E-Paper
Advertisement

WhatsApp New Scam: వాట్సాప్‌లో కొత్త మోసం..ఘోస్ట్ పేయిరింగ్‌తో జాగ్రత్త!

WhatsApp New Scam: వాట్సాప్‌లో కొత్త మోసం..ఘోస్ట్ పేయిరింగ్‌తో జాగ్రత్త!
Advertisement

WhatsApp New Scam: వాట్సాప్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హేయ్.. మీ ఫొటో చూశారా? అంటూ ఏదైనా లింక్‌ వచ్చిందా? తెలిసిన వారి నుంచి వచ్చినా సరే.. పొరపాటున కూడా క్లిక్‌ చేయకండి. ఇదొక ‘ఘోస్ట్ పేయిరింగ్’ (GhostPairing) స్కామ్.. రోజురోజుకీ పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలు, సోషల్ మీడియా వినియోగంతో పాటు ఇలాంటి మోసాలు కూడా కొత్త కొత్త రూపాల్లో బయటపడుతున్నాయి.

ఈ లింక్‌పై క్లిక్ చేస్తే అసలైన వాట్సాప్ వెబ్ పేజీలా కనిపించే ఒక నకిలీ పేజీ ఓపెన్ అవుతుంది. సాధారణంగా వాట్సాప్ వెబ్ ఉపయోగించాలంటే QR కోడ్ స్కాన్ చేయాలి లేదా ఓటీపీ అవసరం ఉంటుంది. కానీ ఈ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్‌లో అలాంటి ఎలాంటి ధృవీకరణ అవసరం ఉండదు. యూజర్‌కు తెలియకుండానే వారి వాట్సాప్ ఖాతా హ్యాకర్ల డివైజ్‌కు లింక్ అయిపోతుంది. దీనినే ‘ఘోస్ట్ పేయిరింగ్’ అంటారు.

Advertisement

ఒక్కసారి హ్యాకర్ల చేతికి ఖాతా వెళ్లితే పరిణామాలు చాలా ప్రమాదకరం. మీ వ్యక్తిగత చాటింగ్స్, ఫొటోలు, వీడియోలు అన్నింటినీ వారు చూసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీ కాంటాక్ట్స్ లిస్ట్ మొత్తాన్ని దొంగిలిస్తారు. మీ పేరుతోనే మీ స్నేహితులు, బంధువులకు సందేశాలు పంపి డబ్బులు అడగడం, లింకులు పంపి మరిన్ని మోసాలకు పాల్పడతారు. కొన్నిసార్లు యూజర్‌ను పూర్తిగా ఖాతా నుంచి లాక్ చేసి, తిరిగి పొందడం కూడా కష్టంగా మారుతుంది.

సైబర్ నిపుణులు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
మొదటగా, అనుమానాస్పద లింక్‌లను అస్సలు క్లిక్ చేయవద్దు. తెలిసిన వ్యక్తి పంపినా సరే, లింక్‌పై అనుమానం ఉంటే ముందు ఫోన్ చేసి లేదా వేరే మార్గంలో కన్ఫర్మ్ చేసుకోవాలి.

Advertisement

రెండవది, వాట్సాప్ సెట్టింగ్స్‌లోని ‘Linked Devices’ ఆప్షన్‌ను తరచూ చెక్ చేయాలి. మీకు తెలియని డివైజ్‌లు ఉంటే వెంటనే వెంటనే రిమూవ్‌ చేయండి.

మూడవది, Two-step verification తప్పనిసరిగా ఎనేబుల్ చేసుకోవాలి. దీనివల్ల మీ ఖాతాను హ్యాక్ చేయడం మరింత కష్టం అవుతుంది. ఒక అదనపు పిన్ ఉండటం మీ ఖాతాకు భద్రతను పెంచుతుంది.

అలాగే, మీ వాట్సాప్‌లో అసాధారణ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సపోర్ట్‌ను సంప్రదించాలి. అనవసరంగా వచ్చే లింకులు, ఫైళ్లను డౌన్‌లోడ్ చేయకపోవడం మంచిది.

Also Read: అప్పులోల వేధింపులు తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య.. కరీంనగర్‌లో ఘోరం

మొత్తానికి, ఒక చిన్న అజాగ్రత్తతో మీ వ్యక్తిగత సమాచారం మొత్తం హ్యాకర్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ ‘ఘోస్ట్ పేయిరింగ్’ స్కామ్ గురించి మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా తెలియజేయండి. మీ జాగ్రత్తే మీ డిజిటల్ భద్రతకు కవచం.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×