Vijayawada: చిన్నచిన్న నగరాల్లో ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. చిన్న రహదారులపై వాహనాలను పార్కింగ్ చేస్తుంటారు వినియోగదారులు. దీనివల్ల రద్దీ అమాంతంగా పెరుగుతోంది. ప్రధాన కూడలి దాటి వెళ్లాలంటే చాలా సమయం పడుతోంది. ఏపీలో రద్దీ పెరుగుతున్న నగరాల్లో తిరుపతి, విశాఖ, విజయవాడ నగరాలు ఉన్నాయి. తాజాగా విజయవాడలో మల్టీ లెవల్ పార్కింగ్ రెడీ అవుతోంది.
విజయవాడలోని యనమలకుదురు ప్రాంతం గురించి చెప్పనక్కర్లేదు. ఆ ప్రాంతంలో రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఉంది. ఈ దేవాలయానికి భక్తులు అధికసంఖ్యలో వస్తుంటారు. కార్తీకమాసం వచ్చిందంటే చాలు రోడ్లపైనే వాహనాలు బారులు తీరుతాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మల్టీలెవల్ పార్కింగ్ భవనాన్ని నిర్మిస్తున్నారు. రానున్న మూడు నాలుగు దశాబ్దాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడు ఓ భక్తుడు.
విజయవాడలో తొలిసారి మల్టీ లెవల్ పార్కింగ్ రెడీ అవుతోంది. నగర శివారులో యనమలకుదురు ప్రాంతంలో దేవాదాయ శాఖకు చెందిన రామలింగేశ్వరస్వామి ఆలయం సమీపంలో మల్టీ లెవల్ పార్కింగ్ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎకరా స్థలంలో నిర్మిస్తున్నారు. రూ.30 కోట్లతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఆ భవనంలో ఒకేసారి 500 కార్లు పార్కింగ్ చేయవచ్చు. లేకుంటే 2 వేల బైక్‌లు నిలిపే అవకాశం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్లు, ఫస్ట్ ఫ్లోర్‌లో బైక్‌లు పార్క్ చేసేలా ఏర్పాటు చేస్తున్నారు. మిగతా ఫ్లోర్లలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యనమలకుదురుకు చెందిన ఓ భక్తుడు నరసింహారావు ఈ ఆలయం కోసం ఎంతో కృషి చేశారు.
ALSO READ: సీఎం అదిరిపోయేలా ప్లాన్.. త్వరలో కొత్త టెక్నాలజీ, లక్షలాది మందికి ఉద్యోగాలు
సొంత డబ్బుతో ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. ఆ భక్తుడు తన జీవితాన్ని రెండు దశాబ్దాలుగా శివాలయం కోసం అంకితం చేశాడు. నరసింహారావు ఇప్పటివరకు రూ.70 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం చేపట్టిన పనులకు మరో రూ.42 కోట్లను కేటాయిస్తున్నారు. ఆలయంలో రూ.12 కోట్లతో అన్నదానం భవనాన్ని నిర్మిస్తున్నారు.
ఇదే భవనంపై 50 గదులతో కాటేజీ నిర్మాణం జరుగుతోంది. రెండేళ్ల కిందట మల్టీ లెవెల్ పార్కింగ్ భవనానికి ఆయన శ్రీకారం చుట్టారు. నెల లేదంటే రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది. విజయవాడ సిటీతోపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ ఎంతో సౌకర్యంగా ఉండనుంది.