E-Paper
Advertisement

Vizag: కనికరం లేని కన్నతల్లి.. రైల్వే స్టేషన్‌లో నెలల పసికందును వదిలేసి..?

Vizag: కనికరం లేని కన్నతల్లి.. రైల్వే స్టేషన్‌లో నెలల పసికందును వదిలేసి..?
Advertisement

విశాఖ నగరాన్ని వరుస విషాద ఘటనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోందనడానికి నిదర్శనంగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్‌లో ఓ తల్లి తన నెలల పసికందును అనాథగా వదిలి వెళ్లిపోయింది. కన్నప్రేమను మరిచి, పాలిచ్చే తల్లి పసిబిడ్డను రోడ్డున పడేసిన తీరు స్థానికులను కలచివేసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంగళవారం ఉదయం విశాఖ రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఆటో స్టాండ్‌లో ఎప్పటిలాగే ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో ఒక ఆటో డ్రైవర్ తన వాహనంలో నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అప్రమత్తమయ్యాడు. వెనుక సీట్లో చూడగా, గుడ్డలలో చుట్టి ఉన్న ఒక పసికందు కనిపించింది. ఆ పసిబిడ్డ తల్లి కోసం చుట్టుపక్కల వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎవరో గుర్తుతెలియని మహిళ ఆ పసికందును అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందని గుర్తించిన ఆటో డ్రైవర్లు వెంటనే స్పందించారు.

Advertisement

ఆటో డ్రైవర్ల మానవత్వం.. 

లోకం తెలియని ఆ పసిపాపను చూసి చలించిపోయిన ఆటో డ్రైవర్లు, వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. బిడ్డను సురక్షితంగా పోలీసులకు అప్పగించి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీసులు పసికందును రక్షించి, ప్రాథమిక వైద్య పరీక్షల కోసం తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆ పసికందును వదిలి వెళ్ళిన మహిళ ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Advertisement

వరుస ఘటనలతో నగరవాసుల ఆందోళన..

విశాఖలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలే కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అప్పుడే పుట్టిన పసిబిడ్డను కండఖండాలుగా నరికి డ్రైనేజీలో పడేసిన కిరాతక ఘటన మరువక ముందే, ఇప్పుడు రైల్వే స్టేషన్ ఘటన వెలుగు చూడటం నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ‘కన్నతల్లి కసాయిగా మారితే ఇక పసిబిడ్డలకు రక్షణ ఎక్కడ?’ అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక విలువలు పడిపోవడం, కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలు ఆగకపోవడం పట్ల మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ పసికందును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ఆ మహిళను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ALSO READ: Khairatabad Dog Attack: వీధి కుక్కల వేట.. చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలు.. ఖైరతాబాద్‌లో కలకలం

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×