అనివార్య కారణాలతో కొంత మంది రైళ్లు మిస్ అవుతుంటారు. అవాంటి వారు రీఫండ్ ను క్లెయిమ్ చేసుకోవడానికి ఇండియన్ రైల్వే టికెట్ డిపాజిట్ రిసీప్ట్(TDR) అనే విధానాన్ని అమలు చేస్తుంది. జూన్ 2025 నుంచి ఈ రూల్స్ ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిబంధనల ప్రకారం.. మీరు రైలును మిస్ అయితే, TDR ఎలా ఫైల్ చేయాలలో ఇప్పుడు తెలుసుకుందాం..
TDRను ఎప్పుడు ఫైల్ చేయాలంటే?
⦿ రైలు మిస్ అయినప్పుడు: మీరు బోర్డింగ్ స్టేషన్ లో రైలు ఎక్కలేకపోతే లేదంటే ప్రయాణించకపోతే, రైలు షెడ్యూల్ చేసిన గంట లోగా TDR దాఖలు చేయవచ్చు.
⦿ 3 గంటలకు పైగా రైలు ఆలస్యం అయినప్పుడు: రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యం కావడం, మీరు రైలు ప్రయాణం చేయకూడదని భావిస్తే TDR ఫైల్ చేసుకోవచ్చు. పూర్తి రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
⦿ కనెక్టింగ్ రైలు మిస్ అయినప్పుడు: మీ ఫస్ట్ రైలు ఆలస్యం కావడం వల్ల మీ కనెక్టింగ్ రైలును మిస్ అయితే, మొదటి రైలు కనెక్టింగ్ స్టేషన్ కు చేరుకున్న మూడు గంటల్లోపు మీరు TDRను దాఖలు చేయవచ్చు. అయితే, రెండు టికెట్లు ఒకే PNRను కలిగి ఉండాలి. లేదంటే బుకింగ్ సమయంలో లింక్ చేయబడాలి.
TDRను దాఖలు చేయడం వల్ల రీఫండ్ కు గ్యారెంటీ ఉండదు. జోనల్ రైల్వేలు రీఫండ్ నిబంధనల ఆధారంగా ప్రతి కేసును సమీక్షిస్తాయి. అనంతరం రీఫండ్ ఇవ్వాలో, వద్దో నిర్ణయిస్తాయి.
TDRను ఎలా దాఖలు చేయాలంటే?
⦿ ఇ-టికెట్ తీసుకుంటే?
ఒకవేళ మీరు ఇ-టికెట్ కొనుగోలు చేస్తే.. ముందుగా రైల్వే అధికారిక వెబ్ సైట్ www.irctc.co.inని ఓపెన్ చేయాలి. లాగిన్ కావాలి. ముందుగా మౌ అకౌంట్ లోకి వెళ్లాలి. అనంతరం లావాదేవీలకు సంబంధించిన ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి. బుకింగ్ టికెట్ హిస్టరీకి వెళ్లి PNRను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత TDR ఫైల్ చేయాలి. ఎందుకు TDR ఫైల్ చేయాల్సి వస్తుందో కారణాలు చెప్పాలి. ఆ తర్వాత సబ్ మిట్ చేయాలి. ట్రాకింగ్ కోసం TDR రిఫరెన్స్ నంబర్ ను సేవ్ చేసుకోవాలి. రీఫండ్ అనేది 60 నుంచి 90 రోజుల లోపు యాడ్ అవుతాయి.
⦿ కౌంటర్ టికెట్ తీసుకుంటే?
ఒకవేళ మీరు కౌంటర్ లో టికెట్ తీసుకంటే బోర్డింగ్ స్టేషన్ లోని రైల్వే రిజర్వేషన్ కౌంటర్ కు వెళ్లాలి. రైలు బయల్దేరిన గంటలోకి వెళ్లాల్సి ఉంటుంది. మీ టికెట్ ను ఇచ్చి, TDR కోసం రిక్వెస్ట్ చేయాలి. మీకు రసీదు అందిస్తారు. టికెట్, TDR రసీదును గ్రూప్ జనరల్ మేనేజర్/IT, IRCTC, ఇంటర్నెట్ టికెటింగ్ సెంటర్, IRCA బిల్డింగ్, స్టేట్ ఎంట్రీ రోడ్, న్యూఢిల్లీ – 110055. పంపించాలి. రీఫండ్ ఆమోదించబడితే, సుమారు 90 రోజుల్లో రీఫండ్ పొందే అవకాశం ఉంటుంది.
తాజా TDR రీఫండ్ రూల్స్ ఏం చెప్తున్నాయంటే?
భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు రీఫండ్ విమానాలను అప్ డేట్ చేస్తుంటాయి. అందులో భాగంగానే జూన్ 2025న కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
⦿ కచ్చితమైన టైమ్: మిస్ అయిన రైళ్ల కోసం TDRను షెడ్యూల్ చేయబడి బయల్దేరిన గంటలోపు TDR ఫైల్ చేయాలి. మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, రైలు బయల్దేరే ముందు దాఖలు చేయాలి.
⦿ బయలుదేరిన తర్వాత నో రీఫండ్: ఒకవేల మీరు రైలు బయల్దేరిన తర్వాత మీరు TDR సమర్పిస్తే రీఫండ్ రావు.
⦿ కనెక్టింగ్ రైళ్లు: రీఫండ్ కావాలంటే లింక్డ్ PNR తప్పనిసరి. మొదటి రైలు వచ్చిన మూడు గంటలలోపు TDR ఫైల్ చేయండి.
సులభమైన TDR ఫైలింగ్ టిప్స్
⦿ త్వరగా నిర్ణయంతీసుకోండి: నిర్ణీత సమయంలోపు TDRను ఫైల్ చేయాలి.
⦿ రికార్డులను సేవ్ చేసుకోవాలి: రైలు ఆలస్యం, PNR వివరాలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సేవ్ చేసి ఉంచుకోవాలి.
⦿ ట్రాక్ చేయాలి: అప్ డేట్ గా ఉండటానికి IRCTC వెబ్ సైట్ లో మీ TDR స్టేటస్ ను చెక్ చేసుకోవాలి.
Read Also: హైదరాబాద్ లో ఉన్నారా? ఈ ప్లేస్ కు వెళ్లకపోతే వేస్టే.. ఎక్కడ ఉందంటే?