BigTV English

Namo bharat vs Vande Bharat: నమో భారత్ vs వందేభారత్.. ఈ రైళ్ల మధ్య తేడా ఏంటి?

Namo bharat vs Vande Bharat: నమో భారత్ vs వందేభారత్.. ఈ రైళ్ల మధ్య తేడా ఏంటి?

Indian Railways: భారతీయ రైల్వేలో అత్యాధునిక రైళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి నమో భారత్ రాపిడ్ రైలు, వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు. ఈ రైళ్లు దేశంలో విభిన్న సేవలు, విభిన్న ప్రయోజనాలతో ప్రయాణీకుల అవసరాలకు రూపొందించబడ్డాయి. ఇంతకీ ఈ రైళ్ల మధ్య తేడా ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


1.ఉద్దేశ్యం, మార్గం

⦿ నమో భారత్ రాపిడ్ రైల్: ఈ రైలు తక్కువ దూరం కలిగిన నగర ప్రయాణాల కోసం రూపొందించబడింది. సాధారణంగా 100 నుంచి 250 కిలో మీటర్ల పరిధిలోని ప్రధాన నగరాలను కలుపుతుంది. రోజువారీ ప్రయాణీకులు, విద్యార్థులు, ఉద్యోగులకు మెట్రో లాంటి సేవలను అందిస్తుంది. ఢిల్లీ-మీరట్, అహ్మదాబాద్-భుజ్ లాంటి ఇంటర్ సిటీ మార్గాల్లో వేగవంతమైన రవాణా వ్యవస్థను అందిస్తుంది. ఈ రైళ్లు రోజుకు 4 లేదంటే 5 ట్రిప్పులు వేస్తాయి.


⦿ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్: ఇవి మిడ్ రేంజ్ నుంచి సుదూర ప్రయాణాల కోసం రూపొందించబడ్డాయి 10 గంటల కంటే తక్కువ దూరంలో ఉన్న ప్రధాన నగరాలను కలుపుతుంది. ప్రీమియం, సెమీ హైస్పీడ్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. సంప్రదాయ ట్రాక్ ల మీద నడుస్తుంది. ఎక్కువ దూరాలను అంటే.. న్యూఢిల్లీ- వారణాసి, సబర్మతి- జోధ్ పూర్ లాంటి మార్గాల్లో నడుస్తుంది. సాధారణంగా రోజు ఒకటి లేదంటే రెండుసార్లు నడుస్తుంది.

2.వేగం

⦿నమో భారత్: దీని వేగం గంటకు 180 కిలో మీటర్లు RRTS ట్రాక్‌ లపై గంటలకు 160 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. సగటు వేగం గంటకు100 కిలో మీటర్లుగా ఉంటుంది. స్టాప్ లను బట్టి మారే అవకాశం ఉంటుంది.

⦿వందే భారత్: ఈ రైలు వేగం కూడా గంటకు 180 కిలో మీటర్లుగా ఉంటుంది. కానీ, సంప్రదాయ ట్రాక్ ల మీద గంటకు 130 నుంచి 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

3.కోచ్ కాన్ఫిగరేషన్, కెపాసిటీ

⦿ నమో భారత్: ఎక్కువ మంది ప్రయాణీకుల కోసం సీటింగ్, స్టాండింగ్ ఏర్పట్లతో కాన్ఫిగర్ చేయబడింది. 12-కోచ్ రైలుల  1,150 మందికి సీటింగ్,  2,058 మంది స్టాండింగ్ కు అవకాశం ఉంటుంది. ప్రయాణీకులకు మెరుగైన వసతి కల్పిస్తుంది. సాధారణంగా 12 నుంచి 16 కోచ్‌లను కలిగి ఉంటుంది.

⦿వందే భారత్: రూట్ ను బట్టి 16 నుంచి 20 కోచ్‌లను కలిగి ఉంటుంది.  ప్రీమియం సీటింగ్ ఓన్లీ ట్రావెల్ అవకాశం ఉంటుంది. AC చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లను అందిస్తుంది. ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

 4.సౌకర్యాలు, ఫీచర్లు

⦿నమో భారత్: ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు ఉంటాయి. ఇంటర్ కోచ్ కదలిక కోసం సీల్డ్ గ్యాంగ్‌వేలు, మాడ్యులర్ బయో-వాక్యూమ్ టాయిలెట్లు, పూర్తిగా ఎయిర్ కండిషన్డ్ వ్యవస్థ ఉంటుంది. ఆన్-బోర్డ్ Wi-Fi,  ఇన్ఫోటైన్‌ మెంట్ డిస్‌ప్లేలు, డైనమిక్ రూట్ మ్యాప్‌లు, ఓవర్‌ హెడ్ లగేజ్ రాక్‌లు, ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్‌లు ఉన్నాయి. భద్రతా లక్షణాల విషయానికి వస్తే KAVACH యాంటీ-కొలిషన్ సిస్టమ్, CCTV, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌లు, ETCS లెవల్ 3 హైబ్రిడ్ సిగ్నలింగ్ తో పాటు మెరుగైన భద్రత ఉంటుంది.

