BigTV English

Viral Video : విమానంలో 11A సీటు కోసం గొడవ.. వీడియోలో రచ్చ రచ్చా..

Viral Video : విమానంలో 11A సీటు కోసం గొడవ.. వీడియోలో రచ్చ రచ్చా..

Viral Video : అది అద్భుతం. అంతకుమించి అదృష్టం. మాటల్లేవ్. లాజిక్కుల్లేవ్. అలా జరిగింది అంతే. అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం కుప్పకూలి వందలాది మంది చనిపోయిన ఘటనలో ఒకే ఒక్కడు బతికాడు. పెద్దగా దెబ్బలు కూడా తగల్లేదు. ప్రమాదం నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అది ఎలా సాధ్యమైంది? ఫ్లైట్‌లో ఉన్న వారంతా చనిపోతే ఆ ఒక్కడే ఎలా బతికి బయటకు రాగలిగాడు? అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. అదంతా అతని అదృష్టం, అతనికి అలా రాసుందని చాలా మంది అంటున్నారు. ఆ యువకుడు కూర్చున్న 11A సీటే అతన్ని కాపాడిందని కూడా చెబుతున్నారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచీ విమానంలో 11A సీటుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో 11ఏ సీటు కావాలని అడుగుతున్నారట. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌కు సమీపంలోనే ఉంటుంది ఆ సీట్. అయితే, ప్లేస్‌లో కూర్చుంటే బయటి వ్యూ సరిగ్గా కనిపించదు. పక్కనే విమానం రెక్కలు అడ్డుగా ఉంటాయి. అందుకే ఇన్నేళ్లు ఆ సీట్‌ను అందరూ వద్దని రిజెక్ట్ చేసేవారు. అలాంటిది అహ్మదాబాద్ విమాన ప్రయాణం తర్వాత అదే నెంబర్ కావాలంటూ పట్టుబట్టే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. అది లక్కీ సీటు అనుకుంటున్నారు.. ఒకవేళ మళ్లీ ఫ్లైట్ క్రాష్ అయితే ఈసారి కూడా ఆ సీటు తమను రక్షిస్తుందని నమ్ముతున్నారు. అయితే….


11A సీటు కోసం గొడవ..

లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. 11A సీటు కోసం విమానంలో ముగ్గురు ప్యాసింజర్లు గొడవపడే సీన్ అది. బహుషా ముంబై విమానాశ్రయం కాబోలు. ప్రయాణీకులు మరాఠీలో తిట్టుకుంటున్నారు. ఓ మహిళ.. తన వెనుక సీటులో కూర్చున్న ఇద్దరు వృద్ధులతో గొడవ పడుతోంది. వాళ్లు పరస్పరం తిట్టుకుంటున్నారు. ఫుల్ ఫైర్ మీదున్నారు. ఆ మహిళ అయితే చేయి చూపిస్తూ.. మీదకు వస్తూ.. పెద్ద పెద్దగా అరుస్తోంది. ఆ ఓల్డ్ ఏజ్ ప్యాసింజర్లు సైతం ఆమెకు గట్టిగానే బదులు చెబుతున్నారు. ఎయిర్ హోస్టెస్‌లు నచ్చజెబుతున్నా ఆ మహిళ వినట్లే, ఆగట్లే.


అరుస్తూ.. కొడుతూ..

గొడవ మధ్యలో ఆ మహిళ పక్కనే కూర్చున్న ఆమె కుమారుడు తల్లిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అతడు మమ్మీ అని పిలిచినప్పుడల్లా ఆ తల్లి ధబేల్ ధబేల్ మని కొడుకును బాదేస్తోంది. అతను మమ్మీ మమ్మీ అంటున్నాడు.. ఈమె టపీటపీ మని కొడుతోంది. గొడవ పడే ఆ వృద్ధు ప్రయాణీకులను కొట్టలేక.. ఆ కోపంతో కొడుకును బాదేస్తోంది. 11ఏ సీటు కోసం గొడవ అంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతోంది. ఆ వీడియో అప్‌లోడ్ చేసిన గంటల గ్యాప్‌లోనే 8 లక్షల మందికి పైగా చూసేశారు.

Also Read : ఓయో రూమ్‌లో భార్య బాగోతం.. భర్తను చూసి బిల్డింగ్ పైనుంచి దూకేసి.. వీడియో వైరల్

నిజంగా ఆ సీటు కోసమేనా?

అయితే, ఆ వీడియోలో ఎక్కడా 11A సీటు కోసం గొడవ పడుతున్నట్టు అనిపించట్లేదు. ప్యాసింజర్ల మధ్య ఏ లగేజ్ ప్రాబ్లమో, సీటు సమస్యతోనో అలా తిట్టుకుంటున్నట్టు ఉంది. కానీ, ఇప్పుడంతా 11ఏ ట్రెండింగ్ నడుస్తోంది కాబట్టి.. ఆ వీడియో అప్‌లోడర్ కావాలనే 11A సీటు కోసం ఫైట్ అంటూ హెడ్డింగ్ పెట్టి వదిలాడు. నిజమే కావొచ్చు అని నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు ఆ వీడియోను. అసలు గొడవ ఎందుకు జరిగిందో సరైన కారణం తెలీదు కానీ.. ఫైటింగ్ మాత్రం ఓ రేంజ్‌లో సాగింది. ఆ మహిళ ఎక్కడా తగ్గట్లే. ముసలి వారు అని కూడా చూడట్లే. మాటలతో విరుచుకుపడుతోంది. కొట్టటానికి సీటు మీదకొచ్చింది. ఆ వృద్ధులు సైతం గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. మధ్యలో కొడుకు ఎంట్రీ.. తల్లి చితక్కొట్టడం.. ఫుల్ కామెడీగా ఉంది. అంతటి సీరియస్ ఫైట్‌లోనూ పిచ్చ కామెడీ కనిపిస్తోంది. ఆ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు. డౌంట్ ఉంటే ఓ లుక్కేయండి….

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×