Thriller Movie in OTT : ఈమధ్య ఓటీటీలో బోలెడు థ్రిల్లర్ మూవీస్ వచ్చేస్తున్నాయి. ఈ మధ్య విడుదల అవుతున్న సినిమాలు ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పోలిస్తే ఓటీటీలోకి వచ్చే సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా ఓ మలయాళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. థ్రిల్లర్ కథతో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. అది రిలీజ్ అయిన నిమిషాల్లోనే మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.. ఆ మూవీ పేరు కొల్లా.. మలయాళ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. ఈ మూవీ స్టోరీ, ఓటీటీ ప్లాట్ ఫామ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టోరీ విషయానికొస్తే..
ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసిన రెండేళ్ల తర్వాత ఓటీటీ లోకి రాబోతుంది. తాజాగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసింది. అందులో ఇద్దరు అమ్మాయిలు ఓ ఊరికి వస్తారు. అక్కడ ఓ బ్యూటీ పార్లర్ తెరవడానికి ప్లాన్ చేస్తారు. మాటతీరు, అందంతో అక్కడి వాళ్లను త్వరగానే ఆకర్షిస్తారు. అయితే దీని వెనుక వాళ్లది పెద్ద ప్లానే ఉంటుంది. పక్కనే ఉండే బ్యాంకును దోచుకోవడమే ఆ ప్లాన్. ఈ మూవీ ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగింది. ఆ ఇద్దరు అమ్మాయిల బ్యాంక్ దోపిడీ తర్వాత పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయట పడతాయి.. వాళ్లు ఆ దోపిడీ ఎందుకు చేస్తారు? పోలీసులకు ఎలా చిక్కుతారు? వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తారు? వాళ్ల భవిష్యత్తు ఏం కానుంది అన్నదే ఈ కొల్లా మూవీ స్టోరీ. ఈ సినిమాను సూరజ్ వర్మ డైెరెక్ట్ చేశాడు.. ఈ మూవీ థియేటర్లలో రెండు గంటల నిడివి మాత్రమే ఉంది.. అక్కడ మంచి రెస్పాన్స్ ను అయితే అందుకోలేదు.. ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..
Also Read : గొప్ప మనసు చాటుకున్న యాంకర్ స్రవంతి.. నెటిజన్స్ ఫిదా..!
ఈటీవీ విన్ లో ( Etv Win)..
ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ భారీ ధరకు సొంతం చేసుకుంది. అనీ,శిల్పా అనే ఇద్దరు అమ్మాయిల చుట్టూనే తిరుగుతుంది. తెలుగులో కొల్లా మూవీని జూన్ 19 నుంచి ఈటీవీ విన్ లో చూడండి అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం తెలిపింది. అయితే ట్రైలర్లో మాత్రం పొరపాటున జులై 19 నుంచి అంటూ ఇచ్చారు. ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియోతో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.. అమ్మాయిల దోపిడీ చుట్టు తిరిగే ఈ స్టోరీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. నిజానికి ఇటీవల ఓటీటీలోకి బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. హారర్ సినిమాలు ఎక్కువగా స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. జూలై నెలలో బోలెడు కొత్త సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.