BigTV English

CM Chandrababu Progress Report: సీఎం అదిరిపోయే ప్లాన్..! త్వరలో కొత్త టెక్నాలజీ.. లక్షలాది మందికి ఉద్యోగాలు

CM Chandrababu Progress Report: సీఎం అదిరిపోయే ప్లాన్..! త్వరలో కొత్త టెక్నాలజీ.. లక్షలాది మందికి ఉద్యోగాలు

CM Chandrababu Progress Report: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రితిష్ఠాత్మకంగా చేపట్టిన పీ4 పథకం వల్ల.. మిగతా సంక్షేమ పథకాల్లో కోత ఉండదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే.. ఏపీలో ప్రతి నీటి చుక్కని సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తంగా.. ఈ వారం ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలేంటి? మొదలుపెట్టిన కొత్త కార్యక్రమాలేంటి?


జులై 5, శనివారం ( ప్రాజెక్టులపై రివ్యూ )
ఆంధ్రప్రదేశ్‌లో నీటి నిర్వహణను సక్రమంగా చేస్తే.. కరువు పరిస్థితులు ఉండవన్నారు సీఎం చంద్రబాబు. హంద్రీనీవా సుజల స్రవంతి, పోలవరం ఎడమ కాల్వ పనులు, ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీలో ప్రతి నీటి చుక్కని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం పూర్తి స్థాయి ప్రణాళికతో ప్రభుత్వ శాఖలు, అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా.. భూగర్భ జలాల పెంపుపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ అంశంలో ఇరిగేషన్ శాఖతో పాటు పంచాయతీ రాజ్ శాఖని కూడా భాగస్వామిని చేయాలని సీఎం అన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్-1 పనులు పూర్తి చేసి.. జీడిపల్లి రిజర్వాయర్‌ని పూర్తిగా నింపేందుకు నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఫేజ్-2 ద్వారా పుంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్‌ ఈ నెలాఖరున నీటిని విడుదల చేయాలని సూచించారు. గాలేరు-నగరి ద్వారా కడపకు నీళ్లిచ్చేందుకు పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరుకు పోలవరం ఎడమ కాల్వ పనులు పూర్తి చేయాలని.. వచ్చే ఏడాది జూన్ నాటికి వెలుగొండని పూర్తి చేసి నీళ్లివ్వాలని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు, నీటి నిర్వహణకు చేపడుతున్న చర్యలపై ప్రధానంగా చర్చించారు.

జులై 5, శనివారం ( అమరావతి పరుగులు )
ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీసులో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం ఏడు అంశాలకు ఆమోదం తెలిపారు. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో.. అదనంగా 20 వేల 494 ఎకరాల భూసమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిగతా అభివృద్ధి ప్రాజెక్టులకు.. RFP పిలిచేందుకు ఆమోదం తెలిపారు. అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో.. కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనని కూడా ఆమోదించారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులకు.. ఇసుక డ్రెడ్జింగ్ కోసం సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన.. డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఇచ్చారు. భూకేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూకేటాయింపులకు ఆమోదం తెలిపారు. రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికి సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.


జులై 4, శుక్రవారం ( సంక్షేమానికి పీ4 అదనం )
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న పీ4 కార్యక్రమానికి సంబంధించి.. సీఎం నేతృత్వంలో స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.. పీ4 పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పీ4 అమలు, పర్యవేక్షణ కోసం జిల్లా, నియోజకవర్గ స్థాయి చాప్టర్లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కమిటీల్లో ఇంచార్జ్ మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. పీ4 అమలులో బాపట్ల జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. వచ్చే ఆగస్ట్ 15 నాటికి.. 15 లక్షల బంగారు కుటుంబాలు, లక్ష మంది మార్గదర్శులను గుర్తించాలని నేతలకు, అధికారులకు సూచించారు. పీ4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని.. ఇది సంక్షేమానికి అదనమని సీఎం స్పష్టం చేశారు. పీ4 పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలన్నారు.

