BigTV English

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని ఆడుకున్న ప్రేమ, నర్మద.. భాగ్యం ఎంట్రీతో రచ్చ..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని ఆడుకున్న ప్రేమ, నర్మద.. భాగ్యం ఎంట్రీతో రచ్చ..

Illu Illalu Pillalu Today Episode july 7th: నిన్నటి ఎపిసోడ్ లో… కంగారు పడుతున్న వల్లిని చూసి ప్రేమ వల్లి అక్కను చూస్తుంటే ఏదో టెన్షన్ పడుతున్నట్లు అనిపిస్తుంది అని అంటుంది.. దానికి వల్లి నేను టెన్షన్ పడుతున్నానా ఎందుకు టెన్షన్.. ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఉత్సాహంగా ఉన్నాను చూడండి అని అంటుంది. నువ్వు సంతోషించే విషయం ఒకటి చెప్పనా మీ నాన్నగారిని మేము మున్సిపల్ ఆఫీసు దగ్గర సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే కలిసాము అని అంటారు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు. ఫైనాన్స్ బిజినెస్ అంటే కేవలం బిజినెస్ గురించి మాట్లాడాలి ఆయన మాత్రం పల్లీల్లో చట్నీ ఎలా వేయాలి. ఇంత ఫ్రాడ్ ఫ్యామిలీని అస్సలు అనుకోలేదు. మీరు నిజంగానే ఫ్రాడ్ ఫ్యామిలీ బావ వీళ్లు..  చెప్పమ్మా చెప్పు అని తిరుపతి శ్రీవల్లిని అడుగుతాడు. శ్రీవల్లి నోట మాట రాకుండా ఉంటుంది. రామరాజు కూడా ఏంటమ్మా శ్రీవల్లి మీ నాన్న ఫైనాన్స్ బిజినెస్ అన్నావు కదా ఇడ్లీలు వ్యాపారం ఏంటి అని అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.


ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. నర్మదా సాగర్ ఇద్దరూ అర్ధరాత్రి దొంగగా లాంతరు తీసుకొని బయటకొస్తారు. అది చూసిన శ్రీవల్లి కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెనకాలే వస్తుంది. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు అంటే సాగర్ కు చదువు చెప్పిందా? ఎందుకు ఇప్పుడు చదువుతున్నారు. వీరిద్దరి మేటర్ ఈరోజు ఇంట్లో వాళ్లకి కచ్చితంగా తెలిసేలా చేయాలని దొంగ దొంగ అని అరుస్తుంది. ఇంట్లోని వాళ్లంతా హాల్లోకి వస్తారు. ఆ తర్వాత తిరుపతి రామ రాజు మధ్య కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఏంటి దొంగనా ఎక్కడా అంటూ కర్రపట్టుకుని వస్తాడు రామరాజు. అయితే అందరు బయటకు వెళ్లేసరికి అక్కడ నర్మద, సాగర్‌లు బయట కనిపిస్తారు. సాగర్ చదువుతూ కనిపిస్తే.. నర్మద ఫోన్‌లో పాటు వింటూ ఉంటుంది. అలా రామరాజు కంట్లో పడేట్టు చేస్తుంది శ్రీవల్లి..

సాగర్, నర్మదా ఇద్దరు కలిసి బయట కూర్చుని చదువుతున్నట్లు చూసి షాక్ అవుతారు. అరె నడిపోడా అర్ధరాత్రి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా అని రామరాజు అడుగుతాడు.. అది నాన్న అది అని సాగరు టెన్షన్ పడుతూ ఉంటాడు. శ్రీవల్లి నా కడుపు మంట ఇప్పుడు చల్లారింది నాకు చాలా హాయిగా ఉంది అని మనసులో అనుకుంటుంది. లేకపోతే నన్ను ఇరికించాలని చూస్తుందా బాగా ఇరుక్కుంది ఇప్పుడు ఏం చెప్తాదో చూడాలి అని అనుకుంటుంది. సాగర్ మరిది చేతిలో బుక్కు ఉంది ఏంటో అడగండి మావయ్య గారు అని శ్రీవల్లి అంటుంది. ఏదో పోటీ పరీక్షలకు రెడీ అవుతున్నట్లు నాకు అనిపిస్తుంది మావయ్య గారు అని పుల్లలు పెట్టేస్తుంది..


