Team India Vs Pak: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ రసవత్తరంగా కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా అద్భుతంగా రాణించి 400కు పైగా పరుగులు చేసి దుమ్ము లేపింది. మొదటి ఇన్నింగ్స్ లో 113 ఓవర్లు ఆడిన టీమిండియా 471 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందులో యశస్వి జైస్వాల్, గిల్ అలాగే రిషబ్ పంత్ ముగ్గురు సెంచరీలు చేశారు. అయితే మొదటి ఇన్నింగ్స్ ముగించిన తర్వాత… బౌలింగ్లో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది.
Also Read: Virat – Genelia :పెళ్లి పిల్లలు ఉన్నా తెలుగు హీరోయిన్ తో కోహ్లీ రొమాన్స్.. ఏకంగా లిఫ్టులోనే!
తేలిపోయిన టీమిండియా బౌలర్లు
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో టీమ్ ఇండియా బౌలర్లు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. బూమ్రా ఒక్కడే మూడు వికెట్లు పడగొట్టి శభాష్ అనిపించాడు. మిగిలిన టీం ఇండియా బౌలర్లు పాకిస్తాన్ కంటే చెత్తగా బౌలింగ్ వేస్తున్నారు. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, రవీంద్ర జడేజా అలాగే షార్ధుల్ ఠాగూర్ ఇలా నలుగురు బౌలర్లు కూడా… తమ కోటలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.
మహమ్మద్ సిరాజ్ ఏకంగా 14 ఓవర్లు వేశాడు. 50 పరుగులు ఇచ్చాడు. కానీ ఒక్క వికెట్ కూడా ఆ పడగొట్ట లేకపోయాడు. అలాగే ప్రసిద్ధి కృష్ణ 10 ఓవర్లు వేసి 56 పరుగులు ఇచ్చి దారుణంగా ఆడడం జరిగింది. అటు రవీంద్ర జడేజా కూడా వికెట్లు తీస్తాడు అనుకుంటే పెద్దగా రాణించడం లేదు. శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అద్భుతంగా రానిస్తాడు. రంజీల్లో తన ప్రదర్శన చూసి ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇలాంటి నేపథ్యంలో… ఇండియా.. ఈ మ్యాచ్ లో ఓడిపోయే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు రెండు రోజుల మ్యాచ్ పూర్తయింది. ఇప్పటివరకు 49 ఓవర్లు వాడిన ఇంగ్లాండ్ జట్టు… కేవలం 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. చాలా వేగంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మూడవరోజు 600కు పైగా ఇంగ్లాండ్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆ తర్వాత టీమ్ ఇండియాను త్వరగా ఆల్ అవుట్ చేస్తే.. ఇంగ్లాండ్ అవలీలగా విజయం సాధించే ప్రమాదం కూడా ఉంటుంది.
అద్భుతంగా రాణిస్తున్న బూమ్రా
బూమ్ బూమ్ బూమ్రా… అంటే మామూలుగా ఉండదు. ఏ ఫార్మాట్ అయిన… టీమిండియా బౌలర్ బుమ్రా రెచ్చిపోతాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో 13 ఓవర్లు వేసిన బుమ్రా… రెండు మేడిన్లు చేసి 48 పరుగులు ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. కీలక వికెట్లు.. కోల్పోయింది ఇంగ్లాండు జట్టు. ఇందులో జాక్, బెన్ డకేట్, రూట్ కూడా ఉన్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 22, 2025