Mother attempts suicide with child: అల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో జరిగిన తగదాలతో తల్లి, కూతురు పెట్రోల్ పోసుకుని మృతి చెందారు. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా, తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
అసలు విషయానికి వస్తే.. అల్లూరి జిల్లా కొయ్యూరు, మండలంలోని రావణపల్లి గ్రామానికి చెందిన లువ్వా సతీష్, కొయ్యూరుకు చెందిన మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సతీష్ ఆటో నడుపుతుండగా.. మౌనిక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఎంతో సంతోషంగా చేసుకున్న ఈ దంపతులకు నాలుగేళ్ల లాస్యశ్రీ అనే కుమార్తె కూడా ఉంది. అయితే ఆదివారం ఒక శుభకార్యానికి భార్యాభార్తలు వెళ్లి వచ్చాక ఇద్దరి మధ్య స్వల్ప వాదన జరిగింది. దీంతో విసుగు చెందిన మౌనిక(25) అమ్మేందుకు తెచ్చిన పెట్రోల్ బాటిల్ తీసుకొని కూతురితో పాటు అక్కడి సమీపంలోని జీడి తోటలోకి వెళ్ళి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీంతో మంటల వేడికి లాస్యశ్రీ అక్కడే పడిపోగా, మౌనిక వేడిని తట్టుకోలేక సమీప కొండవాగులోకి దూకింది.
Also Read: సీఎం అదిరిపోయే ప్లాన్..! త్వరలో కొత్త టెక్నాలజీ లక్షలాది మందికి ఉద్యోగాలు
విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి కాలిన గాయాలతో పడి ఉన్న లాస్యశ్రీని అంబులెన్స్‌లో వైద్య సేవల నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మౌనిక కోసం వెతకగా వాగులో కాలిన గాయాలతో కనిపించింది. ఆ వెంటనే ఆమెను గ్రామస్థులు ఆటోలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ కుమార్తె లాస్యశ్రీ మరణించింది. తల్లి మౌనికను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.