Vizianagaram Terror Case: విజయనగరం ఉగ్ర పేలుళ్ల కేసులో NIA విచారణ వేగవంతం చేసింది. ఇవాళ మరోసారి విజయనగరం టూ టైన్ పోలీస్ స్టేషన్‌కు NIA అధికారులు వెళ్లనున్నారు. ఇప్పటికే ఈ కేసును NIAకు అప్పగించాలంది కేంద్ర హోమ్ శాఖ. రెండు రోజుల్లో NIA చేతికి సిరాజ్, సమీర్‌ల కేసు వెళ్లనుంది. నిందితుల కుటుంబానికి సంబంధించిన మరింత సమాచారంపై పోలీసులు కూపీ లాగుతున్నారు.
పోలీసులు సేకరించిన సమాచారంపై NIA ఆరా తీస్తుంది. నిందితుల బ్యాంక్ లావాదేవీలు, వారి సన్నిహితుల సమాచారంను కూడా NIA అధికారులకు ఇవ్వనున్నారు. నిందితులు సిరాజ్, సమీర్‌లు ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సిరాజ్ కుటుంబ సభ్యులు జైల్లో ములాఖత్ అయ్యారు. దీంతో కొత్తగా తెరపైకి అజీజ్, సూఫియర్ పేర్లు వస్తున్నాయి. సిరాజ్ సన్నిహితుల వద్ద కూడా ప్రస్తావన వస్తుంది.
కన్ఫెషన్ లెటర్‌లో చెప్పిన అంశాలతో పాటు మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. NIA విచారణలో సిరాజ్ తనను ఉగ్రవాద భావజలం వైపు మళ్లించింది రిటైర్డ్ రెవెన్యూ అధికారి అని చెప్పగా, ఇప్పడు మరికొన్ని పేర్లను సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం. సిరాజ్ ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నాడా అనే కోణంలో NIA దర్యాప్తు చేస్తోంది. విజయనగరం మెజిస్ట్రేట్ ముందు కేసు తీవ్రతను వివరించి సిరాజ్, సమీర్ లను కస్టడీకి తీసుకోనున్నారు.
Also Read: అల్లూరి జిల్లాలో విషాదం.. తల్లి, కుమార్తె పెట్రోల్ పోసుకొని మృతి
సిరాజ్ అన్న, తండ్రిలపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇంతవరకు కేవలం వారిద్దరి బ్యాంక్ అకౌంట్లపై మాత్రమే ఆరా తీసిన ఎన్‌ఐఏ… త్వరలో విజయనగరం పోలీసులు ఇచ్చే సమాచారం ప్రకారం విచారణ చేయనుంది.