Botsa VS Atchennaidu: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార పార్టీని అన్ని కోణాల్లో బద్నాం చేయాలన్నది వైసీపీ ప్లాన్. గడిచిన ఐదేళ్లు ఫ్యాన్ పార్టీ వ్యవహారాన్ని బయట పెట్టాలని అధికార పార్టీ భావిస్తోంది. మండలి వేదికగా ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంతకీ మండలిలో అసలేం జరిగింది?
మండలిలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు- మండలి వివక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లబ్దిదారులకు రాజకీయాలు, పార్టీలను అంటగడతారా అంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు, పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలన్నారు.
అర్హులైన లబ్దిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా? కాసింత అసహనం వ్యక్తం చేశారు. కేవలం కార్యకర్తలకు పథకాలు ఇవ్వాలని చెప్పడానికి ఇదేమైనా వాళ్ళ సొంత ఆస్తా? మా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చామన్నారు.
దీనిపై వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు రియాక్ట్ అయ్యారు. జగనన్న కాలనీల కోసం వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదన్నారు. కేంద్రం డబ్బులతోనే కథంతా నడిపారన్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తాము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని, మీరెంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ALSO READ: 12 లక్షల మంది డ్రాపౌట్స్
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తెచ్చామన్నారు అచ్చెన్నాయుడు. గాలి ఉన్నా లేకున్నా తాను ప్రజా జీవితంలో ఉన్నానన్నారు. ఈ క్రమంలో ఇరువురు నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే, మంత్రివి అయ్యావని, అవ్వడానికి ఇంకా ఏమీలేదన్నారు బొత్స. 2014-19 ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు మంత్రి. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదన్నారు. ఊళ్లకు ఊళ్లు జగనన్న కాలనీలు అన్నారని, దాని గురించి తాను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదన్నారు. ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు.
మండలిలో బడ్జెట్ పద్దులపై సోమవారంచర్చ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు, మంత్రులు మాట్లాడారు. వైసీపీ హయాంలో గుంటూరు మిర్చి యార్డు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి మిర్చి యార్డులో జరిగిన అవినీతిపై విచారణ చేశామన్నారు. మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు, తాను సమీక్ష చేశామన్నారు.
మిర్చి రైతులకు లాభం రావాలని కేంద్ర వ్యవసాయ మంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని గుర్తు చేశారు. టీడీపీ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవమన్నారు వివక్ష నేత బొత్స సత్యనారాయణ. కూటమి నేతలు కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం రాజకీయ కక్ష్యలతో ఇవ్వలేదని చెప్పటం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చిందని తెలిపారు. మా పార్టీ వాళ్ళకే పనులు, పథకాలు ఇవ్వాలని అప్పటి మా ముఖ్యమంత్రి జగన్ ఏనాడూ చెప్పలేదన్నారు విపక్ష నేత బొత్స.
జగనన్న కాలనీల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు: మంత్రి అచ్చెన్నాయుడు
కేంద్రం డబ్బులతోనే కథ నడిపారు
రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
మేము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం
మీరు ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలి
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025
లబ్దిదారులకు రాజకీయాలు, పార్టీలను అంటగడతారా..? కౌన్సిల్ లో బొత్స ఫైర్
రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు.. పథకాలపై చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు
ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలి
అర్హులైన లబ్దిదారులకు పథకాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది… pic.twitter.com/Q5LtEqrSPe
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025