నర్మదా రామరాజని చూడగానే నోట మాట రాకుండా ఉండిపోతుంది.. సాగర్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ బుక్ ఏంట్రా ఇలా తీసుకురా లోపలికి అనేసి అంటాడు. అయితే సాగర్ టెన్షన్ పడుతూ ఉంటే రామరాజు ఏదో దాస్తున్నావా రా అని అడుగుతాడు.. ఆ బుక్ నాది మామయ్య గారు మా ఆఫీసులో ప్రమోషన్స్ కోసం టెస్ట్ పెడతారు. దానికి నాకు ఇచ్చారు అందుకే చదువుకుంటున్నాను అని అంటుంది నర్మదా.. నర్మదా చదువుకోవాలి కానీ సాగర్ మరిది చదువుతున్నారేంటి మావయ్య గారు అని శ్రీవల్లి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది.. అయితే వేరే వాళ్ళు చెప్తే చదువుకోవడం చాలా ఈజీ అందుకే సాగర్ చదువుతుంటే నేను వింటున్నాను అని నర్మదా చెప్తుంది.

శ్రీవల్లి ఎంఏ ఇంగ్లీష్ చదివావు కదా ఆ మాత్రం తెలీదా అంటూ అటు నర్మదా ఇటు ప్రేమ వాయించేస్తారు.. ఇక చేసేదేమీ లేక తప్పించుకుంటుంది శ్రీవల్లి.. ఉదయం లేవగానే శ్రీవల్లి దగ్గరికి నర్మదా ప్రేమలో వెళ్లి గుడ్ మార్నింగ్ బల్లి అక్క అని అంటారు. మీరిద్దరు నన్ను బల్లి అన్నారు కదా అని శ్రీవల్లి ఫీలవుతుంది. నీలాగా పుల్లలు పెట్టే వాళ్ళని బల్లి వెనక ఇంకేమంటారు అని ఇద్దరూ ఎగతాళి చేస్తారు. ఇక తర్వాత భాగ్యం సడన్ గా ఎంట్రీ ఇస్తుంది. ఏంటి చెల్లెమ్మ కబురు కూడా లేకుండానే సడన్ గా ఇచ్చారు అంటే ఏకాదశి కదండీ మీ ఇద్దరికీ బట్టలు పెడదామని వచ్చామండి అని అంటుంది.

Also Read:అవనికి రాజేంద్రప్రసాద్ గిఫ్ట్.. పల్లవి, శ్రీయాకు దిమ్మతిరిగే షాక్..ఫైనల్ గా అవని పంచ్..

నర్మదా ప్రేమలను దారుణంగా అవమానించాలని భాగ్యం ఫిక్స్ అయ్యే ప్లాన్ ప్రకారం ఇంట్లోకి అడుగుపెడుతుంది.. నర్మదను పీటలు తీసుకురమ్మని చెప్పి దానిమీద దుమ్ము దులపాలని చెప్తుంది. మీ అమ్మ వాళ్లు మీకు ఇదే నా పద్ధతులు నేర్పించిందని ఇద్దరినీ నానా మాటలు అంటుంది. ప్రేమ పీటల మీద ఉన్న దుమ్మును దులిపి భాగ్యంకు దిమ్మదిరిగిపోయేలా చేస్తుంది. మీరిద్దరిని అవమానించాలని నేను ఇక్కడికి వచ్చాను అని భాగ్యం అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ ప్రేమ తన పుట్టింటి వాళ్ళని చూసి బాధపడుతూ ఉంటుంది. ప్రేమ బాధను చూసి తట్టుకోలేక పోయిన ధీరజ్ మీ ఇంటి వాళ్ళని చూడాలనిపిస్తుందా..? వెళ్తావా అయితే మీ ఇంటికి అని అంటాడు. ప్రేమ ఎంత చెప్తున్నా కూడా వినకుండా ధీరజ్ ప్రేమను బయటకు తీసుకొస్తాడు.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మంగళవారం ఎపిసోడ్లో ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్తుందా? ధీరజ్ పై అరుస్తుందా? చూడాలి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×