BigTV English

Religious Conversion: ది కర్ణాటక స్టోరీ.. మతమార్పిడి పేరుతో మహిళపై జంట దారుణం..!

Religious Conversion: ది కర్ణాటక స్టోరీ.. మతమార్పిడి పేరుతో మహిళపై జంట దారుణం..!

Religious Conversion in Karnataka: నీ మతాన్ని ప్రేమించు.. పరమతాన్ని గౌరవించు.. ఇది కేవలం అక్షరాల వరకే పరిమితం. ఎందుకంటే.. ఇప్పుడున్న సమాజంలో ఎవరికి నచ్చిన మతంలో వారుండటం అనేది కష్టతరమైంది. బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళను బలవంతంగా మతం మార్చేందుకు ఓ జంట చేయకూడని ఘాతుకానికి పాల్పడింది. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. ఆడదానికి ఆడదే శత్రువు అన్న సామెత ఇలాంటి ఘటనల్లో నిరూపితమవుతుంది. తన ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేసి బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. సదరు వ్యక్తి తన భార్య కళ్లెదుటే అత్యాచారానికి పాల్పడి.. బుర్ఖా తొడిగి.. కుంకుమ పెట్టుకోలేకుండా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.


బెళగావి ఎస్పీ భీమశంకర్ గులేడ తెలిపిన వివరాల ప్రకారం.. 2023లో రఫిక్ అనే వ్యక్తి.. 28 ఏళ్ల మహిళను తన ఇంట్లోకి మకాం మార్చాడు. తన భార్యతో కలిసి ఆమెతో ఉంటున్న రఫిక్.. సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూపించి బెదిరించడం మొదలు పెట్టాడు. తన భార్య ఎదుటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కుంకుమ ధరించవద్ధని ఆంక్షలు విధించారు. బుర్ఖా ధరించి రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలని బలవంతం చేశారు. కులం పేరుతో దూషించారు.

Also Read: దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త


అంతేకాదు.. భర్తకు విడాకులు ఇచ్చి తనతోనే ఉండాలని రఫిక్ డిమాండ్ చేశాడని, చెప్పిన మాట వినకపోతే క్లోజ్ గా దిగిన ఫొటోలను బయటపెడతానని, మతం మార్చుకోకపోతే చంపేస్తానని బెదిరించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా.. సౌందట్టి పీఎస్ లో ఏడుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మతస్వేచ్ఛ హక్కు చట్టం, ఐటీ చట్టంలోని ఎస్సీ,ఎస్టీ, అత్యాచారం, కిడ్నాప్, నేరపూరితమైన బెదిరింపులు సహా.. పలు సెక్షన్ల కిందద కేసు నమోదు చేశారు.

Tags

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×