Theft Gang: స్వేచ్చ బ్యూరో: వాహనాలను తస్కరిస్తూ తప్పించుకు తిరుగుతున్న ముఠాను శంషాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు పహాడీషరీఫ్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మూడు ఆటోలు, తొమ్మిది బ్యాటరీలు స్వాధీనం చేసున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ కే.శ్రీనివాస రావు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
బహదూర్ పురా ప్రాంతానికి చెందిన మహ్మద్ అక్భర్ (35), ఫైజుల్లా ఖాన్ (42)లు స్నేహితులు. ఆరునెలల క్రితం బ్యాటరీలో చోరీ కేసులో ఈ ఇద్దరిని ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు రిమాండ్ చేశారు. జైల్లో వీరికి జిర్రా వాస్తవ్యiడు మహ్మద్ హమీదుద్దీన్ (27)తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బెయిల్ పై విడుదలైన వెంటనే ఈ ముగ్గురు తిరిగి నేరాలు చేయటం మొదలు పెట్టారు. ఈ క్రమంలో జడ్చర్ల, మహబూబ్ నగర్ టౌన్, రూరల్ పరిధిలో మూడు ఆటోలను దొంగిలించారు.
Also Read: గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారీ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!
వీటిల్లో రాత్రివేళల్లో తిరుగుతూ పార్కింగ్ స్థలాల్లో ఉంచిన డీసీఎంలు, ట్రాక్టర్ల బ్యాటరీలను దొంగిలించడం ప్రారంభించారు. మేడ్చల్, తుక్కుగూడ, మహేశ్వరం ప్రాంతాలలో వరుసగా ఈ తరహా నేరాలకు పాల్పడ్డారు. కాగా, గ్యాంగ్ గురించి పక్కాగా సమాచారాన్ని సేకరించిన టాస్క్ ఫోర్స్ సీఐ వెంకట్ రెడ్డి, పహాడీషరీఫ్ డీఐ దెబోరా, ఎస్‌ఐలు నాగరాజు, శేషుతోపాటు సిబ్బందితో కలిసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 7లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
Also read: ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న రజనీకాంత్ పాత బస్ కండక్టర్ ఐడీ కార్డ్!