BigTV English

Indian Railway Station: దేశంలో 1వ నెంబర్ ప్లాట్ ఫారమ్ లేని ఏకైక రైల్వే స్టేషన్.. ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా?

Indian Railway Station: దేశంలో 1వ నెంబర్ ప్లాట్ ఫారమ్ లేని ఏకైక రైల్వే స్టేషన్.. ఏ రాష్ట్రంలో ఉందో తెలుసా?

Indian Railways: దేశ వ్యాప్తంగా సుమారు 7,301 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటిలో అత్యంత పెద్ద రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అక్కడ 20కి పైగా ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. కొన్ని స్టేషన్లలో ఒకే ఒక్క ప్లాట్ ఫారమ్ కూడా ఉన్నది. సాధారణంగా మనం రైలు ఎక్కడానికి  రైల్వే స్టేషన్ కు వెళ్తాం. ముందుగా మనం ప్రయాణించాల్సిన రైలు ఏ ప్లాట్ ఫారమ్ నెంబర్ మీదికి వస్తుందో తెలుసుకుంటాం. అయితే, దేశంలోని ఒకే ఒక్క రైల్వే స్టేషన్ లో 1వ నెంబర్ ప్లాట్ ఫారమ్ లేదు. అక్కడ 2వ నెంబర్ నుంచి ప్లాట్ ఫారమ్ లు మొదలవుతాయి. వినడాకికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం.


1వ నెంబర్ ప్లాట్ ఫారమ్ లేని బరౌని రైల్వే స్టేషన్

దేశంలో 1వ నెంబర్ ప్లాట్ ఫారమ్ లేని ఏకైక రైల్వే స్టేషన్ బీహార్ లో ఉంది. బరౌని పట్టణంలో ఉన్న ఈ స్టేషన్ లో ప్లాట్ ఫారమ్ లు నెంబర్ 2 నుంచి ప్రారంభం అవుతాయి. బెగుసరాయ్ జిల్లాలో ఉన్న బరౌని జంక్షన్ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ ఫామ్ నంబర్ 1 లేని స్టేషన్ గా దేశంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో ఒకటి. తూర్పు మధ్య రైల్వేలో ప్రధాన స్టేషన్ గా కొనసాగుతున్నది.


బరౌని రైల్వే స్టేషన్ లో 9 ప్లాట్ ఫారమ్ లు

బరౌని రైల్వే స్టేషన్ లో మొత్తం 9 ప్లాట్‌ ఫారమ్‌లను కలిగి ఉంది. ఇక్కడ ప్లాట్ ఫారమ్ నెంబర్ 2 నుంచి ప్లాట్‌ ఫారమ్ నెంబర్ 9 వరకు రైళ్లు ఆగుతాయి. బరౌని జంక్షన్ రైల్వే స్టేషన్ ను బ్రిటిషర్లు 1883లో నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లో కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే ఆగేవి. అయితే, స్థానికులు ఆందోళన చేయడంతో కొత్త రైల్వే స్టేషన్ ను నిర్మించారు.  ఈ స్టేషన్ బరౌని జంక్షన్ నుంచి 2 కిలో మీటర్ల దూరంలో నిర్మించారు. ఒకే పేరుతో రెండు స్టేషన్లు ఒకదానికొకటి దగ్గరగా ఉన్నాయి.

ఒకే పేరుతో రెండు రైల్వే స్టేషన్లు

పాత బరౌని రైల్వే స్టేషన్ కు ఫ్లాట్ నెంబర్ 1 అలాగే ఉంచారు. కొత్త రైల్వే స్టేషన్ లో నిర్మించిన 8 ప్లాట్ ఫారమ్ లు ఏర్పాటు చేశారు. అయితే, పాత స్టేషన్ లో 1వ నెంబర్ ప్లాట్ ఫారమ్ కొనసాగిస్తూ.. ఇక్కడ 2వ నెంబర్ నుంచి కేటాయించారు. సో, బరౌని జంక్షన్ రైల్వే స్టేషన్ లో నంబర్ 2 నుంచి ఫ్లాట్ ఫారమ్ లు ప్రారంభం అవుతాయి.  ఇక బరౌని పేరుతో రెండు స్టేషన్లు కొద్ది దూరంలో ఉండటం వల్ల ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చాలా మంది ప్రయాణీకులు పొరపాటున తప్పు స్టేషన్‌ కు వెళ్తుంటారు. అదే సమయంలో ప్లాట్‌ ఫామ్ లా విషయంలోనూ కాస్త గందరగోళానికి గురవుతుంటారు.

Read Also: ఆ రాష్ట్రంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్, అక్కడికి వెళ్లాలంటే తల ప్రాణం తోకకు రావాల్సిందే!

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×