BigTV English

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

India Vs Pakistan: ఖతార్ పై ఇజ్రాయెల్ దాడితో ఒక్కసారిగా ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ తెరపైకి ఇస్లామిక్ నాటోను తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఇప్పటికే మీటింగ్ కూడా జరిగింది. అయితే ఇందులో అందరికంటే ఎక్కువ అవసరం పాకిస్తాన్ కే ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్ ను సింగిల్ గా ఫేస్ చేయలేకపోతున్న పాక్.. అరబ్ నాటోతో పగటి కలలు కంటోంది. మరి ఇది అయ్యే పనేనా?


ఇస్లామిక్ నాటో కూటమిపై పాక్ ఆశలు

పాకిస్తాన్ ఎప్పటి నుంచో నాటో మాదిరిగా ప్రపంచంలోని అన్ని ముస్లిం దేశాల ఆర్మీ, పొలిటికల్ కూటమి ఏర్పడాలని కోరుకుంటోంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. ముస్లిం దేశంపై దాడి జరిగితే, మిగతా సభ్య దేశాలన్నీ కలసి దాడి చేసిన దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించాలన్నది టార్గెట్. మిగితా దేశాల సంగతి తర్వాత… ముఖ్యంగా పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే, మిగతా ముస్లిం దేశాలన్నీ కలిసి భారత్‌పై సామూహికంగా చర్యలు తీసుకునే పరిస్థితి తీసుకురావాలన్నది పాక్ కల. మరి ఇది అయ్యే పనేనా? అసలు ముస్లిం దేశాలు ఒక్కతాటిపై ఉంటాయా లేదా అన్నది వన్ బై వన్ డీకోడ్ చేద్దాం.


2015లో సౌదీ నేతృత్వంలో IMCTC గ్రూప్

ఇస్లామిక్ అరబ్ నాటో ఏర్పాటు చేయాలన్నది కొత్త విషయం కాదు. 2015లో సౌదీ అరేబియా నేతృత్వంలో ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెరరిజం కోలిషన్ – IMCTC ఏర్పడింది. ఇందులో 34 ముస్లిం మెజారిటీ దేశాలకు సభ్యత్వం ఉంది. ఇందులో పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా, ఆఫ్రికా నుంచి చాలా దేశాలున్నాయి. అయితే ఈ గ్రూప్ లో చాలా దేశాలు అనుకునేదేంటంటే.. ఇది ముస్లిం దేశాల ఐక్యత కోసం కాదు.. ఇరాన్ దాని మిత్ర దేశాలను కంట్రోల్ చేయాలన్న ప్రయత్నంగానే చూస్తుంటాయి. ఎందుకంటే ముస్లిం మెజార్టీ దేశాల్లో చాలా అంతర్గత విబేధాలు ఉన్నాయి. కంటికి కనిపించని శత్రుత్వాలు ఉన్నాయి. ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్.. సౌదీ అరేబియాలో సున్నీ ప్రాబల్యం ఉంటుంది. ఇరాన్‌లో షియాలు ఎక్కువగా ఉంటారు. సో వీళ్లిద్దరికీ పడదు. అందుకే పరోక్ష యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో జియో పొలిటికల్ గేమ్స్ ఇస్లామిక్ కంట్రీస్ మధ్యలో చాలా ఉన్నాయి.

ఆరబ్ నాటో వస్తే కీరోల్ పోషించాలనుకుంటున్న పాక్

అందరి బాధ ఒకటైతే పాకిస్తాన్ బాధ మరొకటి. అఫ్ఘనిస్తాన్ లో అమెరికా సైన్యం ఉన్నప్పుడు పాక్ కీలకంగా ఉంది. ఆ తర్వాత దాయాది ఇంపార్టెన్స్ తగ్గింది. సో ఇప్పుడు ఇస్లామిక్ నాటో లేదంటే అరబ్ నాటో అనేది తెరపైకి వస్తే అందులో కీరోల్ పోషించాలని తహతహలాడుతోంది. ఇందులో చేరి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయంగా తీసుకెళ్లడం, కొత్త కూటమిలో దీన్ని చర్చకు పెట్టి వారి మద్దతుతో భారత్ పై ఒత్తిడి తేవాలనుకోవడం ఇలాంటి స్ట్రాటజీస్ కనిపిస్తున్నాయి. వీటికి తోడు ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్.. ఇస్లామిక్ కూటమి పేరుతో ఆయిల్ సబ్సిడీస్ పొందడం, విదేశీ పెట్టుబడులు తెచ్చుకోవడం, ఆర్థిక సాయం పొందవచ్చనే ఆశ కూడా ఉంది.