⦿వందే భారత్: GPS-ఆధారిత ప్రయాణీకుల సమాచార వ్యవస్థలు, బయో-వాక్యూమ్ టాయిలెట్లు, రిక్లైనింగ్ సీట్లు, ఛార్జింగ్ పాయింట్ల లాంటి ప్రీమియం సౌకర్యాలను అందిస్తుంది. నిరంతర LED లైటింగ్, పనోరమిక్ విండోలు, సౌకర్యవంతమైన సీటింగ్, పూర్తిగా ఎయిర్ కండీషన్ చేయబడి ఉంది. భద్రతా లక్షణాల విషయానికి వస్తే KAVACH యాంటీ-కొలిషన్ సిస్టమ్, CCTV, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్‌లు ఉన్నాయి. నమో భారత్‌ మాదిరిగానే అధునాతన ETCS లెవల్ 3 సిగ్నలింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తుంది.

5.డిజైన్, టెక్నాలజీ

⦿నమో భారత్: 66% పవర్‌ అవుట్‌తో ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU)గా నిర్మించబడింది. క్షణాల్లో వేగం అందుకోవడంతో పాటు, వేగం తగ్గిస్తుంది. గాలి ఒత్తడిని తగ్గించేందుకు ఏరోడైనమిక్ నోస్ కోన్ తో  స్టెయిన్‌ లెస్ స్టీల్ బాడీని కలిగి ఉంటుంది. ఇది తేలికగా, మరింత సమర్థవంతంగా చేస్తుంది.

⦿వందే భారత్: ఇది 50 శాతం పవర్ అవుట్ పుట్ తో కూడిన EMUగా తయారు చేయబడింది. ఏరోడైనమిక్ డిజైన్ ను కలిగి ఉంటుంది.

6.తయారీ ఖర్చు, టికెట్ ఛార్జీలు

⦿నమో భారత్: అధునాతన సాంకేతికత, మౌలిక సదుపాయాల కారణంగా తయారీ చాలా ఖరీదైనది.  వందే భారత్ కంటే కోచ్‌కు సుమారు 2.5 రెట్లు ఖరీదైనది. స్వల్ప దూరాలకు టికెట్ ధరలు తక్కువగానే ఉంటాయి. అహ్మదాబాద్-భుజ్‌ మధ్య దూరం 360 కిలో మీటర్లు కాగా టికెట్ ఛార్జీ రూ. 455.

⦿వందే భారత్: నమో భారత్‌ తో పోలిస్తే కోచ్‌ తయారీ ఖర్చు కాస్త తక్కువగా ఉంటుంది. కానీ, దాని లగ్జరీ పొజిషనింగ్ కారణంగా టికెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి.

Read Also: ట్రైన్ మిస్ చేశారా? వెంటనే TDR ఫైల్ చెయ్యండి.. కొత్త రూల్స్ ఇవే!

Related News

Tourist Footfall: ఎక్కువ మంది టూరిస్టులు వచ్చే ఇండియన్ స్టేట్ ఇదే, వామ్మో.. ఏడాదిలో అంత మందా?

Islands In India: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!

Dussehra 2025: దసరా పండుగ వచ్చేస్తోంది, వీలుంటే కచ్చితంగా ఈ ప్లేసెస్ కు వెళ్లండి!

Indian Railways Staff: 80 రూపాయల థాలీని రూ. 120కి అమ్ముతూ.. అడ్డంగా బుక్కైన రైల్వే సిబ్బంది!

Delhi Railway Station: ఏంటీ.. ఢిల్లీలో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇదా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!

Indian Railway: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్, పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం!

PR to Indians: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?

Local Train: సడెన్‌ గా ఆగిన లోకల్ రైలు.. దాని కింద ఏం ఉందా అని చూస్తే.. షాక్, అదెలా జరిగింది?

Big Stories

×