వాస్తు శాస్త్రం ప్రకారం సంపదను పొందే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇంట్లో కొన్ని రకాల అదృష్టం మొక్కలు నాటడం కూడా ఒకటి. ఈ మొక్కలకు సంపదను ఆకర్షించే అద్భుతమైన శక్తి ఉంటుంది. అందుకే వీటిని డబ్బు అయస్కాంతాలు అని పిలుచుకోవచ్చు. చెట్లు, మొక్కలు వంటివి శక్తిని ప్రసరిస్తూ ఉంటాయి. ఆ శక్తి చుట్టు పక్కల ఉన్న వాతావరణం పై ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని మొక్కలు వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తే, మరికొన్ని సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి.
కొన్ని మొక్కలు ఇంట్లో నాటడం వల్ల ఇంటిపై సానుకూల ప్రభావం పాడుతుంది. ఆ మొక్కలు వాస్తు దోషాలను కూడా తొలగిస్తాయి. సానుకూల శక్తి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపై ప్రసరించేలా చేస్తుంది. అలాంటి ప్రత్యేకమైన మొక్కలను ఇంట్లో నాటడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు విజయం దక్కుతుంది. వారి బ్యాంకు బాలెన్స్ కూడా పెరుగుతుంది. డబ్బులు అయస్కాంతంలో ఆకర్షించే మొక్కలు కొన్ని ఉన్నాయి. అవి ఇంట్లో నాటేందుకు ప్రయత్నించండి.
జేడ్ మొక్క
దీన్నే క్రాసులా మొక్క అని కూడా పిలుస్తారు. ఇది సంపదను ఆకర్షించడంలో ముందుంటుంది. దీన్ని మనీ మాగ్నెట్ ప్లాంట్ అని కూడా అంటారు. క్రాసులా మొక్కను ఇంట్లో నాటితే ఎప్పుడూ సంపదకు కొరత ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీనిని పెట్టడం అన్ని విధాలా మంచిది.
వెదురు మొక్క
వాస్తు శాస్త్రమే కాదు, చైనా ఫెంగ్ షూయ్ శాస్త్రం ప్రకారం కూడా వెదురు మొక్క ఎంతో పవిత్రమైనది. ఇది ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది. వెదురు మొక్క ఇంట్లో ఉన్నవారికి ఎంతో పురోగతిని అందిస్తుంది. దీన్ని ఇంట్లో అందంగా కూడా పెట్టుకోవచ్చు.
తులసి మొక్క
హిందూమత గ్రంథాల ప్రకారం తులసి మొక్క లక్ష్మీదేవితో సమానం ప్రతిరోజు పూజించేవారు. ఎంతోమంది సంపదకు అధి దేవతమైన లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను భావిస్తాం. కాబట్టి ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది. తులసి మొక్కన్న ఇంట్లో సంపదకు ఎప్పుడు కొరత ఉండదని నమ్ముతారు.
మనీ ప్లాంట్
పేరులోనే మనీని కలిగి ఉన్న మొక్క ఇది. దీన్ని సంపాదన తెచ్చే మొత్తాన్ని కూడా పిలుస్తారు. నీటిలో, మట్టిలో ఎక్కడ వేసినా ఈ మొక్క జీవించేస్తుంది. గాజు సీసాలో నీరు వేసి ఒక మనీ ప్లాంట్ నాటితే ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తుంది.
శమీ మొక్క
శమీ మొక్క శని దేవునికి సంబంధించింది. మీ ఇంట్లో చిన్న శమీ మోక్కను నాటితే మీ జాతకంలో శని స్థానం సానుకూలంగా మారుతుంది. అలాగే ఈ శమీ మొక్క దగ్గర శనిదేవుని పూజిస్తే ఆ శనీశ్వరుడు సంతోషించి మీకు అపారమైన సంపదను ప్రసాదిస్తాడు.
ఇక్కడ చెప్పిన మొక్కలు అన్నీ కూడా సాధారణమైనవే. ఎక్కువ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్లో వీటిని పెట్టుకునేందుకు ప్రయత్నించండి. మీకు అన్ని రకాలుగా శుభాలు కలుగుతాయి.