BigTV English

Women’s T20 World Cup: మహిళల టీ 20 ప్రపంచకప్.. టికెట్ ధర ఎంతో తెలుసా?

Women’s T20 World Cup: మహిళల టీ 20 ప్రపంచకప్.. టికెట్ ధర ఎంతో తెలుసా?
ICC Women’s T20 World Cup tickets start from just Rs 114, free for all U18: ఐసీసీ నిర్వహించే మహిళా టీ 20 ప్రపంచకప్ వేదికను బంగ్లాదేశ్ నుంచి యూఏఈకి మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ క్రికెట్ కి ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతో టిక్కెట్ల ధరను అత్యంత తక్కువకి పెట్టారు. నిజానికి ప్రారంభ ధర తెలిస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. కేవలం రూ.114 గా నిర్ణయించారు. అది ఇండియన్ కరెన్సీలో చూస్తే అంత ఉంది. వారి దేశపు లెక్క ప్రకారం ఐదు దిర్హమ్స్ గా పేర్కొంది.

ఎందుకింత తక్కువ ధర పెట్టాల్సి వచ్చిందంటే.. యూఏఈలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు నివసిస్తున్నారు. అందువల్ల వారందరూ తమ దేశం ఆడేటప్పుడు వచ్చి మద్దతు తెలియచేసేందుకు వీలుగా తక్కువ ధర పెట్టినట్టు ఐసీసీ తెలిపింది. ఇక అన్నింటికి మించి 18ఏళ్లలోపు యువతకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో సరదాగానైనా వచ్చి క్రికెట్ మ్యాచ్ లు చూస్తారని, స్టేడియంలు కళకళలాడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.


ఇకపోతే టోర్నీలో పాల్గొనే మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్  ఉంటే, గ్రూప్ బీలో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, వెస్టిండీస్ ఉన్నాయి. ఏ విధంగా ఆడతారంటే.. టీ 20 మెన్స్ ప్రపంచకప్ ఆడినట్టుగానే ఒక గ్రూప్ లో ఉన్న ఐదు జట్లతో ప్రతి జట్టు ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో ఉన్నవి సెమీస్ కు వెళతాయి. అక్కడ నుంచి షరా మామూలే. సెమీస్ లో గెలిచిన జట్లు ఫైనల్ కు చేరతాయి.

Also Read: ముంబై ఇండియన్స్ నుంచి.. రోహిత్ అవుట్?


భారత్ ఆడే మ్యాచ్ ల వివరాలు: అక్టోబర్ 4 న న్యూజిలాండ్, 6 న పాకిస్తాన్, 9న శ్రీలంక, 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇటీవల ఆసియా కప్ లో భారత్ ఫైనల్ వరకు ఓటమన్నదే లేకుండా వెళ్లి.. శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. రన్నరప్ గా మిగిలింది.

మరి టీ 20 ప్రపంచకప్ లో ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే. అయితే టీమ్ ఇండియా పురుషుల జట్టు టీ 20 ప్రపంచకప్ ను గెలిచిన సంగతి తెలిసిందే. వారిలాగే వీరు కూడా కప్ గెలిచి చూపిస్తారని నెటిజన్లు వ్యాక్యానిస్తున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×