E-Paper
Advertisement

Nagarkurnool District: గుండెలు పిండేసే ఘటన.. కులాల కారణంగా 2 నెలల చిన్నారి మృతి! అసలేం జరిగిందంటే?

Nagarkurnool District: గుండెలు పిండేసే ఘటన.. కులాల కారణంగా 2 నెలల చిన్నారి మృతి! అసలేం జరిగిందంటే?
Advertisement

Nagarkurnool District: దారుణం.. ప్రస్తుత కాలంలో సమాజం మారుతున్న కుల పిచ్చి మాత్రం తగ్గడం లేదు.. ఈ కుల వివక్ష అనే మహమ్మారి పసిప్రాణాలను బలితీసుకోవడం అత్యంత దురదృష్టకరం. అయితే నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని కుమ్మెర మల్లన్న జాతరలో చోటుచేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. భక్తితో మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్లిన ఒక నిరుపేద కుటుంబానికి సామాజిక వివక్ష రూపంలో చావు దెబ్బ తగిలింది. దైవ సన్నిధిలో అందరూ సమానమే అన్న సూత్రాన్ని విస్మరించి, కేవలం కులం పేరుతో అడ్డుకోవడం మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలకు నిదర్శనంగా నిలిచింది.

తోపులాటలో అనంత లోకాలకు..
బాధిత మహిళ చంద్రకళ తెలిపిన వివరాల ప్రకారం, దేవుడి దర్శనం కోసం వెళ్తున్న తరుణంలో కొందరు అగ్రకుల వ్యక్తులు తమను అడ్డుకున్నారని, ఆ క్రమంలోనే వాగ్వాదం పెరిగి దాడికి దిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘర్షణ, తోపులాట మధ్య, తల్లి ఒడిలో ఉన్న రెండు నెలల పసిపాప తీవ్రంగా నలిగిపోయి ప్రాణాలు కోల్పోయింది. ఊపిరి పోసుకోవాల్సిన చోటే ఆ చిన్నారి ఊపిరి ఆగిపోవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుల అహంకారం ఎంతటి దారుణానికి ఒడిగడుతుందో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Advertisement

న్యాయం కోసం బాధితుల పోరాటం..
తమ బిడ్డ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, బాధితులు పసికందు మృతదేహంతో హైవేపై బైఠాయించి నిరసన తెలిపారు. దీనివల్ల భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినప్పటికీ, తమకు జరిగిన అన్యాయం ప్రపంచానికి తెలియాలన్న ఆవేదన వారిలో కనిపించింది. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా, తమ బిడ్డ మృతికి బాధ్యులైన వారికి శిక్ష పడే వరకు వెనకడుగు వేసేది లేదని బాధితులు స్పష్టం చేస్తున్నారు.

Also Read: భార్య-ముగ్గురు పిల్లలను చంపి, యజమాని ఆత్మహత్య, యూపీలో దారుణం

Advertisement

సమాజం మేల్కొనాల్సిన సమయం
ప్రభుత్వాలు, చట్టాలు ఎన్ని వచ్చినా క్షేత్రస్థాయిలో ఇంకా ఇలాంటి అంటరానితనం, వివక్ష కొనసాగడం విషాదకరం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలతో పాటు సామాజిక స్పృహ కూడా అవసరం. దేవుడి గుడిలోనూ కులాల కుమ్ములాటలు పసిప్రాణాలను బలిగొనడం సమాజపు నైతిక పతనానికి సంకేతం. బాధితులకు తక్షణ న్యాయం అందించడంతో పాటు, ఇలాంటి అమానవీయ పోకడలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×