E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా కోసం చక్రీ గిఫ్ట్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మహా.. హమ్మయ్య.. చక్రీ కోరిక తీరిందా..?

Podarillu Today Episode : మహా కోసం చక్రీ గిఫ్ట్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మహా.. హమ్మయ్య.. చక్రీ కోరిక తీరిందా..?
Advertisement

Podarillu Today Episode June 18th : చక్రి ఉదయం తొందరగా లేవడంతో మాధవ్ ఏంట్రా అంత తొందరగా లేచవు అని అడుగుతాడు.. కేశవ ఇంకా లేవలేదు అని నీళ్ళు కొట్టి మరీ లేపి స్కూటీ కొనడానికి వెళ్దాం పదనేసి అంటారు.. మహాలక్ష్మికి ఎలాగైనా సరే స్కూటీని కొనుక్కొచ్చి ఇవ్వాలి రా వెళ్దాం పదరా అని కేశవాణి బలవంతంగా తీసుకొని వెళ్తాడు.. మొత్తానికి చక్రి కేశవ ఇద్దరు కలిసి మహాలక్ష్మి కోసం ఒక అదిరిపోయే స్కూటీని సెలెక్ట్ చేసి కొనేస్తారు. భార్యకి బహుమతిగా ఇచ్చే మొదటి గిఫ్ట్ ఇదే కాబట్టి అన్నీ చెక్ చేసుకుని ఇవ్వాలి అని చక్రీ అంటాడు. మొత్తానికి చక్రి చాలా సంతోషంగా ఉంటారు.

చక్రీ ఫుల్ హ్యాపీ..

చక్రి బండిని చెక్ చేసుకుని బాగుంది అని అంటాడు.. ఓనర్ మాత్రం ఎలాగైనా సరే పూర్తిగా డబ్బులు పే చెయ్యాలని అంటాడు.. కానీ చక్రి ఏమి మాట్లాడకుండా స్కూటీ మీద మహాలక్ష్మి కూర్చుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పారు కాబట్టి నేను స్కూటీ ఇస్తున్నాను.. రిజిస్ట్రేషన్ అప్పుడు మీరు పూర్తిగా డబ్బులు కడితేనే నేను బండి ఇస్తాను. లేకపోతే అసలు ఇవ్వను అని అతను అనగానే సరే ఇస్తానని చెప్పు అని కేశవ తో చక్రి అంటాడు. మొత్తానికి చక్రి మహాలక్ష్మికి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ని ఇచ్చేస్తాడు. చాలా సంతోషంగా ఉంటాడు.. కేశవ చక్రి ఇద్దరూ ఆ బండిని ఇంటికి తీసుకొని వస్తారు.

నారాయణ స్ట్రాంగ్ కౌంటర్..

Advertisement

నారాయణ స్కూటీని చూసి అరే నా కొడుకు అనిపించుకున్నావ్ రా.. ఈ తండ్రి కష్టాన్ని చూడలేక నాకోసం స్కూటీని తీసుకొని వచ్చావా అని నారాయణ తెగ మురిసిపోతూ ఉంటాడు.. కన్నతండ్రి సైకిల్ తొక్కుతూ కష్టపడుతున్నాడని తనకోసం నువ్వు స్కూటీని తీసుకొని వచ్చావా అని చక్రిని పొగిడేస్తూ ఉంటాడు. ఇది నీకోసం తీసుకురాలేదు.. నాకు ఇష్టమైన మహాలక్ష్మి కోసం తీసుకుని వచ్చాను అని అనగానే నాన్న ఏంటి నాకోసం కాదు సిల్లీ ఫెలో అని వెటకారంగా తిడతాడు. అంతేకాదు నువ్వు కొని ఇవ్వకపోతే నాకు లేదా నాకు సైకిల్ ఉంది కదా.. ఆ సైకిల్ ని తొక్కుకుంటాను అని నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మహాను సర్ప్రైజ్ చేసిన చక్రీ..

అందరూ బయట స్కూటీ తీసుకురావడం చూసి చక్రీని పొగిడేస్తూ ఉంటారు.. స్కూటీ చాలా బాగుందిరా మహాలక్ష్మికి చాలా బాగుంటుంది అని మాధవ్ కూడా చక్రిని ప్రశంసిస్తాడు. ఇక తర్వాత ఇది మహాలక్ష్మికి సర్ప్రైజింగ్ గా ఉండాలి నేను వెళ్లి తనని తీసుకొని వస్తాను మీరు దీని మీద ఒక క్లాత్ కప్పేసి సర్ప్రైజ్ అని చెప్పిన తర్వాత తీద్దామని అంటాడు.. అయితే మహాలక్ష్మిని ఎంతో సంతోషంగా లోపలికి వెళ్లి పిలుస్తాడు చక్రి.. అయితే మహాలక్ష్మి బయటికి రాగానే మీరు కళ్ళు మూసుకొని బయటికి రండి మీకు ఒకసారి సర్ప్రైజ్ అని అంటారు.. అయితే బయట స్కూటీ మీద ఉన్న క్లాత్ని చూసి చక్రి షాక్ అవుతాడు. అరే మంచి క్లాత్ ని తీసుకు రమ్మన్నాను కదరా ఇంకే క్లాత్ లేనట్టు ఇలా బొక్కలు పడింది మీకు దొరికిందా రా అని చక్రి అంటాడు.. అతనికి మహాలక్ష్మిని సర్ప్రైజ్ చేస్తూ ఆ స్కూటీని చూపిస్తారు.

