BigTV English

Brahmamudi Serial Today September 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తీర్థంలో పౌడర్‌ కలిపిన రుద్రాణి – వెనక నుంచి చూసిన కనకం, స్వరాజ్‌

Brahmamudi Serial Today September 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: తీర్థంలో పౌడర్‌ కలిపిన రుద్రాణి – వెనక నుంచి చూసిన కనకం, స్వరాజ్‌

Brahmamudi serial today Episode: అందరూ ఇంద్రాదేవి వాళ్ల రూంలో ఉంటారు. ఇంతలో అపర్ణ అక్కడకు వస్తుంది. వెంటనే రాజ్‌, కావ్య రేవతికి ముసుగు వేస్తుంటారు. ఇంద్రాదేవి, అపర్ణకు అడ్డుగా వెళ్లి తన ముఖం ఎలా ఉందని అడుగుతుంది. అలాగే చెవి దుద్దులు ఎలా ఉన్నాయని అడుగుతుంది. దీంతో అపర్ణ మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. దీంతో ఇంద్రాదేవి కంగారులో దొరికిపోతామని చెప్తుంది. ఏం దొరుకుతారు అని అపర్ణ అడగ్గానే.. అదే అత్తయ్యా పండగ సమయంలో ఏ విషయంలోనైనా తాతయ్య గారికి  దొరికిపోతానేమోనని కంగారు పడుతున్నారు అని కావ్య చెప్తుంది.


సీతారామయ్య కూడా అవును నేనంటే చిట్టికి చాలా భయం అందుకే తెగ కంగారు పడిపోతుంది అంటాడు. దీంతో అపర్ణ ఏంటో ఈరోజు అందరూ విచిత్రంగానే మాట్లాడుతున్నారు. ఆ రాధ అడగడం మర్చిపోయాను.. రాధ మిమ్మల్నే పిలుస్తున్నాను.. అనగానే కావ్య రాధ గారు మిమ్మల్నే పిలుస్తున్నారు అని చెప్పగానే ఏంటండి.. చెప్పండి అంటుంది రేవతి. దీంతో ఆండి ఎందుకు ఆంటీ అనోచ్చు కదా అంటుంది అపర్ణ. ఆంటీ అనడం ఇష్ట లేకపోతే అమ్మా అని పిలువు అక్కా నేను ఎలాగూ నిన్ను అక్కా అంటున్నాను కదా అంటాడు. ఇంతలో పండగ పనులు పక్కన పెట్టి అందరూ ఇక్కడ మీటింగ్‌ పెడితే ఎలా అంటుంది ఇంద్రాదేవి. దీంతో అందరూ అక్కడి నుంచి బయటకు వెళ్తారు.

కింద హాల్లో కూర్చున్న జూనియర్‌ స్వరాజ్‌ కుర్చీలో దర్జాగా కూర్చుని రుద్రాణిని పిలిచి తనకు జ్యూస్‌ తీసుకురమ్మని చెప్తాడు. నేను నీకెందుకు జ్యూస్‌ తీసుకురావాలిరా.. నువ్వేమైన మైసూర్‌ మహరాజువా..? అంటుంది రుద్రాణి.. నేను ఈ ఇంటికి కాబోయే వారసుణ్ణి అంటాడు స్వరాజ్‌.. దీంతో ఫ్రెండ్‌ అంటే వారసుడు అనుకున్నావా..? ఫ్రెండ్‌వు ఫ్రెండ్‌ లాగా ఉండు నేనేం నీకు పని మనిషిని కాదు అంటూ రుద్రాణి తిట్టగానే.. హలో నేను అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను.. నేనే ఈ ఇంటికి కాబోయే వారసుణ్ని అంటాడు. దీంతో నేనేదో వీడి గురించి తెలుసుకుందామనుకుంటే వీడే మొత్తం చెప్తున్నాడు.. వెతకబోయే తీగ కాళ్లకే తగిలిందేమోనని గట్టిగా అందరిని పిలుస్తుంది రుద్రాణి. అందరూ వచ్చి రుద్రాణిని తిడతారు. ఎందుకు పిలిచావని అడుగుతారు.


ఇన్ని రోజులు మీకు తెలియని నిజం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను.. అంటుంది. దీంతో ఇంద్రాదేవి ఏం నిజం చెప్పబోతున్నావు అని అడుగుతుంది. అసలు వీడు ఎవడో తెలుసా..? అంటుంది. అపర్ణ నా ఫ్రెండ్‌ అనగానే.. కాదు వీడు ఈ ఇంటి వారసుడు అని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. ఏంటి రుద్రాణి నువ్వు చెప్పేది స్వరాజ్‌ మన ఇంటి వారసుడు ఏంటి..? అని అపర్ణ అడుగుతుంది. తనే ఈ ఇంటి వారసుడు అని ఎవరు చెప్పారు అని ఇంద్రాదేవి అడుగుతుంది. ఎవరో చెప్పడం ఏంటి అమ్మా.. వీడే చెప్పాడు తనే ఈ ఇంటి వారసుడు అని రుద్రాణి చెప్పగానే.. ఏంటి అత్తయ్యా మీరు చిన్నపిల్లాడు తెలియక వారసుడు అంటే అదే నిజమని నమ్మేయడమేనా..? కొంచెం కూడా కామన్‌ సెన్స్‌ ఉండక్కర్లేదా… అంటూ రాజ్‌ కోపంగా తిడతాడు.