జులై 4, శుక్రవారం ( భూ సమస్యలకు చెక్! )
ఏడాదిలో భూ సమస్యలు పరిష్కారం చేస్తానని మహానాడులో ప్రకటించిన మాటకు కట్టుబడి.. సీఎం చంద్రబాబు భూ వివాదాలు సమస్యల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా.. ఏడాది కాలంలో తీసుకున్న చర్యలపై.. ఇటీవలే సీఎం రివ్యూ నిర్వహించారు. గత పాలకుల కారణంగా.. గ్రామాల్లో భూ వివాదాలు, భూ సర్వే సమస్యలు తలెత్తాయని సీఎం ఫైర్ అయ్యారు. భూవివాదాల పరిష్కారంపై ఇప్పటికే పలుమార్లు మంత్రివర్గంలో చర్చించారు. అయితే.. భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ తీసుకుంటున్న చర్యలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో భారీ స్థాయిలో మార్పులు జరిగితే తప్ప ఫలితాలు ఉండవనే దానిపైనా దృష్టి సారించారు. తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో అర్జీలు పేరుకుపోవడంపైనా ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ సేవలను మరింత సులభతరం చేసేందుకు విస్తృతంగా టెక్నాలజీ వాడకంపైనా దృష్టి సారించనుంది.

జులై 3, గురువారం ( రైతులను ఆదుకుంటాం )
మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమ కలిసి పనిచేయాలని ఇటీవల తన కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులు, పల్ప్ పరిశ్రమల ప్రతినిధులు, ప్రాసెసింగ్ యూనిట్లతో సీఎం సమావేశమయ్యారు. రైతుల నుంచి తక్షణమే మామిడి కొనుగోలు చేసి వారిని ఆదుకోవాలని ప్రాసెసింగ్, పల్ప్ పరిశ్రమలను ఆదేశించారు. మామిడి రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యా లేకుండా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణ చేపడతామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే మ్యాంగో పల్ప్‌పై విధిస్తున్న జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించేలా మాట్లాడాలని సీఎంకు విన్నవించారు. ఇక.. మామిడి పంటలో ఎరువులు, పురుగుల మందులు వాడకుండా అత్యుత్తమ విధానాలను అనుసరించాలని.. సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు. ప్రాసెసింగ్ పరిశ్రమలు రైతుల నుంచి మామిడి కొనుగోలు చేస్తేనే.. వారికి న్యాయం జరుగుతుందన్నారు.

జులై 3, గురువారం ( ఆరోగ్య కేంద్రాలపై ఫోకస్ )
కుప్పం ఏరియా ఆస్పత్రిలోని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను.. నియోజకవర్గంలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని మెడికల్ ఆఫీసర్లతో వర్చువల్ విధానంలో మాట్లాడి.. వారికి తగిన సూచనలు చేశారు.

జులై 3, గురువారం ( సుపరిపాలనలో బాబు అడుగు )
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా.. సీఎం చంద్రబాబు తిమ్మరాజుపల్లెలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నాలుగు గంటల పాటు ప్రజలను నేరుగా కలిసి.. వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజాభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు.

అభివృద్ధి చేసే వారికి మాత్రమే.. సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉందన్నారు సీఎం చంద్రబాబు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా.. కుప్పం బ్రాండ్ పెంచుతామని చెప్పారు. అదేవిధంగా.. సీఎం చంద్రబాబు చేపట్టిన పేదల సేవలో కార్యక్రమం నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. మరోవైపు.. అమరావతిని అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రంగా మార్చేందుకు.. ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్‌ని అందిపుచ్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.. ఏపీలో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.
ఏపీ సీఎం ప్రోగ్రెస్

