Madhya pradesh shocking: మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన ఒకటి వెలుగుచూసింది. ట్రైనింగ్‌లో ఉన్న ఇద్దరు ఆర్మీ అధికారులను చావబాది.. వారితో వెళ్లిన మహిళ ఫ్రెండ్‌ని రేప్ చేసింది ఓ గ్యాంగ్. తమకు డబ్బులు ఇస్తేనే వారికి విడుదల చేస్తామని మెలిక పెట్టింది. ఇంతకీ ఆర్మీ ఆఫీసర్లు చావబాదినదెవరు? ఇప్పుడిదే మధ్యప్రదేశ్‌లో హాట్ హాట్‌గా మారింది.
ఇద్దరు ఆర్మీ అధికారులు మధ్యప్రదేశ్‌లోని మోవ్ ఆర్మీ కాలేజీలో ట్రైనింగ్ అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇద్దరు ట్రైనీ అధికారులు.. మహిళా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లారు. అప్పటవరకు నలుగురు ఆడుతూ పాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఛోటీ జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతవరకు బాగానే సాగింది.
అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. వీరిని ఎనిమిది మంది సభ్యుల గల దోపిడీ గ్యాంగ్ రౌండప్ చేసింది. ఆ క్షణం ఏం చేయ్యాలో తెలీక సైలెంట్ అయ్యారు. గన్స్, పదునైన కత్తులు చూపించి ట్రైనీ అధికారులతోపాటు మహిళలను బంధించారు. ఆపై దారుణంగా కొట్టి వారి నుంచి బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకున్నారు. ఓ మహిళపై అత్యాచారానికి తెగబడింది ఆ గ్యాంగ్.
ఒక ఆర్మీ అధికారిని, మరో మహిళను విడిచిపెట్టింది. మరో ఇద్దర్నీ బంధీలుగా తమ పెట్టుకుంది ఆ గ్యాంగ్. మరో అధికారి, మహిళను విడుదల చేయాలంటే తమకు 10 లక్షలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. తేడా చేస్తే వీరిని చంపేస్తామని బెదిరించి వారిని పంపింది.
ALSO READ: భర్తను కాదని మరిదితో పారిపోయిన మహిళ.. నెల రోజుల తరువాత రోడ్డుపై ధర్నా చేస్తూ..
దొంగల చెర నుంచి బయటపడిన ట్రైనీ అధికారి, ఆర్మీ ఆఫీసుకు వెళ్లి జరిగిన విషయాన్ని పైస్థాయి అధికారులకు వివరించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆర్మీ అధికారులతోపాటు పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. వీరి వాహనాలను ముందుగానే గమనించిన దొంగల గ్యాంగ్ అక్కడి నుంచి పరారీ అయ్యింది.
నలుగురు బాధితుల్ని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇద్దరు ట్రైనీ అధికారులకు గాయాలయ్యాయి. ఓ మహిళపై అత్యాచారం జరిగినట్టు తేలింది. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. వీరిద్దరికీ నేర చరిత్ర ఉన్నట్లు తేలింది. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు.