Bike Theft: స్వేచ్ఛ బ్యూరో: పలు జిల్లాలలో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను వలిగొండ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి విలువైన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ డిఎస్పి పి. మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు హైదరాబాద్ బాలాజీ నగర్ బొల్లారం ప్రాంతానికి చెందిన రాపెన్ మణికుమార్ (26) , మరో ఇద్దరు అతని స్నేహితులు (బాలు నేరస్తులు) ఒక ముఠాగా ఏర్పడి రాత్రివేళల్లో ఇంటి ఆవరణలో పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను కటర్లు ఉపయోగించి హ్యాండిల్ లాకులను విరగొట్టి, ఇగ్నీషియన్ వైర్లను కట్ చేసి ద్విచక్ర వాహనాలను దొంగిలించేవారని తెలిపారు.
అనంతరం దొంగిలించిన వాహనాలను హైదరాబాద్ బోయన్ పల్లిలోని నిర్మానుష్య ప్రదేశంలో దాచిపెట్టి అనంతరం వాటిని స్క్రాప్ దుకాణాలలో విక్రయించి వచ్చిన సొత్తును పంచుకునేవారని తెలిపారు. ఈనెల 11న వలిగొండ మండల కేంద్రంలో అర్ధరాత్రి యమహా ఆర్ వన్ ఫైవ్ బైక్‌ను దొంగిలిచ్చినట్లు ఫిర్యాదు రావడంతో వలిగొండ ఎస్సై యుగంధర్ గౌడ్ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారు. ఈనెల 15న వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు ఈ ముగ్గురు నిందితులు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పై సరైన ధ్రువపత్రాలు లేకుండా ప్రయాణిస్తున్నడంతో వారిని ఆపి ప్రశ్నించిన పోలీసులకు పొంతనలేని సమాధానం చెప్పడంతో వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించడంతో పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
Also read: సోషల్ మీడియాను చుట్టేస్తోంది.. కాక్రోచ్ జనతా పార్టీ, కేవలం మూడు రోజుల్లో లక్ష మంది, సెగ ఎవరికి?
నిందితుల వద్ద నుండి 12 వాహనాలను, కటర్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు రాఫెన్ మణికుమార్ ను అరెస్ట్ చేసి రామన్నపేట కోర్టులో హాజరుపరచగా నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరు బాల నేరస్తులు పరారీలో ఉన్నట్లు వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో కూడా వాహన చోరీ కేసుల్లో కూడా ఈ నిందితుల ప్రమేయం పై మరింత క్లుప్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారం రోజుల్లోనే కేసును చేదించి ఇతర జిల్లాల్లో కూడా చోరీలకు పాల్పడ్డ నిందితులను పట్టుకోవడంలో సఫలమైన వలిగొండ ఎస్సై యుగేందర్ గౌడ్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ నిరంజన్, అనిల్‌ను డిఎస్పి మధుసూదన్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు అభినందించారు.
Also read: వచ్చే నెలలో బంజారా జోడో ఏక్తా భారత్ యాత్ర: రవింద్ర నాయక్!