అరే.. ఇదేం ట్విస్ట్ రా బాబు..

Advertisement

అయితే మహాలక్ష్మి కోసమా స్కూటీ అనగానే ముందు హ్యాపీగా ఉన్న మహా ఆ తర్వాత మాత్రం తనకి స్కూటీ రాదన్న నిజాన్ని బయట పెట్టేస్తుంది.. ఏంటి స్కూటీ నడపడం రాదా..? అదేం పర్వాలేదు వదిన సైకిల్ వస్తే కచ్చితంగా స్కూటీ కూడా వచ్చేస్తుంది అని కన్నా అంటాడు. నిజానికి నాకు సైకిల్ కూడా రాదు మా ఇంట్లో వాళ్ళు కింద పడిపోతానని సైకిల్ కూడా నాకు ఇవ్వలేదు అని అంటారు. ఈరోజుల్లో స్కూటీ రాని వాళ్ళు ఎవరూ ఉండరు కదా అలాంటిది నేను వస్తుందని అనుకున్నాను.. కానీ ఇలా అని నాకు తెలియదు అని అనగానే మరేం పర్వాలేదమ్మా ఒక్కరోజులోనే నేర్చుకోవచ్చు అని మాధవ్ అంటారు. సరే వదిన మీకు దగ్గరుండి నేను స్కూటీని నేర్పిస్తాను మీరు ఏమి బాధపడకండి అని కన్నా అంటాడు.. కానీ చక్రి మాత్రం తనని పట్టించుకోవడమే లేదు అని బాధ పడిపోతూ ఉంటుంది.

మహాను కిందపడేసిన చక్రీ..

చక్రిని నారాయణ రెచ్చగొట్టి మహాలక్ష్మి దగ్గరికి పంపిస్తాడు.. నువ్వు ఎలాగైనా సరే అమ్మాయి మనసులో ప్రేమను సంపాదించు అప్పుడు అమ్మాయి నీ చుట్టూ తిరుగుతుంది అని నారాయణ అనడంతో చక్రి అలానే అని లోపలికి వెళ్తాడు. ఇక కన్నా మహాలక్ష్మి ఇద్దరు కూడా స్కూటీ నేర్చుకుంటూ ఉండగా అడ్డుగా వస్తాడు చక్రి.. చక్రి అన్నయ్యకి డ్రైవింగ్ మెలకువలు బాగా తెలుసు వదిన.. నువ్వు వెళ్లి అతని దగ్గర నేర్చుకో బావుంటుంది అని కన్నా కూడా పంపించడంతో మొదట బాగానే ఉన్నా కూడా మహాలక్ష్మి నీ చక్రి కింద పడేస్తాడు.. మహాలక్ష్మి కింద పడిపోయానని బాధపడిపోతూ ఇంకా ఇంటికి వచ్చేస్తుంది. నారాయణ మాత్రం ఒకటి రెండు సార్లు కింద పడితే బండి నేర్చుకోవడం సులువు అవుతుంది అని అంటాడు. కానీ చక్రీని మాత్రం ఇంట్లోని వాళ్ళందరూ తిడతారు..

మహా సాధించేసిందిగా..

మహాలక్ష్మి ఎలాగైనా సరే బండిని నేర్చుకుని నా పరువు నేను నిలబెట్టుకోవాలి అని అనుకుంటుంది. మహాలక్ష్మి ఎలాగైనా సరే నేను బండి నేర్చుకుంటాను అని అనుకుంటుంది.. కన్నా భయపడకు వదిన నేను మీ వెనకాల అండగా ఉంటాను కదా.. మొత్తానికి కన్నా సాయంతో మహాలక్ష్మి బండిని బాగా నేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. మహాలక్ష్మి ఏదైనా అనుకుంటే సాధించి తీరుతుంది అని మరోసారి నిరూపించేసింది.. అందరూ మహాలక్ష్మిని చూసి చాలా బాగా స్కూటీ నేర్చుకున్నావ్ అమ్మా అని చప్పట్లు కొడతారు.. మొత్తానికి మహాలక్ష్మి స్కూటీని నేర్చుకొని అందరిని ఆశ్చర్యపరుస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి vs అవని.. కమల్ పై పల్లవికి అనుమానం.. సుబ్బారావు దొరికేశాడోచ్..

Related News

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Big Stories

Advertisement
×