BigTV English

Nani : నాని అనే మంచోడు ఒక్కడే ఉండే వాడు… వాన్ని కూడా నాశనం చేశారు కదరా…

Nani : నాని అనే మంచోడు ఒక్కడే ఉండే వాడు… వాన్ని కూడా నాశనం చేశారు కదరా…

Nani : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాని (Nani)కి, ఆయన సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నాని అనగానే పక్కింటి కురాడిలా ఉండే హీరో, మనసుకు హత్తుకునే సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మొత్తం తారుమారు అవుతోంది. రాను రానూ నాని రూట్ ఎటు వెళ్తుందో ప్రేక్షకులకు అర్థం కావట్లేదు. తాజాగా రిలీజ్ అయిన ఆయన రెండు సినిమాల టీజర్లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చే విధంగా ఉన్నాయి. ఆ రెండు టీజర్లను చూశాక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక మంచోడు నాని… వాడిని కూడా మార్చేసారేంట్రా అంటూ తెగ బాధపడుతున్నారు మూవీ లవర్స్. ఇంతకీ ఆ రెండు టీజర్లలో ఏముంది? నాని ఇలా మారడానికి గల కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


నానిలో ఊహించని మార్పు  

నాని సినిమా ఇండస్ట్రీలో కెరీర్ మొదటి నుంచి పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ‘అష్టా చెమ్మా’ నుంచి మొదలు పెడితే ఆ తర్వాత స్నేహితుడు, అలా మొదలైంది, పిల్ల జమిందార్, ఈగ ఎటో వెళ్లిపోయింది మనసు, ఎవడే సుబ్రహ్మణ్యం, ఎంసీఏ, జెర్సీ, గ్యాంగ్ లీడర్, శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి వంటి సినిమాలతో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను, ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నాడు నాని.


నాని సినిమా అనగానే నిర్మాతలకు హిట్ గ్యారంటీ అనే భరోసా మాత్రమే కాదు, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా రెండు గంటల పాటు సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయొచ్చు అనే ఆశ కూడా ఉండేది. ఇతర హీరోలతో పోల్చుకుంటే నాని సినిమాలనే ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు ఫ్యామిలీ ఆడియన్స్. నాని కూడా తన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే జానర్లు వేరైనప్పటికీ, తన సినిమాలలో ఎక్కడా అశ్లీలత లేకుండా చూసుకునేవాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లతో పాటు దుమ్ము రేపే యాక్షన్ సన్నివేశాలు కూడా నాని సినిమాలలో ఇప్పటిదాకా చూసాం మనం.

నానిని 100 కోట్ల క్లబ్లో చేర్చిన ‘దసరా’, నిన్నటికి నిన్న రిలీజ్ అయిన ‘సరిపోదా శనివారం’ రెండు సినిమాలు కూడా యాక్షన్ జానర్లోనే రూపొందాయి. కానీ వీటిలో ఒక్క బూతు పదం కూడా లేదు. కానీ తాజాగా రిలీజ్ అయిన ‘హిట్ 3’, ‘ది ప్యారడైజ్’ టీజర్లు చూస్తుంటే నాని బూతులకు కేరాఫ్ అడ్రస్ గా మారబోతున్నాడా అనిపిస్తుంది.

ఆ రెండు సినిమాలలో సేమ్ సీన్ 

నాని పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘హిట్ ది థర్డ్ కేస్’ (Hit 3) టీజర్ ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ లో గతంలో ఎన్నడూ లేనంత వైలెంట్ గా, బూతులు మాట్లాడుతూ జనాలకు షాక్ ఇచ్చాడు నాని. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోక ముందే తాజాగా ‘ది ప్యారడైజ్’ (The Paradise) టీజర్ లో కూడా సేన్ సీన్ రిపీట్ చేసి, మరింత ఆశ్చర్యానికి గురిచేసాడు. దీంతో ఓ వర్గం ప్రేక్షకులు నాని పై విమర్శలు గుప్పిస్తున్నారు. “మా నానిని ఏం చేశారు?” అంటూ మేకర్స్ ని సోషల్ మీడియా వేదికగా ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇక తాజాగా వచ్చిన ‘ది ప్యారడైజ్’ గ్లిమ్స్ లో నాని లుక్ ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. మరి ఈ ట్రోలింగ్ ఎఫెక్ట్ రెండు సినిమాలపై ఎంత మేరకు ఉంటుందో అనేది నాని అభిమానుల ఆందోళన.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×