E-Paper
Advertisement

Srikakulam district: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహం

Srikakulam district: శ్రీకాకుళం జిల్లాలో విషాదం.. ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహం
Advertisement

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో చోటుచేసుకున్న అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గొండ్యాల పుట్టుగ సమీపంలో ఉన్న ఆర్ఎస్ఎస్ భవనం వద్ద ప్లాస్టిక్ కవర్‌లో శిశువు మృతదేహం లభ్యమవడం కలచివేసే విషయం. ఉదయం వేళ స్థానికులు అక్కడ ఓ కుక్క ప్లాస్టిక్ కవర్‌ను లాగుతూ తీసుకువెళ్లడాన్ని గమనించారు. అనుమానం కలగడంతో కవర్‌ను తెరిచి చూడగా లోపల శిశువు మృతదేహం ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు.

వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో కవిటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలన చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిశువు పుట్టిన వెంటనే మృతి చెందినదా..? లేక, మరే కారణాల వల్ల మృతి చెందిందా అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు.

Advertisement

ఘటనా స్థలానికి సమీపంలో రెండు ప్రైవేట్ ఆసుపత్రులు ఉండటంతో, అక్కడి నుంచే శిశువు మృతదేహాన్ని అక్రమంగా బయటకు తరలించి వదిలేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అలాగే, ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి అక్కడ వదిలేశారా అనే అనుమానాలనూ పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలు, ఆసుపత్రుల రికార్డులు పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అమానవీయ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×