E-Paper
Advertisement

ఆసుపత్రి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్.. ఇక మాటల్లేవ్..

ఆసుపత్రి వార్తలపై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్.. ఇక మాటల్లేవ్..
Advertisement

Amitabh Post: బాలీవుడ్ బడా స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న ఆసుపత్రి వార్తల మధ్య ఆయన చేసిన ఒక క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల ముంబైలోని ఓ ఆసుపత్రికి అమితాబ్ వెళ్లినట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. అయితే అదే సమయంలో ఆయన సోషల్ మీడియాలో పెట్టిన సందేశం అందరి దృష్టిని ఆకర్షించింది.

Read also-పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రికార్డును బ్రేక్ చేసిన రామ్ చరణ్ పెద్ది..

Advertisement

అమితాబ్ తన బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చారు. “చీల్ జబ్ హోవే శాంత్ తో భయ్యా, తోతే బోలన్ సురు కరేన్.” దీనికి అర్థం “గద్ద నిశ్శబ్దంగా ఉంటే చిలుకలు మాట్లాడటం మొదలుపెడతాయి.” ఈ వ్యాఖ్య ద్వారా తనపై వస్తున్న గాసిప్స్‌, ఊహాగానాలకు పరోక్షంగా సమాధానం ఇచ్చారని నెటిజన్లు భావిస్తున్నారు. ఆసుపత్రి వార్తల నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, కుటుంబానికి దగ్గరగా ఉన్న వర్గాలు మాత్రం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం మాత్రమే ఆయన ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది.

Read also-Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడిగంటలు’ లో బ్రహ్మముడి కళ్యాణ్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్?

Advertisement

సోషల్ మీడియాలో అమితాబ్ చేసిన ఈ పోస్ట్‌పై అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కొందరు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటే, మరికొందరు “బిగ్ బీ ఎప్పటిలాగే స్ట్రాంగ్‌గా ఉన్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చేసే ప్రతి చిన్న పోస్ట్ కూడా ఎంతటి చర్చకు దారితీస్తుందో స్పష్టమైంది. అయితే ఇలాంటి వార్తలపై సోషల్ మీడియా ప్రభావం ఏంటో తెలుస్తోంది. అందులో ఉన్నది లేనట్లుగా లేదుని ఉన్నట్లుగా చెప్పడంపై బిగ్ బీ ఫైర్ అవుతన్నారు. సాధారణంగా ఆసుపత్రికి వెళ్లినా సోషల్ మీడియాలో ఇలా చేయడం సరికాదన్నారు.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×