మనం చమురు కొనడం గల్ఫ్ దేశాలకు అవసరం

సో కొత్త ఇస్లామిక్ కూటమి ఏర్పడితే భారత్ పై ఎఫెక్ట్ ఎంత ఉందో చూద్దాం. గల్ఫ్ దేశాలకు భారత్ కీలక మిత్ర దేశం. ఇండియా నుంచి కార్మికులు ఎక్కువ సంఖ్యలో అరబ్ దేశాల్లో పని చేస్తున్నారు. ఆయిల్ & గ్యాస్ ట్రేడ్ చాలా కీలకంగా ఉన్నాయి. సో మనం ఆయిల్ కొనడం మిడిల్ ఈస్ట్ కు ఎకనామికల్ గా ముఖ్యం. మనం ఆయిల్ కొనకపోతే ఆ దేశాలకే నష్టం. పైగా రష్యా చాలా చవకగా చమురు అందిస్తోంది. ఏదైనా సహాయ నిరాకరణ చేస్తే మనం మొత్తం రష్యావైపు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అన్ని రకాలుగా కొత్త కూటమికే నష్టం. అటు భారత్ లో ముస్లింలకు భద్రత లేదు అన్న విషయాన్ని పాక్ ప్రొజెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఏ రకంగా చూసినా కొత్త కూటమి భారత్ ను టార్గెట్ చేయడం కలే. పాకిస్థాన్ ఆశించినట్లు భారత్‌ను ఒంటరి చేయాలనుకోవడం అసాధ్యం.

ఇవాళ ఖతర్ పై దాడి జరిగింది.. రేపు మీపై కూడా ఎటాక్ జరగొచ్చు. అందుకే అలర్ట్ అవుదాం.. కలుద్దాం, తిరగబడుదాం.. ఇలాంటి డైలాగ్ లతో పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాల్లో ఉంది. మరి ఇస్లామిక్ దేశాలు ఒక్కతాటిపై ఉండే ఛాన్స్ ఎంత? ఏయే దేశాల మధ్య ఎలాంటి గొడవలున్నాయి?

ముస్లిం దేశాల మధ్య అంతర్గత సంఘర్షణలు

ఇజ్రాయెల్ తనకు నచ్చిన చోట దాడి చేస్తుంది, ఏది కావాలంటే అది చేస్తుంది. మరి చూస్తూ ఊరుకుందామా.. ఇదీ ప్రతిపాదిత ఇస్లామిక్ నాటో కూటమి దేశాల మాట. ఇది బయటకు బాగానే ఉన్నా.. ఇరాన్ కొన్ని నెలల క్రితమే ఖతార్‌పై తన సొంత క్షిపణులతో ఎటాక్ చేసింది. అణ్వాయుధాలు కలిగి ఉన్న ఏకైక ముస్లిం దేశమైన పాకిస్తాన్, ఇజ్రాయెల్ ను కంట్రోల్ చేయడం, రివర్స్ ఎటాకింగ్ వ్యూహాలను రెడీ చేయడానికి టాస్క్ ఫోర్స్ కోసం పిలుపునిచ్చింది. తాజాగా ఖతార్‌పై ఇజ్రాయెల్‌ దాడితో ముస్లిం దేశాలు ఒకే లైన్ పై ఉండాలన్న ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇటీవలే 57 ముస్లిం దేశాలు ఖతార్ దోహాలో సమావేశమయ్యాయి. అందులో 22 అరబ్‌ దేశాలు కూడా ఉన్నాయి. ఏ ఒక్క ముస్లిం దేశంపై దాడి చేసినా.. అది తమందరిపై దాడి చేసినట్లేనని, మూకుమ్మడిగా జవాబు ఉంటుందని చెప్పాయి.

