BigTV English
Advertisement

Topudurthi Mahesh Reddy: అనంతలో యువకుడి హత్య! రాజకీయ రంగు, మిడ్ నైట్ ఏం జరిగింది?

Topudurthi Mahesh Reddy: అనంతలో యువకుడి హత్య! రాజకీయ రంగు, మిడ్ నైట్ ఏం జరిగింది?

Topudurthi Mahesh Reddy: అనంతపురంలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలయ్యాయా? ఓ హత్య చుట్టూ రాజకీయ రంగు పులుముకుంటుందా? ఇటీవల పరిటాల శ్రీరామ్‌ని మృతుడు ఎందుకు కలిశాడు? దర్యాప్తులో కీలక విషయాలు బయటకు వస్తాయా? ఇవే ప్రశ్నలు అక్కడికి వారిని వెంటాడుతున్నాయి.


అనంతపురంలో ఓ యువకుడు అనుమానాస్పద మృతి చెందాడు. మృతుడు పేరు తోపుదుర్తి మహేష్‌రెడ్డి. నగర సమీపంలో రైల్వే పట్టాలపై అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాత్రి స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్నేహితుడ్ని టూ వీలర్‌లో పంపేశాడు. తెల్లారేసరికి రైలు పట్టాలపై శవమైన కనిపించాడు మహేష్. ఈ ఘటన సోమలదొడ్డి-నాగిరెడ్డిపల్లి గ్రామాల మధ్య జరిగినట్టు తెలుస్తోంది.

మృతుడు గతంలో వైసీపీ హయాంలో బైరెడ్డి సిద్ధార్థ టీమ్‌లో పని చేశాడు. కొన్ని రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరులకు వ్యతిరేకంగా పని చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. కొద్దిరోజుల కిందట పరిటాల శ్రీరామ్‌ని కలిశాడు తోపుదుర్తి మహేష్.


ఇంతలోనే ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి చెందిన తోపుదుర్తి మహేష్‌రెడ్డి సోషల్ మీడియా పోస్టులపై ఆరా తీస్తున్నారు. మహేష్ గురించి తెలిసిన వారిపై పోలీసులు ఓ కన్నేశారు. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

ALSO READ: వయాగ్రా టాబ్లెట్స్ వేసుకొని భర్త అనుమాస్పద మృతి.. భార్య ఎంత పని చేసిందంటే!

Related News

Sangareddy News: చీమల భయం.. అనుక్షణం వెంటాడాయి, నావల్ల కాదంటూ వివాహిత ఆత్మహత్య

Road Accident: బీచ్‌కి వెళ్లి వస్తూ.. బాపట్లలో ఘోర రోడ్డు ప్రమాదం అక్కడికక్కడే ఇద్దరు మృతి

Hyderabad News: సహజీవనం.. డ్రగ్స్‌ తీసుకున్న జంట.. ఓవర్ డోస్‌తో ఒకరు మృతి, మరొకరి పరిస్థితి

Hyderabad News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. నలుగురు చిక్కారు, మరి డ్రోన్ల మాటేంటి?

Bus Fire Accident: మరో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిబూడిదైన ఆర్టీసీ బస్సు

Bus Accident: రాష్ట్రంలో మరో బస్సుప్రమాదం.. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, స్పాట్‌లో ముగ్గురు..?

Hyderabad: యువకుడిపై నడిరోడ్డుపై కత్తితో దాడి.. హైదరాబాద్‌లో మరో హత్యా యత్న ఘటన

Anantapur Crime: ఫ్యాన్‌కు ఉరేసుకుని బ్యాంక్ మేనేజర్ సూసైడ్.. కారణం ఏంటి..?

Big Stories

×