E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కమల్ ను రెచ్చగొట్టిన పల్లవి.. మీనాక్షి కోసం అక్షయ్ కీలక నిర్ణయం.. భానుమతికి కమల్ ఝలక్..

Intinti Ramayanam Today Episode: కమల్ ను రెచ్చగొట్టిన పల్లవి.. మీనాక్షి కోసం అక్షయ్ కీలక నిర్ణయం.. భానుమతికి కమల్ ఝలక్..
Advertisement

Intinti Ramayanam Today Episode December 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ మాత్రం రాజేంద్రప్రసాద్ ఎందుకు ఇలా చేస్తున్నాడు.. ఒకప్పుడు మన వద్దన్నా సరే ఆస్తులు పంచాలి అని అన్నాడు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు వద్దని అనుకుంటున్నాడో అర్థం కావట్లేదు అని అంటాడు. ఈ విషయం ఎలాగైనా సరే నేను నాన్నను అడిగే తెలుసుకుంటాను అని అక్షయ్ అంటాడు… అవని అక్షయ్ ఇద్దరూ రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి ఆస్తులు పంపకాల గురించి మరోసారి అడుగుతారు. మిమ్మల్ని ఎవరేమన్నా సరే మీరు పట్టించుకోవద్దు.. ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పార్వతి కనీసం నాకైనా ఆ విషయం ఏంటో చెప్పండి అని అడుగుతుంది. నువ్వు కూడా వాళ్ళలాగే వెయిట్ చెయ్ సమయం వచ్చినప్పుడు నేనే అందరికీ చెప్తాను అని అంటాడు. మీనాక్షి ఒంటరిగా కూర్చుని శ్రేయ అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతేనే ఇలాంటి బాధలన్నీ ఉండవు అవని కూడా బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి కమల్ ని ఎలాగైనా రెచ్చగొట్టి తనతో రొమాన్స్ చేయాలని అనుకుంటుంది.. తింగరోడుతో ఎలా నా బుట్టలోకి తెచ్చుకోవాలి అని ఆలోచిస్తుంది.. ఇక తన ప్లాన్ అనుకున్న విధంగా నడుము చూపిస్తూ నాకు ఇక్కడ చీమకుట్టింది బావ అంటూ నాజూగ్గా మాట్లాడుతుంది.. తనని అలా చూసిన కమల్ టెంప్ట్ అయిపోతాడు.. పల్లవి తన ముగ్గులోకి కమల్ ను తీసుకొస్తుంది. అలా వీళ్ళిద్దరి రొమాంటిక్ నైట్ కాస్త ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. మీనాక్షి శ్రీయా అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతేని ఇక్కడ సమస్యలన్నీ తగ్గిపోతాయని అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయం ఎవరు లేవక ముందే వెళ్లిపోవాలని అనుకుంటుంది.

Advertisement

మీనాక్షి గదిలోంచి బయటికి రాగానే అక్కడ అవని నిలబడుకుని ఉంటుంది. అవని నువ్వు ఇలాంటివి ఏదో చేస్తావని అనుకున్నాను.. ఇప్పుడు వెళితే ఈ సమస్యల్ని మరింత పెద్ద వి అవుతాయి తప్ప తగ్గవు అని అంటుంది. ఇప్పుడు ఆ చక్రధర్ ని అరెస్ట్ చేయించాం. నువ్వు బయటికి వెళ్తే కచ్చితంగా నేను ఏదో ఒకటి చేస్తాడని అవని అంటుంది. వీళ్ళ మాటలని అక్షయ విన్నట్లు తెలుస్తుంది.. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నేను అర్థం చేసుకున్నాను అత్తయ్య గారు. మీ గురించి నేను అందరికీ చెప్తాను ఆగండి అనేసి అక్షయ్ అంటాడు. ఇంట్లో వాళ్ళందరినీ పిలుస్తాడు. పల్లవి వాళ్ళ నాన్న అరెస్సయ్యి జైల్లో ఉన్నాడు వాళ్ళ అమ్మ ఎవరికైనా చెప్పుకుంటుందా..

మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది. మీరు మీ అమ్మని చూసినట్టు చూడండి ఎవరికైనా అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు ఈవిడ ఇక్కడే మనతోనే ఉంటుంది అని అక్షయ్ అంటాడు.. తన భర్త గురించి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు అంటే అతను ఎంత దుర్మార్గుడు మీరు అర్థం చేసుకోవాలి అనేసి అక్షయ్ అంటాడు.. కొంచమైనా బుద్ధుండేలాగా ప్రవర్తించండి ఇకమీదట ఈవిడతో మీరు ఎలా ప్రవర్తిస్తారో నేను కూడా మీతో అలా ప్రవర్తిస్తాను అనేసి అందరికీ వార్నింగ్ ఇస్తాడు అక్షయ్..

Advertisement

అన్నయ్య ఇంత క్లియర్ గా చెప్పాడు కదా విన్నారా అనేసి కమల్ అంటాడు. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ముందే చెప్పండి వాళ్ల గురించి చూసుకుంటాం అనేసి కమల్ శ్రియ పల్లవిలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. ఆ తర్వాత పల్లవి అవని గదిలో ఉన్న డాక్యుమెంట్స్ ని వెతకాలని అనుకుంటుంది. ఈ రూమ్ లో ఎవరూ లేరని తెలుసుకొని ఆ గదిలోకి వెళ్లి ఒక డాక్యుమెంట్ ని తీసుకుంటుంది. ఇక్కడ అన్ని చూసి అక్షయ్ సర్టిఫికెట్లని షాక్ అవుతుంది. అప్పుడే ఆరాధ్య లోపలికి వస్తుంది. దొరికిపోతానేమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

Also Read : బాలు బీపిఎల్ స్టార్ట్.. మనోజ్ ను ఆడుకున్న నిమ్మకాయ.. మనోజ్, ప్రభావతికి టెన్షన్ టెన్షన్..

కమల్ భానుమతికి ఎలాగైనా సరే దిమ్మ తిరిగిపోయేలా చేయాలి అని అనుకుంటాడు. అనుమతి వస్తూ ఉంటే ఆమె కాలుకు తాడు అడ్డుపెట్టి కింద పడేస్తాడు.. యమధర్మరాజు నువ్వు అప్పుడే వచ్చావా అని భానుమతి అనుకుంటూ ఉంటుంది. ఏంటి నువ్వా ఎందుకురా నన్ను పడేసావ్? పోయిన జన్మలో నువ్వు నేను పాము ముంగిస ఏంటి? ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒకటి చేయాలని చూస్తూ ఉంటావు అని కమల్ ని అడుగుతుంది భానుమతి.. ఒకప్పుడు మంచి దానిలాగా ఉన్నావు. మా బామ్మ మారిపోయిందని చాలా సంతోషపడ్డాను.. ఇప్పుడు మళ్లీ ఆస్తులని అవనీ ఇవన్నీ పల్లవిని ఉసిగొలిపావు నా మీదకి అని కమల్ అడుగుతాడు.. ఆ మాటలు వినగానే భానుమతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×