సున్నీ-షియా గ్యాప్, ఆధిపత్య పోరాటాలు

అయితే ఇది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు. ఇక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ముస్లిం ప్రపంచంలో సున్నీ-షియా గ్యాప్ ఉంది. ఆధిపత్య పోరాటాలున్నాయ్. సౌదీ, యుఎఇ, పాక్.. ఇలాంటివి సున్నీలు ఎక్కువున్న దేశాలైతే.. ఇరాన్, ఇరాక్, సిరియా, లెబనాన్ షియా గ్రూప్ డామినెంట్ గా ఉన్నాయి. ఈ రెండు గ్రూప్ లు కలిసే చాన్స్ తక్కువ. కలిసినా ఇంటర్నల్ గా జియోపొలిటికల్ రైవల్రీ ఉండనే ఉంటుంది. టర్కీ- సౌదీ మధ్య పోటీ, ఖతార్-సౌదీ మధ్య వైరుధ్యం ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటికి తోడు కొన్ని ముస్లిం దేశాలు అమెరికా వైపు, మరికొన్ని పాక్, ఇరాన్ వంటివి చైనా వైపు ఉన్నాయి. మరికొన్ని రష్యా వంటి దేశాల వైపు ఉన్నాయి. ఇన్ని వైరుధ్యాల మధ్య యూనిటీ సాధ్యమా?

అమెరికాతో యూఏఈ, సౌదీతో సంబంధాలు

కలిసి నడిచేందుకు ఏ దేశాలు కూటమిగా ఏర్పడ్డా తప్పు లేదు. కానీ కుట్రలు చేస్తామంటేనే కుదరదు. సౌదీ, ఈజిప్ట్, టర్కీ, ఇరాన్ కీలక పోటీదారులుగా ఉన్నాయి. ప్రతి దేశానికి రాజకీయ, భద్రతా, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. యూఎస్ కు మిడిల్ ఈస్ట్ లో ఖతార్ – అల్ ఉదీద్, యుఎఇ – అల్ దఫ్రా, బహ్రెయిన్ – ఫిఫ్త్ ఫ్లీట్ లో స్థావరాలు ఉన్నాయి. సో అమెరికాతో యూఏఈ, సౌదీ సంబంధాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వీటికి తోడు టర్కీ నాటో సభ్య దేశం. దీంతో నాటోకు వ్యతిరేక కూటములు అంటే వీళ్లు అనుకుంటున్న ఇస్లామిక్ నాటోలో పూర్తి తడాఖా చూపించే అవకాశం లేదు. ఖతార్, యుఎఇ, సౌదీ, కువైట్ మధ్య అంతర్గత విబేధాలున్నాయి.

సైన్యం ఆధునీకరణ, రక్షణ భాగస్వామ్యం

ఇస్లామిక్ నాటో ఇప్పుడిప్పుడే ఓ షేప్ తీసుకుంటోంది. ఒకవేళ కూటమిగా ఏర్పడితే.. నాటో తరహా ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను నిర్వహిస్తాయి. తమ సైన్యాలను ఒకదానితో ఒకటి ఆధునీకరించుకుంటారు. రక్షణ భాగస్వామ్యం ఏర్పడుతుంది. నిఘా సమాచారాన్ని పంచుకుంటారు. ఇస్లామిక్ యూనిటీని ప్రోత్సహించడం లక్ష్యంగా అడుగులు వేసే అవకాశం ఉంటుంది. నిజానికి ఇస్లామిక్ నాటో కొత్త ఆలోచన కాదు. ఇది యెమెన్ యుద్ధ సమయంలో తెరపైకి వచ్చింది. ISIS ఆవిర్భావ సమయంలో ఇది తిరిగి వినిపించింది. కానీ ప్రతిసారీ అపనమ్మకం, గ్రూప్ వార్, వేర్వేరు ప్రాధాన్యతలతో సైలెంట్ అయింది.