జులై 2, బుధవారం ( బ్రాండ్ కుప్పం )
కుప్పంను.. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంలో తయారుచేస్తామన్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ చేసి.. బ్రాండ్ కుప్పం ఎస్టాబ్లిష్ చేస్తామని తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇటీవల కుప్పంలో పర్యటించిన సీఎం.. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు.. చంద్రబాబు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధిలో భాగంగా.. 850 కోట్లతో కుప్పంలో ఎయిర్‌పోర్ట్ నిర్మిస్తామని చెప్పారు. కుప్పంలో ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో కుప్పంలో బ్రహ్మండమైన అభివృద్ధి జరగబోతోందని చెప్పారు. కుప్పం రూపురేఖలు మార్చేందుకు అద్భుతమైన ప్రణాళిక తయారు చేశామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాదిలోనే కుప్పంలో హంద్రీనీవా నీళ్లు పారిస్తామన్నారు సీఎం. నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకు వస్తామని.. ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుందన్నారు సీఎం.

జులై 1, మంగళవారం ( పేదల సేవలో )
ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన పేదల సేవలో కార్యక్రమం.. నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పర్యటించిన సీఎం.. కొందరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. చర్మకారుడు పోశిబాబును తన కారులో ఎక్కించుకున్నారు. పోశిబాబు వృత్తి, జీవన స్థితిగతులు, ఎదుర్కొంటున్న సమస్యలు, కుటుంబ నేపథ్యం గురించి.. సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇంటికి వెళ్లి.. కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. పోశిబాబుకు చర్మకార్ పింఛన్ అందించారు.
స్పాట్.. కలెక్టర్ దత్తత తీసుకోవడం.. ఇల్లు కట్టిస్తానని చెప్పడం.. షాపు పెట్టిస్తాననడం.. ఇక.. ఓ జనరల్ స్టోర్‌కు వెళ్లి.. కొండా వెంకటేశ్వరరావు, అతని కుటుంబసభ్యులతో సీఎం మాట్లాడారు. ప్రజావేదిక సభలో పాల్గొని.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

జూన్ 30, సోమవారం ( ఆంధ్రా క్వాంటమ్ )
క్వాంటమ్ వ్యాలీపై.. అమరావతిలో ఏపీ ప్రభుత్వం నేషనల్ వర్క్ షాప్ నిర్వహించింది. దీనికి.. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌కి అందిపుచ్చుకోవాలని.. ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీకి అభినందనలు తెలిపారు. ఈ 3 సంస్థల సహకారంతో.. అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాజధాని అమరావతికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయన్నారు చంద్రబాబు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కేంద్రంగా అమరావతిని మారుస్తామన్నారు.

Also Read: ట్రంప్‌కు బిగ్ షాక్.. అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ప్యూచర్ ప్లాన్ ఇదే!

ఏపీ ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్‌పై ఫోకస్ చేయడానికి బలమైన కారణాలున్నాయ్. ఇది.. రాబోయే కాలంలో ప్రపంచాన్ని శాసించబోయే కీలకమైన టెక్నాలజీ. దీనిపై ముందుగానే దృష్టి పెట్టడం ద్వారా.. ఏపీ టెక్నాలజీ రెవల్యూషన్‌లో లీడర్‌షిప్ రోల్ పోషించాలని చూస్తోంది. అందుకోసమే.. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీనీ ఏర్పాటు చేయాలని.. ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది.. ఇండియాలోనే తొలి ఇంటిగ్రేటెడ్ క్వాంటమ్ టెక్నాలజీ ఎకో-సిస్టమ్‌గా ఉండనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ, సెమీ కండక్టర్ రీసెర్చ్, డిఫెన్స్ ఇన్నోవేషన్లని.. ఒకే గొడుకు కిందకు తీసుకురానున్నారు. ఇది.. గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. వేలాది ఉద్యోగాలను సృష్టిస్తుందని ఏపీ ప్రభుత్వం నమ్ముతోంది. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, భవిష్యత్ ఆవిష్కరణలకు.. ఓ బలమైన పునాదిని నిర్మించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×