Chennai’s IT Corridor: ఐటీ కారిడార్‌లో పెద్ద బ్యాగ్ కనిపించింది. చాలా బరువుగా ఉండడం, ఆపై వాసన రావడంతో కొంతమందికి అనుమానం వచ్చింది. దీంతో ఆ వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అసలు ఐటీ కారిడార్‌లో ఏం జరిగిందనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై కూపీ లాగే పనిలో పడ్డారు పోలీసులు.
తమిళనాడులోని చెన్నై ఐటీ కారిడార్‌లో గురువారం ఉదయం భారీ సూట్ కేసును గుర్తించారు పోలీసులు. అందులో ఓ మహిళ డెడ్ బాడీ కనిపించడంతో షాకయ్యారు. ఇంతకీ ఈ మహిళ ఎవరు? అనేది పోలీసులకు కత్తి మీద సాముగా మారింది.
మహిళలను ఇక్కడే హత్య చేశారా? లేక మరో ప్రాంతంలో చంపేసి మృతదేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా? అనేదానిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతురాలికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు.
సమీపంలోని పోలీసుస్టేషన్‌లో మహిళపై ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా అనేదానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఐటీ కారిడార్‌కు వచ్చే రూట్లకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగా దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి మహిళ మృతదేహం వెనుక ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.