Also Read: అమెరికాలో ఘోరం.. పాలమూరు విద్యార్థిని కాల్చి చంపిన పోలీసులు

సో కైరోలో అరబ్‌ నాటో ఆఫీస్ ఏర్పాటు చేద్దామని ఈజిప్టు అంటోంది. ఈ ఇస్లామిక్ నాటోకు తాము 20వేల మంది ఆర్మీని అందిస్తామని, ఈజిప్షియన్‌ ఫోర్‌స్టార్‌ జనరల్‌ను తొలి కమాండర్‌గా పెడుతామని చెబుతోంది. రెగ్యులర్ గా లీడర్ షిప్ ను మారుస్తూ ఉండాలని, త్రివిధ దళాలతోపాటు.. కమాండో యూనిట్లు, ఆర్మీ ట్రైనింగ్ లు ఇవ్వాలని అంటోంది. దీనికి పాకిస్థాన్, టర్కీ, ఇరాన్‌ ఓకే అంటున్నాయి. డిప్యూటీ కమాండ్‌ పాత్రలో సౌదీ అరేబియాను, నిధులు, లేటెస్ట్ కెపాసిటీల కోసం యూఏఈ, బహ్రెయిన్‌లను దింపాలని ఈజిప్టు అనుకుంటోంది. సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, ఇరాక్, కువైట్, ఖతార్, ఈజిప్టు, ఇండోనేషియా, మలేసియా, పాకిస్థాన్‌ సహా 50కి పైగా దేశాలు అరబ్‌ నాటోలో భాగం అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.

ఖతార్ పై దాడి తర్వాతే కదలిక మొదలైందా?

కొన్ని దశాబ్దాలుగా ముస్లిం దేశాలు ఎన్నోసార్లు పాలస్తీనాపై దాడిని ఖండించాయి. అయితే ఇజ్రాయెల్ ను నిలువరించలేకపోయాయి. కారణం ఈ దేశాలకు అమెరికాతో దోస్తీ ఉంది. అమెరికాకు ఇజ్రాయెల్ తో ఫెవికాల్ బంధం ఉంది. ఖతార్‌పై దాడి జరిగిన తర్వాతే వారిలో కొంత కదలిక వచ్చినట్లు కనిపిస్తోంది. ముస్లిం దేశాల అతి పెద్ద వీక్ నెస్ ఏంటంటే.. వారి దగ్గర ఆర్మీ బలం లేకపోవడం కాదు. అంతర్గత విభేదాలే. పాలస్తీనా సమస్యకు తామే పరిష్కారం చూపామన్న పేరు కోసం పాకులాడుతున్నాయి. ఖతార్, యుఎఇ వంటి గల్ఫ్ దేశాలు యుఎస్ ప్రధాన ఆయుధ కొనుగోలుదారులు. 2020-24 మధ్య అమెరికా నుంచి ఆయుధాలు కొన్ని దేశాల్లో ఖతార్ మూడో స్థానంలో నిలిచింది. అంటే ఎక్కడి లెక్కలు అక్కడే అన్నట్లు ఉన్నాయి. అంటే సీన్ మారుతుందా.. లేకపోతే మళ్లీ చల్లారిపోతుందా అన్నది చూడాలి. నిజానికి ప్రపంచంలో ఏ కూటమి ఏర్పడుతున్నా అందులో అమెరికా, చైనా తల దూరుస్తుంటాయి. ఇప్పుడు ఈ ఇస్లామిక్ నాటోలో ఆరంభానికి ముందే ఏం జరుగుతుందో చూడాలి.

Story By Vidya sagar, Bigtv

Related News

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Air India Flight: విశాఖ – హైదరాబాద్ విమానానికి.. తృటిలో తప్పిన ప్రమాదం

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరద బీభత్సం.. కొండచరియలు విరిగి 10 మంది గల్లంతు

Kerala: కేరళలో కొత్త వైరస్.. 100 మందికి పైగా..?

Rahul Gandhi: ఎన్నికల సంఘంపై రాహుల్‌ విసుర్లు.. ఆధారాలు ఇవిగో, కీలక విషయాలు వెల్లడి

Narendra Modi: మోదీ @ 75.. ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఆ శక్తి వెనుక రహస్యాలు..

Modi Assets: 75 ఏళ్లుగా మోదీ సంపాదన ఇంతేనా? ఆయన ఎక్కడ పొదుపు చేస్తారు?

Big Stories

×