BigTV English

Crime: పోకిరీల ఆగడాలపై ఇక ..యాంటీ రెడ్ ‘ఐ’

Crime: పోకిరీల ఆగడాలపై ఇక ..యాంటీ రెడ్ ‘ఐ’
Advertisement

Telangana Police check the rougs who arrange spy cameras in hidden places


మహిళలపై రోజురోజుకూ కొందరి ఆగడాలు శృతిమించుతున్నాయి. సరదాగా ఏ షాపింగ్ మాల్ కు వెళ్లి డ్రెస్సింగ్ రూమ్ కు వెళితే అక్కడ రహస్య కెమెరాలను అమర్చి వీడియోలు తీస్తున్నారు కొందరు ప్రభుద్ధలు. అలాగే హోటల్స్, లాడ్జింగ్, సినిమా హాల్స్ బాత్ రూమ్స్ లో ఎవరికీ అనుమానం రాకుండా రహస్య కెమెరాల సాయంతో అసభ్యకరమైన వీడియోలు తీసి శునకానందాన్ని పొందుతున్నారు పోకిరీలు. ఇవి ఎవరు చేస్తున్నారో తెలియదు. తీరా విషయం తెలిసినా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఆడవారికి. పోలీసు కంప్లయింట్ ఇచ్చినా ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారు? సో అలాంటివి చెప్పుకుంటే తమకే పరువు పోతుందని ఆడవారు భావించడంతో పోకిరీలు రెచ్చిపోతున్నారు.

నేరస్తుల ఆట కట్టించే టెక్నాలజీ


ఇకపై ఇలాంటివి కుదరదంటున్నరు తెలంగాణ పోలీసులు. మారుతున్న సాంకేతికతను ఉపయోగించి ఇటీవల నేరస్థుల ఆట కట్టిస్తున్నారు తెలంగాణ పోలీసులు. ఈ ప్రక్రియలో భాగంగా నేరస్థులను పట్టుకోవడంలోనూ రకరకాల టెక్నిక్ లు ఉపయోగిస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కంటికి కనిపించని స్పై కెమెరాలను అమర్చే పోకిరీల ఆటకట్టంచడానికి తెలంగాణ పోలీసులు కొత్తగా ‘యాంటీ రెడ్ ఐ‘ వ్యవస్థను తెరపైకి తీసుకొస్తున్నారు. అత్యంత ఆధునిక రీతిలో ఎక్కడ స్పై కెమెరాలను ఉపయోగించినా కనిపెట్టే విధంగా డిటెక్టర్ మిషన్లను తెస్తున్నారు. రహస్యంగా అమర్చిన స్పై కెమెరాలను ఈ డిటెక్టర్లు ఇట్టే పట్టేస్తాయి. ఇండికేషన్ కూడా ఇస్తాయి.

ఏమూలన ఉన్నా పట్టేస్తాయి

రహస్య అద్దాలు, గోడల చాటున, ఎలక్ట్రిక్ స్విచ్ బోర్డులు ఇలా ఎక్కడ స్పై కెమెరాలున్నా చిటికెలో పట్టేస్తాయి. అయితే నగరంలో షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హోటల్స్, హాస్టల్స్ ఇలా వేల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నింటినీ చెక్ చేయడానికి పోలీసు యంత్రాంగా సరిపోదు. అందుకే కొందరు సామాజిక సేవకులైన కుర్రవాళ్లను ఎంపిక చేసి వారికి సాంకేతిక పరమైన శికణ ఇవ్వాలని తెలంగాణ పోలీసు యంత్రాంగం భావిస్తోంది.

యువకులకు శిక్షణ

ఇప్పటికే మూడు వందల మంది యువకులకు పోలీసులు శిక్షణ ఇచ్చారని సమాచారం. వీళ్లకు ఎక్కడెక్కడ ఏ బిజీ సర్కిళ్లలలో తనిఖీలు నిర్వహించాలో శిక్షణ నిచ్చారు పోలీసులు. త్వరలోనే వారికి స్పై డిక్టేటర్లను కూడా అందజేయనున్నారు. వీరికి ఐడెంటిటీ కార్డులు కూడా ఇస్తారు. వీళ్లు నగరం చుట్టు పక్కలా ఎక్కువగా లేడీస్ షాపింగ్ చేసే ప్రదేశాలు, సినిమా హాల్స్, లాడ్జీలు, బాత్ రూమ్స్ లలో అమర్చిన స్పై కెమెరాల వేట మొదలెడతారు. త్వరలోనే రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ పోలీసులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మహిళలు సర్వత్రా హర్షిస్తున్నారు. ఇన్నాళ్లుగా తమని వేధిస్తున్నసమస్యను అర్థం చేసుకుని పోకిరీ రాయుళ్ల ఆటకట్టించేందుకు సిద్ధపడుతున్న సీఎం రేవంత్ కూ తమ అభినందనలు తెలియజేస్తున్నారు.

Tags

Related News

Karimnagar Murder Case: వయాగ్రా ట్యాబ్లెట్స్ ఇచ్చి.. భర్తను కిటికీ గ్రిల్‌కు కట్టేసి..

Guntur Train Molest Case: ఏపీలో దారుణం.. రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

Modi Public Meeting: మోదీ సభలో అపశృతి.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

Student Suicide: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్

Bus Incident: ORRపై ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది ప్రయాణికులు..

Gold Shop Robbery: పట్టపగలు బంగారం షాపు దోపిడీ.. యజమానిపై దాడి, 3 లక్షల నగలు దోచేశారు

Road Accident: ఘోర‌ రోడ్డు ప్రమాదం.. వెళ్తున్న ఆటోను, బైక్‌ను ఢీ కొట్టి బోల్తా కొట్టిన మ‌రో ఆటో

Nagarkurnool: ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసి. యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం

Big Stories

×