రుద్రాణి.. కామన్‌ సెన్స్‌ ఉంది కాబట్టే కన్‌ఫం చేసుకున్నేంత వరకు మిమ్మల్ని పిలవలేదు.. చిన్న పిల్లాడు ఏదో తెలియక మట్లాడుతున్నాడని అనుకున్నాను.. కానీ వీడికి అన్ని తెలిసే మాట్లాడుతున్నాడని ఆ తర్వాతే అర్థం అయింది. ఈ ఇంటికి వారసుడు అయ్యే అవకాశం రాజ్‌, కళ్యాణ్‌, రాహుల్‌ లకు పుట్టబోయే పిల్లలకు తప్పా ఇంకొకరికి ఉంటుంది నీకు తెలుసా..? వదని నువ్వు వద్దని ఇంట్లోంచి వెళ్లగొట్టిన రేవతి కొడుక్కి కూడా ఉంటుంది. అని రుద్రాణి చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇంద్రాదేవి కోపంగా రుద్రాణి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు.. అసలు ఏం మాట్లాడుతన్నావో నీకైనా అర్తం అవుతుందా..? వాళ్ల అమ్మను ఎదురుగా పెట్టుకుని వాడు మన ఇంటి బిడ్డకు పుట్టిన వాడు అంటే ఏం బాగుంటుంది అంటుంది. దీంతో రుద్రాణి.. ఆ ముసుగులో వచ్చిన ఆవిడ రేవతి కాదని ఏం గ్యారంటీ ఉందమ్మా..? అంటూ అనుమానం వ్యక్తం  చేస్తుంది.

కావ్య కోపంగా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు రేవతి గారు ఇలా ముసుగులో రావడానికి ఆవిడకు ఏం అవసరం.. అంటుంది. అయితే ఒక్క నిమిషం ఉండండ తనెవరో ఇప్పుడే బయటపెడతాను అంటూ రుద్రాణి రేవతి ముసుగు తీసయడానికి వెళ్తుంది.  అపర్ణ కోపంగా రుద్రాణి ఆగు.. మన స్వార్థానికి వాళ్ల ఆచారాన్ని పాడు చేయడం కరెక్టు కాదు. ఆవిడ మన ఇంటికి వచ్చిన అతిథి వాళ్లను అవమానించడం కరెక్టు కాదు.. నాన్న స్వరాజ్‌ నువ్వు ఈ ఇంటి వారసుడివి అన్నావా..? అని అడుగుతుంది. దీంతో అవును అన్నాను.. అంటాడు. ఎందుకు అలా  అన్నావు అని అపర్ణ అడగ్గానే.. ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ ఇల్లు ఎవరిది అంటే..నాదే అన్నావు కదా..? ఇల్లు నాది అయినప్పుడు ఈ ఇంటికి కూడా నేను వారసుణ్ని కదా అంటాడు. నువ్వు ఆ ఉద్దేశంతో అన్నావా…? అని ప్రకాష్‌ అడగ్గానే.. అవునని అంటాడు.. అవునని బాబు చెప్పగానే.. అందరూ కూల్‌ అవుతారు..

తర్వాత రుద్రాణి రూంలోకి వెళ్లి ఏదో పౌడర్‌ తీసుకుని కావ్య, అప్పుల చేత తాగించాలని అనుకుంటుంది. ఈ పౌడర్‌ తాగగానే మీ కడుపుల్లో  పెరుగుతున్న పిండాలు పైకి పోతాయి. ఇక ఈ ఇంటికి వారసురాలు నా మనవరాలే అనుకుని పౌడర్‌ తీసుకుని కిందకు వెళ్తుంది.   దేవుడి దగ్గర ఉన్న తీర్థంలో పౌడర్‌ కలుపుతుంది. వెనక నుంచి కనకం, జూనియర్‌ స్వరాజ్‌ చూస్తారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today September 9th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజు గుండెల్లో దిగిన తీవ్రవాదుల బుల్లెట్స్‌

Intinti Ramayanam Today Episode: శ్రీయాకు దిమ్మతిరిగే షాక్.. చెంప దెబ్బలు.. పల్లవికి స్ట్రాంగ్ కౌంటర్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి దొరికిపోయిన నర్మద, సాగర్.. కళ్యాణ్ దెబ్బకి షాక్.. ధీరజ్ కు ప్రేమ నిజం చెప్తుందా..?

GudiGantalu Today episode: బాలుకు అవమానం.. శివతో మళ్లీ గొడవ.. ఇంట్లో రచ్చ చేసిన సంజయ్..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మిస్ చెయ్యకండి..

×