E-Paper
Advertisement

Married Woman Incident: మలక్‌పేటలో వివాహిత అనుమానాస్పద మృతి

Married Woman Incident: మలక్‌పేటలో వివాహిత అనుమానాస్పద మృతి
Advertisement

Married Woman Incident: ఇటీవల వరుసగా చూస్తూనే ఉన్నాము. భార్యను హత్య చేసిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గురుమూర్తి భార్యను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా హైదరాబాద్‌ మలక్‌పేటలో శిరీష అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గుండెపోటుతో చనిపోయిందని.. భర్త, అత్తమామలు శిరీష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు రాకముందే.. అంత్యక్రియల కోసం శిరీష మృతదేహాన్ని సొంతూరు దోమలపెంటకు తరలించే ప్రయత్నం చేశారు.

శిరీష తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. మృతదేహాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని సీసీ ఫుటేజ్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వాహనం నుంచి శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. శిరీష మృతదేహంపై గాయాలు ఉన్నాయని.. భర్తే ఆమెను కొట్టి చంపారని తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

అనాధ అయిన శిరీషను.. ఓ ప్రొఫెసర్ కుటుంబం దత్తత తీసుకుంది. వాళ్ల దగ్గర ఉంటున్న శిరీషను ప్రేమిస్తున్నానని చెప్పి.. హైదరాబాద్‌కి చెందిన వినయ్ 2017లో శిరీషను వివాహం చేసుకున్నాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్లయ్యాక శిరీషను వినయ్‌కుమార్‌ వేధించేవాడని, అతనే ఆమెను చంపి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భర్త వినయ్ అత్తమామలు కొట్టి చంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనకు విహాయం అయినప్పటి నుంచి టార్చర్ చూపిస్తున్నాడని, అనుమానంతో ప్రతిరోజు తాగొచ్చి తనను కొడతాడని శిరీష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Also Read: వివాహేతర సంబంధం.. ఆపై మహిళ దారుణ హత్య

Advertisement

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేశాడు ఓ కసాయి కొడుకు. తల్లితో గొడవ పడి కత్తితో దాడి చేశాడు కొడుకు కార్తీ. దీంతో ఆ తల్లి చికిత్స పొందుతూ..మృతి చెందింది. మద్యానికి బానిసై.. ఆస్తికోసం కుటుంబ సభ్యులతో గొడవపడి.. ఈ దారుణానికి పాల్పడ్డాడు కార్తీక్ రెడ్డి. దీంతో స్ధానికులు సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు..నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×