BigTV English
Advertisement

Hyderabad Road Accident: నిద్రమత్తులో డ్రైవింగ్.. టెంపుల్‌ను ఢీకొట్టిన ట్యాంకర్

Hyderabad Road Accident: నిద్రమత్తులో డ్రైవింగ్.. టెంపుల్‌ను ఢీకొట్టిన ట్యాంకర్

Hyderabad Road Accident: హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో.. మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిద్రమత్తులో వాహనం నడిపిన ట్యాంకర్ డ్రైవర్.. నియంత్రణ కోల్పోయి ఆంజనేయ స్వామి ఆలయం ప్రహరీ గోడను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. వారిని సమీపంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.


ప్రమాదం ఎలా జరిగింది?

స్థానికుల చెప్పిన వివరాల ప్రకారం.. ఉప్పల్ NGRI సమీపంలోని రోడ్డుపై ఒక సెప్టిక్ ట్యాంకర్ వెళ్తుండగా, డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో.. వాహనం నియంత్రణ కోల్పోయింది. ట్యాంకర్ రోడ్డుకు పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడను ఢీకొట్టింది.


ఇద్దరికి తీవ్ర గాయాలు

ఆ సమయంలో రోడ్డుపై నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ట్యాంకర్ కిందపడకుండా తప్పించుకున్నప్పటికీ, గోడ కూలిన ధాటికి తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే బయటికి లాగిన స్థానికులు 108 అంబులెన్స్‌కి సమాచారం అందించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, తీవ్రంగా గాయపడినట్టు తెలిపారు.

డ్రైవర్ నిర్లక్ష్యం

పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో డ్రైవర్ నిద్రమత్తులో వాహనం నడిపినట్టు తేల్చారు. వాహనం వేగం కూడా ఎక్కువగా ఉండటంతో నియంత్రణ కోల్పోయాడని చెబుతున్నారు.

ఆలయానికి నష్టం

ఆంజనేయ స్వామి ఆలయ ప్రహరీ గోడ పూర్తిగా ధ్వంసమైంది. ఆలయంలో ఉన్న విగ్రహాలకు, గర్భగుడికి ఎలాంటి నష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. అయితే ఆలయ కమిటీ సభ్యులు పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. అదృష్టవశాత్తూ గుడికి నష్టం జరగలేదు అని అన్నారు. త్వరలోనే గోడను పునర్నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పోలీసులు కేసు నమోదు

ఉప్పల్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి, ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రోడ్డు భద్రతపై ప్రశ్నలు

ఈ ఘటన మళ్లీ రోడ్డు భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. నిద్రమత్తులో వాహనం నడపడం, మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వంటి నిర్లక్ష్యాలు తరచూ ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి.

Also Read: తిరుమలలో ఘోర అపచారం

ఉప్పల్‌లో జరిగిన ఈ ప్రమాదం మరోసారి.. రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. డ్రైవర్లు కేవలం తమ ప్రాణాలకే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా బాధ్యత వహించాలి. నిద్రమత్తులో  వాహనం నడపడం ఎంతటి ప్రమాదకరమో ఈ ఘటన చూపించింది. అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం, డ్రైవర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారానే.. ఇలాంటి ఘటనలను నివారించవచ్చు.

Related News

Bengaluru Crime: అంబులెన్స్ బీభత్సం.. ముగ్గురు మృతి, వాహనాన్ని ఎత్తి పడేసిన స్థానికులు, వీడియో వైరల్

Vikarabad Murder Case: వద్దు డాడీ అన్నా వినలేదు.. నా కళ్ల ముందే నరికేశాడు.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాలిక వీడియో

Madhya Pradesh Crime: భర్త ప్రైవేటు పార్ట్స్‌పై దాడి, 28 రోజుల బేబీ గొంతు కోసింది, అసలే మేటరేంటి?

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

Vikarabad Crime: వేట కొడవలితో పీక కోసి భార్య-కూతుర్ని చంపిన భర్త, ఆపై ఆత్మహత్య, ఎక్కడ?

Hyderabad Crime: హుస్సేన్ సాగర్ లో గుర్తు తెలియని యువతి మృతదేహం కలకలం

Nizamabad Crime: నిజామాబాద్ జిల్లాలో ఘోరం.. నగ్నంగా మహిళను చంపి.. తల, చేయి తీసేసి..

Road Accident: స్కూటీని ఢీకొట్టిన లారీ.. డ్యాన్సర్ మృతి

Big Stories

×