @ చంటి అనే ముగ్గురు ఎడిటర్లు నకిలీ భీమా సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. వీరితో పాటు ఒక ఆర్టీఏ ఏజెంట్ బాబురావు, మరో ఐదుగురు ఏజెంట్లు కూడా ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు తెలిసింది. పోలీసుల వివరాల ప్రకారం, కస్టమర్ల నుండి ఒక్కో పాలసీకి రూ. 2000 వసూలు చేసి, ఎడిటర్లకు రూ.800 నుండి 1000 వరకు చెల్లిస్తూ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేయించేవారు.

Advertisement

Also Read: Taapsee Pannu: అప్పుడలా.. ఇప్పుడిలా.. తాప్సీ మాటలు నమ్మడం ఎలా?

గత నాలుగేళ్లుగా..

ఏం ఎస్ ఆఫీస్ పరిజ్ఞానంతో QR కోడ్‌లతో కూడిన నకిలీ పాలసీలు రూపొందించి సాఫ్ట్ కాపీలను ఏజెంట్లకు పంపించేవారు. ఏజెంట్లు వాటిని ప్రింట్ తీసి కస్టమర్లకు అందజేసేవారు. గత నాలుగేళ్లుగా ఈ అక్రమ కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Also Read: Honda Activa: అమ్మకాల్లో హోండా యాక్టివా నయా రికార్డు, ఒకే రాష్ట్రంలో 50 లక్షల యూనిట్లు సేల్!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×