E-Paper
Advertisement

Teacher Kidnap Student : 16 ఏళ్ల స్టూడెంట్‌ని కిడ్నాప్ చేసిన మహిళా టీచర్.. లింగమార్పిడి చేసుకొని పెళ్లికోసం..

Teacher Kidnap Student : 16 ఏళ్ల స్టూడెంట్‌ని కిడ్నాప్ చేసిన మహిళా టీచర్.. లింగమార్పిడి చేసుకొని పెళ్లికోసం..

Teacher Kidnap Student | భారత సంప్రదాయంలో గురువుని దేవునితో సమానంగా పూజిస్తారు. విద్యార్థుల జీవితాలకు సరైన దిశ చూపించే బాధ్యత గురువుపై ఉంటుంది. కానీ ఆ గురువు స్థానంలో ఉండి ఒక మహిళ నీచంగా ప్రవర్తించింది. ఇక్కడ విచిత్రమేమిటంటే ఆ మహిళ ఒక అమ్మాయిపైన వ్యామోహం పెంచుకుంది. అంతటితో ఆగకుండా ఆ టీనేజ్ అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి కిడ్నాప్ చేసింది. ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి తాను పురుషుడిగా మారడానికి ఆపరేషన్ కు సిద్ధమైంది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాజధాని చెన్నై నగరం పెరంబూర్ ప్రాంతంలో నివసించే కల్యాణి అనే మహిళకు స్కూల్ ను నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆమె కూతురు పుష్ప రాణి (16, మార్చబడినది) స్కూల్ కు రాలేదని. కానీ ఆ రోజు పుష్పరాణి స్కూల్ కోసం వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. ఆ మెసేజ్ చదివి కల్యాణి తన కూతురు ఎక్కడికి వెళ్లిందోనని కంగారు పడి ముందు స్కూల్ కు వెళ్లింది.

చెన్నైలో ని సెంబియం ప్రాంతంలో ఉన్న ఆ పాఠశాలకు వెళ్లి కల్యాణి తన కూతురి గురించి విచారణ చేసింది. విషయం సీరియస్ కావడంతో స్కూల్ ప్రిన్స్‌పాల్ పుష్ఫరాణి స్నేహితులను పిలిచి వారికేమైనా తెలిసి ఉంటే చెప్పాలని అడిగారు. అప్పుడు వారంతా పుష్పరాణికి కరాటే అంటే చాలా ఇష్టమని ఆమె కొన్ని రోజులుగా ఒక కరాటే స్కూల్ లో శిక్షన తీసుకునేందుకు వెళుతోందని తెలిపారు.

కల్యాణి వెంటనే ఆ కరాట్ సెంటర్ కు వెళ్లి అక్కడ తన కూతురు పుష్పరాణి గురించి ఆరా తీసింది. కానీ పుష్పరాణి అక్కడికి కూడా రాలేదని తెలిసింది. దీంతో ఆమె తన కూతురు పుష్పరాణి కనపడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పుష్ఫరాణి మిస్సింగ్ కేసులో పోలీసులు విచారణ వెంటనే ప్రారంభించారు. కరాటే సెంటర్ లో విమల (29) అనే మహిళా టీచర వద్ద పుష్పరాణి శిక్షణ తీసుకుంటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే టీచర్ విమల కూడా రెండు రోజులుగా కనబడడం లేదు. దీంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది.

అయితే పోలీసులు ముందుగా పుష్పరాణి మొబైల్ ఫోన్ లోకేషన్ ట్రేస్ చేశారు. కానీ ఆమె ఫోన్ స్విచాఫ్ రావడంతో ఫలితం లభించలేదు. ఆ తరువాత కరాటే టీచర్ విమల ఫోన్ లొకేషన్ చూస్తే.. ఆమె తిరువికా నగర్ రైల్వే లైన్ సమీపంలో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు వెంటనే లొకేషన్ కు చేరుకొని విమల, పుష్పరాణిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి వారిద్దరినీ విచారణ చేశారు. ఎందుకు ఇంటి నుంచి పారిపోవాల్సి వచ్చిందని అడిగారు.

అప్పుడు పుష్పరాణి చెప్పింది విని అందరూ షాకైపోయారు. తన కరాటే టీచర్ విమల తనను ప్రేమిస్తోందని.. తనకు కూడ ఆమె అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి పారిపోయామని తెలిపింది. పోలీసులకు విషయం అర్థం కాలేదు. ఒక మహిళ టీచర్ మరో అమ్మాయిని ఎలా వివాహం చేసుకుంటుంది అని ఆశ్చర్యం వేసింది. దీంతో వారు కరాటే టీచర్ విమలని నిజం ఏంటో చెప్పాలని గట్టిగా అడిగారు. విమల కరాటే నేర్పిస్తూ.. అందంగా ఉన్న పుష్పరాణిపై వ్యామోహం పెంచుకుంది. తనకు పురుషలంటే ఇష్టం లేదని అందుకే పుష్పరాణికి తన ప్రేమ విషయం చెప్పి.. పెళ్లి చేసుకునేందుకు ఒప్పించానని తెలిపింది.

అయితే తాను కొన్ని రోజుల్లో లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకొని ఆ తరువాత పెళ్లి చేసుకోబోతుండగా.. పోలీసులు పట్టుకున్నారని తెలిపింది. పోలీసులు పుష్పరాణికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను తల్లిదండ్రుల వద్దకు పంపించారు. కరాటే టీచర్ విమలపై టీనేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×