Lokah OTT: ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలలో “లోక” సినిమా(Lokah Movie) ఒకటి. లేడీ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించారు.. ఇక ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు 28వ తేదీ మలయాళ భాషలో విడుదల అయింది అలాగే 29వ తేదీ తెలుగులో విడుదలైంది. ఇలా రెండు భాషలలో ఈ సినిమా సూపర్ హిట్ సినిమాగా నిలబడింది. కేవలం 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
ఈ అద్భుతమైన సినిమాకు ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఒక సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. ఇక ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి తాజాగా జియో హాట్ స్టార్ (Jio Hot star)అధికారిక ప్రకటన వెల్లడించింది. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ నుంచి జియో హాట్ స్టార్ లోకి అందుబాటులోకి రాబోతోందని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో విడుదల చేయాల్సి ఉండగా థియేటర్లో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరికాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నారు.
థియేటర్లో ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఆదరణ రాబడుతుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ చంద్ర అనే పాత్రలో కనిపించబోతున్నారు. చంద్రకు సూపర్ పవర్స్ ఉంటాయి. అయితే ఈ విషయం చాలా కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఇలా సూపర్ పవర్స్ ఉన్నాయని తెలుసుకున్న చంద్ర బెంగళూరుకి వచ్చి తన శక్తులను దాచిపెట్టి ఒక సాధారణ అమ్మాయిల బ్రతుకుతుంది. ఇలా ఒక కేఫ్ లో పని చేసుకుంటూ ఉండే చంద్ర తన ఎదురింట్లో ఉండే సన్నీ ( నస్లేన్) ఈమెను మొదటి చూపులోనే ఇష్టపడతారు.
The world of Lokah unfolds exclusively on JioHotstar, streaming from October 31st.@JioHotstarMal#Lokah #TheyLiveAmongUs@DQsWayfarerFilm @dulQuer @dominicarun@NimishRavi@kalyanipriyan@naslen__ @jakes_bejoy @chamanchakko @iamSandy_Off @santhybee @AKunjamma pic.twitter.com/dAklmsFR1M
— Wayfarer Films (@DQsWayfarerFilm) October 24, 2025
ఇలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటంతో స్నేహితులుగా కొనసాగుతూ ఉంటారు అయితే ఒకరోజు రాత్రి జరిగిన సంఘటన వల్ల చంద్ర జీవితం పూర్తిగా మారిపోతుంది. అసలు ఆరోజు రాత్రి ఏం జరిగింది? చంద్ర ఎవరు? ఆ సంఘటనల వల్ల ఆమె సూపర్ పవర్స్ బయటపడతాయా? అనేది తెలియాలి అంటే పూర్తి సినిమా చూడాల్సిందే. ఇక థియేటర్లో 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది అంటే ఈ సినిమా కచ్చితంగా ఓటీటీలో కూడా ప్రేక్షకు ఆదరణ పొందుతుందని చెప్పాలి. ఈ సినిమాని డిజిటల్ మీడియాలో చూడాలి అంటే మరొక వారం రోజులు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమా ద్వారా నటుడు దుల్కర్ సల్మాన్ భారీ స్థాయిలో లాభాలను అందుకున్నారని చెప్పాలి.
Also Read: Sandeep Raj: బండి సరోజ్‌తో విభేదాలు.. నిజమేనన్న డైరెక్టర్