BigTV English

Student Attacks Teacher: నిద్రపోతున్న టీచర్ గొంతుపై రంపంతో దాడి చేసిన విద్యార్థి.. అందరిముందు ఆ టీచర్ ఏం చేశాడంటే..

Student Attacks Teacher: నిద్రపోతున్న టీచర్ గొంతుపై రంపంతో దాడి చేసిన విద్యార్థి.. అందరిముందు ఆ టీచర్ ఏం చేశాడంటే..

Student Attacks Teacher| పిల్లలకు క్రమశిక్షణ నేర్పించడం కోసం టీచర్లు చాలాసార్లు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. ఆ వ్యవహరించినందుకే ఒక టీచర్ ఇప్పుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ టీచర్ ని హత్య చేసేందుకు ఒక విద్యార్థి రంపంతో దాడి చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.


వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ రాష్ట్రం గాజియాబాద్ జిల్లా తైదోయ్ గ్రామంలో ఉన్న ఓ మద్రసాలో ఆస్ మొహమ్మద్ అనే మౌలనా టీచర్ గా పనిచేస్తున్నాడు. అయితే ఆస్ మొహమ్మద్ పిల్లలకు క్రమశిక్షణ ఉండాలని మద్రసాలో కాస్త కఠినంగా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఆస్ మొహమ్మద్ ఒక రోజు మద్రసా పరిసరాల్లో బీడీ వాసన వస్తుండడంతో అక్కడ పొగత్రాగే వారెవరని గాలించాడు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి


మరోవైపు తరగతిలో పాఠాలు ఎగ్గొట్టిన ఒక 14 ఏళ్ల బాలుడు స్కూల్ వెనకాల నిలబడి దర్జాగా బీడీ తాగుతున్నాడు. అనుకోకుండా అక్కడికి మౌలానా ఆస్ మొహమ్మద్ వచ్చేశాడు. అక్కడ ఆ బాలుడు బీడీ తాగుతుండడం చూసి ఆస్ మొహమ్మద్ కు పట్టరాని కోపం వచ్చింది. ఆ బాలుడు మద్రసాలో కేవలం 6వ తరగతి చదువుతున్నాడు. పైగా మద్రసాలో కఠిన నిబంధనలుంటాయి. పొగత్రాగడం చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారు.

అయినా ఏమాత్రం భయం లేకుండా ఆ బాలుడు మద్రసా పరిసరాల్లోనే బీడి తాగుతున్నాడు. దీంతో మద్రసా శిక్షకుడు ఆస్ మొహమ్మద్ ఆ బాలుడిని అందరి ముందు ఈడ్చుకుంటూ వెళ్లి కొట్టడం ప్రారంభించాడు. అతని అరుపులకు మిగతా తరగతి గదులలో నుంచి పిల్లలు, ఇతర మౌలానాలు అంతా గుమిగూడి చూశారు. అందరూ చూస్తుండగానే మౌలానా తనను ఇంత ఘోరంగా కొట్టడాన్ని తనకు జరిగిన అవమానంగా ఆ బాలుడు భావించాడు. తనను ఇంతగా అందరి ముందు అవమానించినందుకు మౌలానాపై ఆ బాలుడు పగబట్టాడు.

మరుసటి రోజు రాత్రి సమయంలో మౌలానా ఆస్ మొహమ్మద్ నిద్ర పోతున్న సమయంలో ఆ 14 ఏళ్ల బాలుడు ఒక రంపం తీసుకెళ్లి మౌలానా గొంతుపై గట్టిగా దాడి చేశాడు. దీంతో మౌలానా గట్టిగా కేకలు వేశాడు. పక్క గదులలో నుంచి అందరూ పరిగెత్తు వచ్చే సరికి మౌలానా గొంతు నుంచి రక్తం వస్తోంది. అతని మెడ, గొంతు చుట్టూ గాయాలున్నాయి. అందరూ అక్కడికి వచ్చేయడంతో ఆ బాలుడు అక్కడి నుంచి పారిపోయాడు.

Also Read: సోషల్ మీడియా పిచ్చి పీక్స్.. రీల్స్ చేసేందుకు హైవే సైన్‌బోర్డుపై పుల్ అప్స్!

మౌలానాకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను మీరట్ నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం అడ్మిట్ చేశారు. మౌలానా ఆస్ మొహమ్మద్ విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు విచారణ చేసి మౌలానా ఏ తప్పు చేయలేదని చెప్పి పరారీలో ఉన్న నిందితుడు మైనర్ ‌ కావడంతో పోలీసులు అతడిని పట్టుకొని జువెనైల్ హోమ్ కు పంపించారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×