Balaji Srinivasan: ఇండియాలోని చాలామంది ప్రముఖులు ఈ మధ్యకాలంలో ఐలాండ్లను కొనుగోలు చేస్తున్నారు. ఆ జాబితాలోకి ఎన్నారై టెక్ బిజినెస్‌మేన్ కూడా చేరిపోయారు. ఆయన ప్రారంభించిన నెట్‌వర్క్ స్టేట్ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అన్నట్లు ఆ దీవి ఎక్కడ కొనుగోలు చేశారు? ఇంతకీ అసలు స్టోరీలోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
భారత సంతతి అమెరికన్ బిజినెస్‌మేన్, ఇన్వెస్టర్ బాలాజీ శ్రీనివాసన్. ప్రస్తుతం ఆయన Coin baseలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పని చేశారు. తర్వాత Counsyl Earn.com, Teleport, Coin Centre వంటి స్టార్టప్‌లను ఫ్రెండ్స్‌తో కలిసి ప్రారంభించాడు. Ethereum, OpenSea, Alchemy టెక్, క్రిప్టో ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారాయన.
సింగపూర్ సమీపంలో ఓ ఐలాండ్‌ని కొనుగోలు చేశాడు. బిట్‌కాయిన్ ద్వారా తాము సింగపూర్ సమీపంలో ఒక ద్వీపాన్ని కొనుగోలు చేసినట్టు ఆయన స్వయంగా తెలిపారు. గతేడాది సెప్టెంబరులో నెట్‌వర్క్ స్కూల్ ప్రారంభివంచారు. అందులో ప్రోగ్రామ్ కోసం 8 దేశాల నుండి 4 వేలకు పైగానే దరఖాస్తులు వచ్చాయి. కేవలం 128 మందికి అవకాశం కల్పించారు.
మూడు నెలల రెసిడెన్షియల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాడు. స్టార్టప్ స్థాపకులు, టెక్ ఇన్నోవేటర్లు, ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం రూపొందించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- AI, బ్లాక్‌చైన్, స్టార్టప్‌ల వర్క్‌షాప్‌లను నిర్వహిస్తోంది. ఇందులో జిమ్ సెషన్‌లు సైతం ఉంటాయి.
ALSO READ: యూట్యూబ్ కొత్త పాలసీ. ఇక అలాంటి కంటెంట్ పెడితే మానిటైజేషన్ రద్దు
రిమోట్ వర్కర్లు, డిజిటల్ నోమాడ్‌లు, కంటెంట్ క్రియేటర్లు, టెక్నాలజిస్ట్‌లు కలిసి సాంకేతికతను నేర్చుకోవడం క్రిప్టోలో సంపాదన, ఫిట్‌నెస్‌ను పెంపొందించడం లక్ష్యంగా పెట్టారు. ఈ నెట్‌వర్క్ స్కూల్‌ని విన్-అండ్-హెల్ప్-విన్ పేరిట కమ్యూనిటీని ప్రోత్సహిస్తుంది. సత్యం, ఆరోగ్యం, సంపద వాటిపై ఆధారపడుతుంది.
ఈ ప్రాజెక్ట్ Ethereum సహ-స్థాపకుడు విటాలిక్ బుటెరిన్, వెంచర్ క్యాపిటలిస్ట్ మార్క్ ఆండ్రీసెన్ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇంతకీ బాలాజీ శ్రీనివాసన్ లక్ష్యమేంటి అన్నదే అసలు పాయింట్. హౌ టు స్టార్ట్ ల న్యూ కంట్రీ- How to Start a New Country అనే పుస్తకం కీలక విషయాలు వెల్లడించారు. ఇది డిజిటల్-ఫస్ట్, డిసెంట్రలైజ్డ్ సమాజమని పేర్కొన్నారు.
ఆన్‌లైన్ కమ్యూనిటీగా ప్రారంభమై చివరకు భౌతిక భూమిని సంపాదించిందన్నారు. మిగతా దేశాల నుండి దౌత్యపరమైన గుర్తింపు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సాంకేతికత, క్రిప్టో కరెన్సీ, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆవిష్కరణల చుట్టూ ఏర్పడిన ఈ సమాజం, భాగస్వామ్య విలువలపై ఆధారపడుతుందని పేర్కొన్నారు.
రూమ్‌మేట్స్‌కు నెలకు $ 1000 లేదా $ 2000 మాత్రమే అద్దె. సందర్శకుల కోసం మా వద్ద చాలా డే పాస్‌లు ఉన్నాయిని సోషల్ మీడియాలో తెలిపారు. ప్రస్తుతం దుబాయ్, టోక్యో, మయామిలకు క్యాంపస్‌లను ప్లాన్ చేస్తున్నారు. తమిళనాడులో జన్మించిన ఆయన తల్లిదండ్రులు, వైద్య వృత్తి రీత్యా భారత్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమెరికాలో పుట్టి పెరిగిన బాలాజీ, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బీఎస్, ఎస్, చివరకు పీహెచ్‌డీ కూడా చేశారాయన. తన ఆలోచనలను పెట్టుబడిగా మార్చుకున్నారు.