Big Stories

AP 10th Results Released: పదో తరగతి ఫలితాలొచ్చేశాయ్.. 17 స్కూల్స్ లో ఒక్కరూ పాసవ్వలేదు!

AP 10th Class Results Released: ఏపీలో పదవ తరగతి పరీక్షల ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్.. ఉదయం 11.00 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 84.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పదోతరగతి ఫలితాల్లోనూ బాలికల హవానే కొనసాగింది. 89.17 శాతం మంది బాలికలు పది పరీక్షల్లో పాసవ్వగా, 84.32 శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు.

- Advertisement -

2003 స్కూళ్లలో 100 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 17 స్కూళ్లలో ఒక్కరూ పాస్ అవ్వలేదని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. 96.37 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా టాప్ ప్లేస్ లో ఉండగా.. 62.47 ఉత్తీర్ణతతో కర్నూల్ జిల్లా లాస్ట్ ప్లేస్ లో ఉంది. మే 24 నుంచి ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

- Advertisement -

విద్యార్థులు తమ ఫలితాలను bse.ap.gov.in  లో లేదా results.bse.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు. పరీక్ష ఫలితాలు వెల్లడించిన తర్వాత వాటిని ఆన్ లైన్ లో ఉంచారు. విద్యార్థులు తమ రోల్ నంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

పదో తరగతి ఫలితాలను వెల్లడించిన అనంతరం సురేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది పదోతరగతి పరీక్షల మూల్యాంకనం రికార్డు సమయంలో వేగంగా పూర్తయిందన్నారు. 2023-24 విద్యాసంవత్సరం పూర్తికాకుండానే ఫలితాలను వెల్లడించామన్నారు.

Also Read: తెలంగాణ విద్యార్థులకు అలర్ట్.. 24న ఇంటర్, మే1న టెన్త్ రిజల్ట్స్

ఆన్ లైన్ లో ఫలితాలు చూసుకునేందుకు అంతరాయం వస్తే.. విద్యార్థులు తమ మొబైల్ నంబర్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. వోడా ఫోన్ యూజర్.. మీ హాల్ టికెట్ నంబర్ ను 56300 నంబర్ కు, బీఎస్ఎన్ఎల్ యూజర్ 55352 నంబర్ కు, టాటా ఇండికాం యూజర్లు 56263 నంబర్ కు, టాటా డొకొమో యూజర్లు 58888 నంబర్ కు హాల్ టికెట్ నంబర్లను సెండ్ చేస్తే.. ఫలితాలు నేరుగా మీ మొబైల్ కే వస్తాయి.

2023-24 విద్యాసంవత్సరంలో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకై 3,473 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. 6.23 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు, 1.02 లక్షల మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పది ఫలితాల్లో 5.34 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News