E-Paper
Advertisement

2 Men Raped Beggar: మూసాపేట్ లో దారుణం.. భిక్షాటన చేసే మహిళపై రెచ్చిపోయిన కామాంధులు!

2 Men Raped Beggar: మూసాపేట్ లో దారుణం.. భిక్షాటన చేసే మహిళపై రెచ్చిపోయిన కామాంధులు!
Advertisement

2 Men Hyderabad Men Raped a Beggar woman: ఎన్ని చట్టాలొచ్చినా, ఎంతమందిని కఠినంగా శిక్షించినా కామాంధుల ఆలోచనల్లో మార్పు రావట్లేదు. పెద్దలే కాదు.. పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ లో చూడకూడనివి చూస్తూ.. చేయకూడని పనులు చేసి.. జైలు పాలవుతున్నారు. చిన్నా, పెద్ద తేడా లేదు. ఆడతనం ఉంటే చాలనుకునే కీచకులు.. తమ కోరికను ఎలాగైనా తీర్చుకునేందుకై ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లి పీఎస్ పరిధిలో దారుణ ఘటన వెలుగుచూసింది. చిత్తుకాగితాలు ఏరుకుంటూ.. భిక్షాటన చేసే మహిళపై ఇద్దరు కామాంధులు తమ కామవాంఛను తీర్చుకున్నారు. ఆ మహిళ తీవ్రరక్తస్రావంతో మరణించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 21 ఆదివారం తెల్లవారుజామున మహిళ వైన్ షాపు వైపుగా వెళ్తుండగా.. ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి అడ్డుకున్నారు. ఆమె కాళ్లు, చేతులు పట్టుకుని పక్కనే ఉన్న ఏఆర్ పైప్స్ వర్క్స్ సెల్లార్లోకి లాక్కెళ్లారు. మహిళపై కామవాంఛ తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: ది కర్ణాటక స్టోరీ.. మతమార్పిడి పేరుతో మహిళపై జంట దారుణం

బాధిత మహిళ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అత్యాచారం తర్వాత తీవ్రరక్తస్రావంతో మరణించినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి.. రేప్ అండ్ మర్డర్ కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీలో కనిపించిన బైక్ నంబర్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×