BigTV English

Seethaka Speech: తెలంగాణ తల్లికి నీ చెల్లి రూపం ఇచ్చినప్పుడు ఏమైంది? సీతక్క వైల్డ్ ఫైర్ స్పీచ్

Seethaka Speech: తెలంగాణ తల్లికి నీ చెల్లి రూపం ఇచ్చినప్పుడు ఏమైంది? సీతక్క వైల్డ్ ఫైర్ స్పీచ్

Seethaka Speech: కేటీఆర్ మీ చెల్లి రూపం తెలంగాణ తల్లికి ఇచ్చావు. అదే రూపం తెలంగాణ ప్రజలపై రుద్దాలని చూశావు. నేడు తెలంగాణ సమాజం గర్వించే స్థాయిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేక కుల్లు రాజకీయాలకు తెర తీస్తున్నావు. ప్రజలన్నీ గమనిస్తున్నారు తెలుసుకో అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహంపై అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు మంత్రి సీతక్క కీలక కామెంట్స్ చేశారు. సీతక్క చేసిన కామెంట్స్ తో అసెంబ్లీ సైలెంట్ కావడం విశేషం. అంతలా అసెంబ్లీ సైలెంట్ అయ్యేలా మంత్రి సీతక్క చేసిన కామెంట్స్ ఏమిటో చూద్దాం.


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొలిరోజు ప్రారంభం కాగానే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్ష అంటూనే, 60 సంవత్సరాల పోరాటాన్ని గుర్తు పెట్టుకొని తల్లి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని నాడు ప్రకటించారన్నారు. ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సోనియా గాంధీకి మంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తమ సొంత రాజకీయ అజెండాతో వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు.

తెలంగాణ ప్రజల ఆస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, శ్రమైక జీవన రూపం, తల్లి ఆశీర్వాదం అన్ని కలగలిపిన నిండైన రూపం తెలంగాణ తల్లి రూపమన్నారు. అటువంటి తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడంపై యావత్ తెలంగాణ గర్విస్తుందన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో పార్టీ జెండాలకు రూపం, రంగులు ఇచ్చుకున్నారే కానీ తెలంగాణ తల్లికి అధికారికంగా రూపం ప్రకటించలేదన్నారు. అది కూడా కేటీఆర్ తన చెల్లి రూపాన్ని విగ్రహ రూపమిచ్చి, తెలంగాణ తల్లి విగ్రహమని నాడు విస్తృత ప్రచారం చేశారని మంత్రి తెలిపారు.


ఇలా మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలో బీజేపీకి చెందిన పలువురు సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయడంపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తనను అకారణంగా జైల్లో పెట్టారని, ఏ పార్టీలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేశానంటూ మంత్రి సీరియస్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటును అపహస్యం చేసిన బీజేపీ తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సీతక్క సీరియస్ కావడంతో అసెంబ్లీ సైలెంట్ గా మారింది.

Also Read: BRS Party politics on assembly sessions: అసెంబ్లీకి ‘డుమ్మా’ కొట్టడం ఎలా? పుస్తకం రాయోచ్చుగా మాస్టారు, మొత్తానికి గెంటించుకున్నారుగా!

కాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంపై రెండు రోజులుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇష్టారీతిన ట్రోలింగ్ చేయడంతో మంత్రి సీతక్క ఫైర్ అయ్యారని చెప్పవచ్చు. రాజకీయాలు చేయాలి కానీ, ఇలా కాదు అదెప్పుడు తెలుసుకుంటారో అంటూ మంత్రి సీతక్క అన్నారు. మొత్తం మీద సీతక్క కామెంట్స్ తో అసెంబ్లీ హోరెత్తింది.

Related News

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Big Stories

×