E-Paper
Advertisement

మణిపూర్‌లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి

మణిపూర్‌లో మళ్లీ మొదలైన మారణహోమం.. బాంబు దాడిలో చిన్నారులు మృతి
Advertisement

Manipur Violence: ఇలాంటి సీన్లు.. ఒకప్పుడు కశ్మీర్‌లో కనిపించేవి. అయితే, కొన్నేళ్లుగా.. అలాంటి ఆందోళనలు, నిరసనలు మణిపూర్‌లో కనిపిస్తున్నాయ్. ఆందోళనలకు కారణాలు వేర్వేరు అయి ఉండొచ్చు. కానీ, ఉద్రిక్తతలు, అల్లర్లు మాత్రం కామనైపోయాయ్. కొన్నేళ్లుగా మణిపూర్ అశాంతికి నిలయంగా మారింది. మైతేయ్, కుకీ వర్గాల మధ్య రాజుకున్న చిచ్చు.. ఆ రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తోంది. శాంతి నెలకొంటుందనుకున్న ప్రతిసారీ ఏదో ఒక హింసాత్మక ఘటన జరగడం, బాంబు దాడులు చోటుచేసుకోవడం అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితుల్లోనే.. అసలు మణిపూర్ ఎందుకు మండుతోంది? శాంతికి అడ్డుపడుతున్న అంశాలేమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. ఇప్పుడు జరిగిన దాడి కూడా కుకీ వర్గానికి చెందిన వారే చేశారనే ఆరోపణలున్నాయ్. అందుకే.. ఈ స్థాయిలో మళ్లీ అల్లర్లు చెలరేగాయ్.

గాడ నిద్రలో ఉన్న పసిప్రాణాలు..

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఎస్ఎఫ్ జవాన్ ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు చిన్నారుల మరణ వార్త హృదయ విదారకంగా మారింది. మంగళవారం బిష్ణుపూర్ జిల్లాలోని ట్రోంగ్లాబీ అవాంగ్ లైకై గ్రామంలోని ఇంటిపై గుర్తుతెలియని దుండగులు బాంబు విసిరారు. ఆ సమయంలో ఇంట్లో గాఢనిద్రలో ఉన్న నాలుగేళ్ల బాలుడు, ఆరు నెలల పాప మృతి చెందారు. ఆ చిన్నారుల తల్లి బినిత తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడి వార్త తెలియగానే.. బిష్ణుపూర్ జిల్లా ప్రజలు ఆగ్రహంతో రోడ్లపైకి వచ్చారు. చురాచాంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ వైపు వెళ్తున్న రెండు ఆయిల్ ట్యాంకర్లు, ఓ భారీ ట్రక్కును తగలబెట్టారు. మొయిరాంగ్ పోలీస్ స్టేషన్ బయట టైర్లను తగలబెట్టి, బారికేడ్లను ధ్వంసం చేశారు. వేల మంది నిరసనకారులు బిష్ణుపూర్, చురాచాంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్ సరిహద్దులోని సీఆర్పీఎఫ్ క్యాంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో.. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడగా, ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Advertisement

Also Read: ఆ నియోజకవర్గాలకు ఇన్చార్జులెవరు?.. గులాబీలో మొదలైన చర్చ..!

ఇంటర్నెట్ సేవలు బంద్..?

అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడేందుకు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. మణిపూర్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, థౌబల్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో మూడు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాంబు దాడి జరిగిన బిష్ణుపూర్ జిల్లాలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. తప్పుడు వార్తలు, రూమర్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. బాంబు దాడి జరిగిన ప్రదేశం.. కొండ ప్రాంతాలకు సమీపంలో ఉంది. సాయుధ బృందాలు చురుగ్గా ఉన్నాయని భావిస్తున్న ప్రాంతాలకు దగ్గరగా ఉండటం వల్ల.. దీనిని సున్నితమైన ప్రాంతంగా భావిస్తున్నారు. చుట్టుపక్కల కొండల్లోని ఎత్తైన ప్రదేశాల నుంచి గతంలోనూ మిసైళ్లను ప్రయోగించారని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడి.. లోయ జిల్లాల్లో ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది.

పౌరుల చేతుల్లో ఆయుదాలు..

