E-Paper
Advertisement

వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములా.. మామూలు మహిళ కాదు, సాప్ట్‌గా ప్లాన్ చేసి భర్తని పైలోకానికి పంపి

వన్ షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములా.. మామూలు మహిళ కాదు, సాప్ట్‌గా ప్లాన్ చేసి భర్తని పైలోకానికి పంపి
Advertisement

Mancherial Crime: వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. ఫలితంగా భర్తలను చంపేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి చూసింది. బీమా సొమ్ము కోసం ప్రియుడితో కలిసి భర్తను లేపేసింది కట్టుకున్న భార్య.

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో దారుణమైన ఘటన

Advertisement

మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో దారుణం వెలుగుచూసింది. గుడిపేట గ్రామంలో 40 ఏళ్ల సాయికుమార్‌.. తన భార్య భారతి కలిసి నివాసం ఉంటున్నాడు. మరి భార్య భర్తల మధ్య ఏం జరిగిందో తెలీదుగానీ భారతికి ఓ వ్యక్తితో కొంతకాలంగా టచ్‌లోకి వెళ్లింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం తెలిసిన తర్వాత భార్యభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. ఈ క్రమంలో సాయిని పైలోకానికి పంపాలని డిసైడ్ అయ్యంది భారతి. తన ప్రియుడితో చక్కటి మాస్టర్ ప్లాన్ చేసింది. ఏడాది కిందట భర్త పేరుతో మూడు కోట్ల రూపాయలకు జీవిత బీమా పాలసీలు చేయించింది.

Advertisement

బీమా సొమ్ముల కోసం భర్తను ప్లాన్ చేసి లేపేసిన భార్య

సీన్ కట్ చేస్తే.. మే 22న రోడ్డు ప్రమాదంలో సాయి మరణించినట్లు కేసు నమోదైంది. మృతుడి తల్లి లక్ష్మి తన కొడుకు మరణంపై అనుమానం వ్యక్తం చేసింది. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. విచారణలో సాయి భార్య భారతి.. సొంత గ్రామానికి చెందిన సురేందర్‌తో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. వారిద్దరు కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని ఈ స్కెచ్ వేసినట్టు తేలింది.

భర్తను ఎలా లేపేసిందనేది అసలు మేటర్. సాయిని చంపేందుకు భారతి-ఆమె ప్రియుడు.. రామ్ మల్లేష్ అనే వ్యక్తితో డీల్ సెట్ చేసుకున్నారు. అందుకోసం రూ.10 లక్షలకు డీల్ కుదిరింది. అడ్వాన్సుగా రూ.2 లక్షలు చెల్లించింది భారతి.

ALSO READ: ఆటోలు, బ్యాటరీలే టార్గెట్.. పక్కా స్కెచ్‌తో పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు!

మే 22న సాయికు పుల్ గా మద్యం తాగించి సుత్తితో తలపై మోది హత్య చేశారు. ఆ ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని బైక్‌ను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి సుఫారీ గ్యాంగ్ పరార్ అయ్యింది. సాయిది హత్యగా గుర్తించిన పోలీసులు, భారతి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దీంతో అసలు విషయం బయటపడింది.

రూ 3 కోట్లకు బీమా సొమ్ముకు ప్రియుడితో కలిసి ప్లాన్‌ వేసింది భారతి. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన సుత్తి, రూ.25వేలు నగదు, టూ వీలర్, ఇన్సూరెన్స్‌ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అతిగా ఆడింది.. ఫలితంగా భర్త లేదు.. చివరకు జైలు పాలు అయ్యింది.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×