E-Paper
Advertisement

Youtuber Car Accident: ఘోర ప్రమాదం.. ఎగ్జిబిషన్‌లో జనాలపైకి దూసుకెళ్లిన కారు!

Youtuber Car Accident: ఘోర ప్రమాదం.. ఎగ్జిబిషన్‌లో జనాలపైకి దూసుకెళ్లిన కారు!
Advertisement

Youtuber Car Accident: విజయవాడ నగరంలోని భవానిపురం ప్రాంతంలో ఉన్న బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి పెను ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా గడపడానికి వచ్చిన సందర్శకులపైకి ఓ కారు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా బీభత్సం నెలకొంది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.

ఎగ్జిబిషన్ కావడంతో గ్రౌండ్స్ వద్ద ప్రజలు రద్దీ ఎక్కువగా ఉంది. ఆ సమయంలో అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసెకెళ్లింది. కారు వేగానికి కొందరు గాలిలో ఎగిరి పడగా.. మరికొందరు వాహనం కింద పడి నలిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనలకు గురై అటు ఇటు పరుగులు తీశారు.

Advertisement

కారు నడుపుతున్న వ్యక్తి విపరీతంగా మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం మత్తులో వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా విర్దారించారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా.. ఆ కారు ప్రముఖ యూట్యూబర్‌కు చెందినదిగా గుర్తించారు.

ALSO READ: పందెం రాయుళ్లపై పోలీసుల ఉక్కుపాదం.. నున్నలో కోడి పందాల బరులు ధ్వంసం!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×