Bachupally Incident: భర్తలను భార్యలు హత్య చేయించడం ట్రెండింగ్‌గా మారిందనకుందో ఏమో.. ఓ మహిళ. తాను కూడ అదే జాబితాలో చేరిపోవాలనుకుందో తెలీయదు కాని, తాను సైతం కిరాయి మనుషులతో భర్తను చంపించాలనుకుంది. అయితే నూకలు గట్టిగా ఉండటంతో బాధిత భర్త బతికి బయటపడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. నలుగురు యువకులతో భర్త రాందాస్‌ను చంపించడానికి భార్య జ్యోతి పక్కా స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం బౌరంపేట్‌లో భర్తకు మద్యం తాగించి అక్కడే బీర్ సీసాలతో దాడి చేయించింది భార్య జ్యోతి. అపస్మారక స్థితిలో పడున్న రాందాస్ మృతి చెందాడని భావించాక అక్కడి నుండి జారుకున్నారు దాడి చేసిన యువకులు.
Also Read: ఆదిలాబాద్ డీసీసీ పీఠం ఎవరికీ?
అయితే, అర్ధరాత్రి కొన ఊపిరితో రక్తపు గాయాలతో తన తమ్ముడి ఇంటికి చేరుకుని విషయాన్ని తెలిపాడు భాదితుడు రాందాస్. బాధితుడు బాచుపల్లి PSలో పిర్యాదు చేయగా.. హత్యాయత్నం ఘటన దుండిగల్ PS కిందకు వస్తుందని జీరో FIR చేసి దుండిగల్‌కు కేసు ట్రాన్స్‌ఫర్ చేశారు బాచుపల్లి పోలీసులు. భార్యభర్తలైన రాందాస్, జ్యోతి బాచుపల్లి PS పరిది రాజీవ్ గృహకల్పలో నివాసముంటున్నారు. భర్తను భార్య ఎందుకు చంపించాలనుకుంది? అనే కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దుండిగల్ PS పరిధిలో భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రామ్‌దాస్ భార్య జోతి, ఆమె ప్రియడు గోపి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది జ్యోతి. తన ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి.. ఫోన్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుండేది. రామ్‌దాస్‌ను బయటకు తీసుకెళ్లిన జ్యోతి మద్యం తాగించి నలుగురు వ్యక్తుల ద్వారా హత్య చేసేందుకు ప్రయత్నించింది.
హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో భార్య బాధితుడు రామ్‌దాస్ తల్లి మన్నేమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కొడుకును రక్తంతో చూసి భయమేసిందని తెలిపింది. రామ్‌దాస్‌కు భార్య జ్యోతికి పెళ్లి అయినప్పటి నుంచి ఇద్దరికి గొడవలే జరుగున్నాయని వాపోయింది. దగ్గరి సంబంధం చేసుకున్నా…తన కొడుకు రామ్‌దాస్‌ను చంపేందుకు ప్రయత్నించిందని మండిపడింది. తన వల్ల ఎప్పుడు ఇంట్లో సంతోషం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
మరో దారుణం.. బీర్‌బాటిళ్లతో దాడి చేయించి భర్తను చంపేందుకు భార్య ప్లాన్!
హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్-దుండిగల్ పీఎస్ పరిధిలో దారుణం
భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి పథకం వేసిన భార్య జ్యోతి
బౌరంపేటలో రాందాస్‌కు మద్యం తాగించి, బీర్‌బాటిళ్లతో దాడి చేసిన యువకులు… pic.twitter.com/dm2gGNy4J2
— BIG TV Breaking News (@bigtvtelugu) July 28, 2025