Advertisement

గొడవలు ఆపేందుకు, శాంతిని కాపాడేందుకు ప్రభుత్వం అదనపు బలగాలను రంగంలోకి దించినా ఫలితం లేకుండా పోతోంది. అందువల్ల, మణిపూర్ సాధారణ స్థితికి రావాలంటే శాంతి చర్చలు సరిపోవు. పౌరుల చేతుల్లో ఉన్న ఆయుధాలను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇళ్లు కోల్పోయిన వేలాది మందికి భరోసా కల్పించి, వారిని తిరిగి తమ ప్రాంతాలకు పంపే ఏర్పాట్లు చేయాలి. రెండు వర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపి, పరస్పర ప్రయోజనాలు దెబ్బతినకుండా హామీ ఇవ్వాలి. మణిపూర్ అనేది భారత్‌లో అంతర్భాగం. అక్కడ జరుగుతున్న హింస.. ఆ రాష్ట్రానికే పరిమితం కాదు. దేశ భద్రతకే ముప్పులా పరిణమించే అవకాశం ఉంది. బాంబు దాడులు, రక్తపాతం ఆగి, మానవత్వం గెలవాలంటే.. పాలకులు కఠిన నిర్ణయాలతో పాటు, ప్రజల మనసులను గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మణిపూర్ మళ్లీ మణిహారంలా మెరుస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

Also Read: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయం.. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మైతేయి ప్రజలు నింసించే ప్రాంతంలో..

ఇద్దరు చిన్నారులని బలి తీసుకున్న దాడికి బాధ్యులైన వారిని పట్టుకునేందుకు.. భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రాణాలతో ఉన్నా, లేకపోయినా.. వారిని ఎట్టిపరిస్థితుల్లో పట్టుకోవాల్సిందేనని సీఎం యమ్నం ఖేమ్ చంద్ సింగ్ తెలిపారు. ఈ కేసును.. ఎన్ఐఏకు అప్పగించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో శాంతి ప్రక్రియని అస్థిరపరచాలనుకునే వారే.. ఈ దాడి వెనుక ఉన్నారని అనుమానిస్తున్నట్లు సీఎం తెలిపారు. మైతేయి ప్రజలు అధికంగా నివసించే లోయ ప్రాంతానికి, కుకీ-జోమి ప్రజలు అధికంగా నివసించే కొండ ప్రాంతాలకు మధ్య సున్నితమైన సరిహద్దు వెంబడి ఉన్న గ్రామంలో ఈ బాంబు దాడి జరిగింది. దాడి జరిగిన ప్రదేశానికి కొన్ని మీటర్ల దూరంలోనే.. ఓ పేలని రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ షెల్ దొరికింది. ట్రోంగ్లాబిలోని కొందరు జనం తమ ఇళ్లను విడిచిపెట్టి వెళ్లిపోయారు. చిన్నారుల మరణవార్త వేగంగా వ్యాపించడంతో.. బిష్ణుపూర్‌లో నిరసనలు వెల్లువెత్తాయ్.

ఇంఫాల్‌లో నిరసనలు

ఇలాంటి దాడులను నివారించడంలో అసమర్థత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. నిరసనకారులు సమీపంలో ఉన్న సీఆర్పీఎఫ్ పోస్టుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. లోపలికి చొరబడేందుకు ప్రయత్నించిన వారిపై కాల్పులు జరపక తప్పలేదు. ఈ క్రమంలో ఇద్దరు పౌరలు మరణించారు. మరో ముగ్గురు బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతున్నారు. మొత్తంగా.. ఇంఫాల్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. చాలా మంది నిరసనకారులు రోడ్లను దిగ్బంధించడం, టైర్లను తగలబెట్టడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం లాంటివి చేశారు. అనేక వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. చురాచంద్‌పూర్ జిల్లా సరిహద్దుకు సమీపంలో బిష్ణుపూర్ శివార్లలోని ఈ ట్రోంగ్లావోబి గ్రామంలో మూడేళ్ల కిందట జాతి ఉద్రిక్తతలు చెలరేగాయి. అప్పటి నుంచి తరచుగా ఇలాంటి హింసాత్మక ఘటనలు చెదురుమదురుగా జరుగుతూనే ఉన్నాయ్. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఖేమ్ చంద్ నేతృత్వంలో కొత్త ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ ఘర్షణలు తీవ్రస్థాయికి చేరడం ఇదే తొలిసారి.

Storey By: Anup Big Tv

Also Read: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×