E-Paper
Advertisement

Honda Cars Price Hike: కస్టమర్లకు హోండా షాక్.. కార్ల ధరల పెంపుపై కీలక ప్రకటన!

Honda Cars Price Hike: కస్టమర్లకు హోండా షాక్.. కార్ల ధరల పెంపుపై కీలక ప్రకటన!
Advertisement

హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (HCIL)  ధరల పెంపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన అన్ని ప్యాసింజర్ కార్ల ధరలను జనవరి 2026 నుండి పెంచనున్నట్లు ప్రకటించింది. వార్షిక ధర సవరణలో భాగం,  ఇప్పటికే ఇతర ఆటోమొబైల్ కంపెనీలు అయిన మారుతి సుజుకి, హ్యుందాయ్, నిసాన్ పెంపును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో హోండా కార్స్ కూడా ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ఈ పెంపు 2026 మోడల్ ఇయర్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. పాత స్టాక్ (2025 మోడల్స్) పాత ధరలకే అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.

జనవరి 1 నుంచి ధరల పెంపు అమలు

పెంచిన ధరలను జనవరి 1, 2026 నుంచి అమలు చేయనున్నట్లు తెలిపింది. ఎంత శాతం ధరలను పెంచుతుందనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ, ఆటో నిపుణుల అంచనాల ప్రకారం 1-2% వరకు ఉండవచ్చని తెలుస్తోంది. మోడల్,  వేరియంట్ పై ఆధారపడి ఉంటుంది. అంటే రూ. 10 లక్షల విలువైన కారుకు సుమారు రూ. 10,000- రూ.20,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

ధరల పెంపునకు కారణాలు

Advertisement

తమ కార్ల ధరల పెంపునకు సంబంధించి హోండా కీలక ప్రకటన చేసింది. ఇన్‌ పుట్ కాస్ట్‌.. షీట్ మెటల్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్స్ లాంటి మెటీరియల్స్ ధర పెరగడం వల్లే కార్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. లాజిస్టిక్స్, ఎనర్జీ ధరలు పెరగడం, కమాడిటీ ధరలు, సప్లయర్ ఖర్చులు పెరగడం కారణంగా ధరల పెంపు అనివార్యం అయినట్లు వెల్లడించింది. కార్లకు సంబంధించి ధర తప్ప ఏ మార్పులు లేవని తెలిపింది.

ఎంత ధర పెరిగే అవకాశం ఉందంటే?

హోండా ఇండియాలో అమ్ముతున్న అన్ని మోడల్స్‌ కు ఈ ధరల పెంపు వర్తిస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement

⦿ హోండా అమేజ్ (Amaze)

ఈ కారు ధర ప్రస్తుతం రూ.7.01 – 10 లక్షల వరకు ఉంది. సుమారు రూ. 7,000 – రూ. 20,000 వరకు ధర పెరిగే అవకాశం ఉంది.

⦿ హోండా సిటీ (City)

ప్రస్తుతం ఈ కారు ధర రూ. 11.95 – రూ.16 లక్షలు ఉంటుంది. ఈ మోడల్ పై సుమారు రూ. 12,000 – రూ.32,000 వరకు పెరిగే అవకాశం ఉంది.

⦿ హోండా సిటీ హైబ్రిడ్ (City Hybrid e:HEV)

ఈ కారు ధర రూ. 19.48 – రూ. 20 లక్షలు ఉంటుంది. ఈ కారుపై రూ. 19,000 – రూ. 40,000 పెరిగే అవకాశం ఉంది.

⦿ హోండా ఎలివేట్ (Elevate)

ఈ కారు ధర రూ. 11 –  రూ.16.67 లక్షలు ఉంటుంది. ఈ కారు మీద రూ. 11,000 నుంచి రూ. 33,000 పెరిగే అవకాశం ఉంది.

Read Also:  వినియోగదారులకు షాక్, జనవరి 2026 నుంచి కార్ల ధరలు పెంపు!

కొనుగోలుదారులు ఏం చేయాలంటే?  

డిసెంబర్ 2025లో కొనుగోలు చేస్తే..  2025 మోడల్స్ పాత ధరలకే లభిస్తాయి. డీలర్లు డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవ్వవచ్చు. ఈ పెంపు కస్టమర్లపై తక్కువ ప్రభావం చూపించడానికి హోండా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఇతర బ్రాండ్లలో కూడా ఇలాంటి పెంపులు ఉన్నాయి.

Read Also:  బ్యాటరీ కార్లపై మోజు వద్దు.. కొన్న తర్వాత ఇత్తడే, ఎందుకంటే?

Related News

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×