E-Paper
Advertisement

అల్లూరి జిల్లాలో విషాదం.. ఫోటోల సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది!

అల్లూరి  జిల్లాలో విషాదం.. ఫోటోల సరదా ముగ్గురి ప్రాణాలు తీసింది!
Advertisement

Alluri Sitarama Raju District: అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర‌ విషాదం నెలకొంది. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతం వద్ద సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

స్థానికుల కథనం ప్రకారం.. హుకుంపేట మండలం జుంబువలస గ్రామానికి చెందిన నలుగురు బాలికలు సరదాగా గడపడానికి మూలగుమ్మి జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతం అందాలను తమ ఫోన్లలో బంధించాలని, సెల్ఫీ దిగాలని వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒకరు కాలు జారి లోతైన నీటి కుంటలో పడిపోగా, ఆమెను రక్షించే ప్రయత్నంలో మిగిలిన ముగ్గురు కూడా నీటిలో మునిగిపోయారు.

Advertisement

ఈ ప్రమాదంలో త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మరో బాలిక అంజలి ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆమెను వెంటనే అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతులంతా హుకుంపేట మండల నివాసులు. ఇటీవలే వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. పరీక్షల ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు విహారయాత్రకు వెళ్లిన ఈ విద్యార్థినులు, తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో వారి కుటుంబాల్లో తీరని శోకం నెలకొంది.

Advertisement

సెల్ఫీ వ్యామోహం ప్రాణాల మీదకు తెస్తుందని అధికారులు, పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా, ఇటువంటి ఘటనలు పునరావృతమవడం కలచివేస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని జలపాతాల వద్ద బండరాళ్లు జారుడుగా ఉంటాయని, నీటి లోతుపై అవగాహన ఉండదని పర్యాటకులు గుర్తించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: మణిపూర్‌లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×