Viral Video: దేనికైనా హద్దు ఉంటుంది. అది శృతి మించితే దాని పరిణామాలు దారుణంగా ఉంటాయి. పైన కనిపిస్తున్న ఆ యువతి విషయంలో అదే జరిగింది. పోలీసులు ఉన్నా ఏ మాత్రం క్షమించలేదు. వెంటాడి మరీ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
లొకేషన్.. దేశ రాజధానికి ఢిల్లీకి దగ్గరలో ఉండే ప్రాంతం నొయిడా. యువతి పేరు మనీషా. మంచి డ్యాన్సర్ కూడా. అంతకుమించి చెప్పాలంటే సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఏదో విధంగా యువతను తనవైపు తిప్పుకునేందుకు నానాతంటాలు పడుతోంది. సెలబ్రిటీ అయిపోవాలని భావించింది. అందుకు సంబందించి స్కెచ్ వేసింది. ప్లాన్ రివర్స్ కావడంతో ఆమెని వెంటాడి మరీ కొడుతున్నారు.
కోరిక దుఃఖానికి మూలం అని ఆలస్యంగా తెలుసుకుంది డ్యాన్సర్ మనీషా. మత్తిక్కించే డ్యాన్సులతో యూత్‌ని కవ్వించేది. బావలు సయ్యా అంటూ తనదైనశైలిలో డ్యాన్సులు చేసేది. ఆ విధంగా సోషల్ మీడియాలో యువతని విపరీతంగా ఆకట్టుకుంది. తనకంటూ ఫ్యాన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది. ఏదైనా కొత్తగా ట్రై చేయాలని ఆలోచన చేసింది.
అందుకు నొయిడాలోని ఓ పార్క్‌ని వేదికగా ఎంచుకుంది. తనదైన శైలిలో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. వాటిని ఆమె సహాయకులు చిత్రీకరిస్తున్నారు. వెంటనే అక్కడి స్థానికులు ఓ రేంజ్‌లో రియాక్ట్ అయ్యారు. మనీషా, ఆమె సహచరుడు ఖుషీకి ఊహించని రీతిలో ట్రీట్‌మెంట్ ఇచ్చారు.
ALSO READ: గ్యాస్ సిలిండర్ లీక్.. వారంతా పరుగో పరుగు
పరిస్థితి తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు పోలీసుల సాయంతో మనీషా, ఆమె సహాయకులు బయటపడ్డారు. ఆమెపై ఆగ్రహంతో రగిలిపోయిన కొందరు యువకులు వారిని చుట్టుముట్టి ఆ తర్వాత వెంబడించి కొట్టడం ఆ వీడియోలో కనిపించింది.
మనీషా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చింది. తాను ఎవరితో అసభ్యకరంగా ప్రవర్తించలేదు.. ఏ తప్పు చేయలేదు, అందరూ కలిసి తనను, ఖుషీని కొట్టారని రాసుకొచ్చింది. ఆ యువతికి కొందరు మహిళలు మద్దతుగా నిలిచారు.
మనీషా వ్యవహారంపై సోషల్‌మీడియాలో చాలామంది మండిపడుతున్నారు. నృత్యకారులు జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయంలో ప్రజలు మేల్కొవాలి.. అధికారులు మాత్రం నిద్రపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు ఇప్పటివరకు రియాక్ట్ కాలేదు.
Manisha Dancer who is notorious for making obscene videos in public places were chased by public in a park of Noida while she was allegedly shooting a video. Any act of violence must be condemned but then for how long people will tolerate all these nuisance? pic.twitter.com/Qawoeznz95
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) June 22, 2025