E-Paper
Advertisement

WTC Points Table: యాషెస్ సిరీస్ కైవ‌సం..WTCలో ఆస్ట్రేలియా టాప్, టీమిండియా బిగ్ షాక్..మ‌నోళ్ల‌కు ఇంకా ఛాన్స్ ఉందా ?

WTC Points Table: యాషెస్ సిరీస్ కైవ‌సం..WTCలో ఆస్ట్రేలియా టాప్, టీమిండియా బిగ్ షాక్..మ‌నోళ్ల‌కు ఇంకా ఛాన్స్ ఉందా ?
Advertisement

WTC Points Table:  యాషెస్‌ సిరీస్ 2025-2026 టోర్నమెంట్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. యాషెస్ సిరీస్ లో భాగంగా ఇప్పటి వరకు ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 3 టెస్టులు పూర్తయ్యాయి. ఈ మూడు టెస్టుల్లో కూడా ఆస్ట్రేలియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. డిసెంబర్ 17వ తేదీన ప్రారంభమైన ఆడిలైట్ టెస్ట్ లో ఇవాళ ఫలితం తేలింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా జట్టు, ఇంగ్లాండ్ పైన ఏకంగా 82 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అడిలైట్ టెస్ట్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా, 3-0 తేడాతో యాక్సెస్ సిరీస్ గెలుచుకుంది. ఈ రెండు జట్ల మధ్య మరో రెండు టెస్టులు ఉన్నాయి. డిసెంబర్ 26వ తేదీన మెల్ బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుండగా, జనవరి 4వ తేదీన సిడ్ని క్రికెట్ గ్రౌండ్ లో చిట్ట చివరి టెస్ట్ ఉంటుంది.

Also Read: Team India Squad: న్యూజిలాండ్ తో ఆడే టీం ఇండియా జట్టు ఇదే.. గిల్ పై వేటు, అక్షర్ పటేల్ కు బంపర్ ఆఫర్

WTC పాయింట్లు పట్టికలో ఆస్ట్రేలియా టాప్, టీమిండియాకు షాక్

Advertisement

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 -2027 పాయింట్లు పట్టికలో ( WTC Points Table ) ఆస్ట్రేలియా టాప్ లో దూసుకు వెళ్తోంది. మూడవ టెస్ట్ లో గెలిచిన ఆస్ట్రేలియా, 100 పాయింట్లు సంపాదించి, మొదటి స్థానంలో నిలిచింది. అటు మూడవ టెస్టులో ఓడిపోయిన ఇంగ్లాండ్ ఏడవ స్థానానికి పడిపోయింది. కేవలం 27.8 పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్ ఏడో స్థానంలో కూడా సాగుతోంది. అటు ఇండియాకు కూడా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 48.15 పాయింట్లతో ఆరవ స్థానంలో టీమిండియా కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా రెండో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

శ్రీలంక నాలుగో స్థానంలో ఉండగా పాకిస్తాన్ 5వ స్థానం దక్కించుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం మరోసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా అలాగే దక్షిణాఫ్రికా పాల్గొనే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇండియాకు అవకాశాలు లేనట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్ లో టీమిండియా మరో 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కచ్చితంగా ఏడు లేదా ఎనిమిది గెలవాలట. అలా గెలవడం అసాధ్యమని అంటున్నారు.

Advertisement

Also Read:  T20 World Cup 2026 India Squad: గిల్ పీడ విరగడైంది.. టి20 ప్రపంచ కప్ 2026 ఆడే టీమిండియా జట్టు ఇదే

WTCలో టీమిండియాకు ఇంకా ఛాన్స్ ఉందా ?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్థానం దక్కించుకోవాలంటే కనీసం ఏడు లేదా ఎనిమిది మ్యాచ్ లు గెలవాలి. శ్రీలంకలో అక్కడి జట్టుతో రెండు టెస్టులు టీమిండియా ఆడాల్సి ఉంది. అలాగే న్యూజిలాండ్ లో కివీస్ తో మరో రెండు టెస్టులు ఉంటాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు టీమిండియా ఆడనుంది. ఈ తొమ్మిదిలో కనీసం ఏడు లేదా ఎనిమిది టెస్టులు టీమిండియా గెలవాలి. ఇలా గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో టీమిండియా ఆడగలుగుతుంది.

 

 

Related News

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

Big Stories

Advertisement
×